MI vs KKR : ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా సూర్య‌కుమార్ యాద‌వ్.. ఎట్ట‌కేల‌కు మౌనం వీడిన ముంబై హెడ్ కోచ్ జ‌య‌వ‌ర్ధ‌నే.. అలా ఎందుకు చేశామంటే?

ఆదివారం ముంబైలోని వాంఖ‌డే మైదానంలో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో (MI vs KKR) 6 వికెట్ల తేడాతో ముంబై గెలుపొందింది.

IPL 2026 MI vs KKR Mahela Jayawardene explained why Suryakumar Yadav as Impact Player

  • ఆదివారం కేకేఆర్‌తో త‌ల‌ప‌డిన ముంబై
  • ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా ఆడిన సూర్య‌కుమార్ యాద‌వ్‌
  • కార‌ణం చెప్పిన ముంబై కోచ్ జ‌య‌వ‌ర్ధ‌నే

MI vs KKR : ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్ విజ‌యంతో బోణీ కొట్టింది. ఆదివారం ముంబైలోని వాంఖ‌డే మైదానంలో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ముంబై గెలుపొందింది. అయితే.. ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా టీ20 కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్‌ను ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా ఆడించ‌డం పై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. ముంబై జ‌ట్టులో మొత్తం బాగుందా? ఏమైనా స‌మ‌స్య‌లు ఉన్నాయా? అని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు.

ఇక ఎట్ట‌కేల‌కు దీనిపై ముంబై ఇండియ‌న్స్ హెడ్ కోచ్ మ‌హేలా జ‌య‌వ‌ర్ధ‌నే స్ప‌ష్టత ఇచ్చాడు. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026లో భార‌త్‌ను గెలిపించేందుకు సూర్య తీవ్రంగా శ్ర‌మించాడ‌ని, ఈ క్ర‌మంలో అత‌డికి కొంత విశ్రాంతి ఇవ్వాల‌నే ఉద్దేశ్యంతోనే ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా ఆడించిన‌ట్లు చెప్పుకొచ్చాడు.

PSL 2026 : బాల్ ట్యాంప‌రింగ్ పై కెప్టెన్ షాహీన్ అఫ్రిది కామెంట్స్‌.. వీడియో చూసి..

మీరు అనవసరమైన క‌థ‌నాలు సృష్టించరని ఆశిస్తున్నాను. శిబిరం చాలా సంతోషంగా ఉంది. అందరూ సంతోషంగా ఉన్నారు. స్కై (సూర్య‌) వచ్చి మాతో కలిశాడు. అతనికి అదనంగా మరో రెండు రోజులు కావాలని కోరుకున్నాడు. అతడు గజ్జల్లో కొద్దిగా నొప్పితో బాధ‌ప‌డుతున్నాడు. త‌రువాతి మ్యాచ్‌కు 5 రోజుల స‌మ‌యం ఉంద‌ని తెలుసు. అత‌డికి ఎక్కువ విశ్రాంతి ఇవ్వాల‌ని అనుకున్నాను. అని జ‌య‌వ‌ర్ధ‌నే తెలిపాడు.

ఇది ఒక మార్పు మాత్ర‌మే. ద‌య‌చేసి ఎలాంటి క‌థ‌లు అల్ల‌కండి. మేము ముందు జాగ్ర‌త్త మాత్ర‌మే తీసుకున్నాము. సూర్య ఎంతో ముఖ్య‌మైన ఆట‌గాడు. సీజ‌న్ మొత్తం అత‌డు జ‌ట్టులో ఉండ‌డం చాలా ముఖ్య‌మైన విష‌యం. ఇది.. నేను, యాజ‌మాన్యం ఎంతో తీవ్రంగా ఆలోచించి తీసుకున్న నిర్ణ‌యం. అంతే.. అంత‌కు మించి ఇంకా ఏమీ లేదు అని జ‌య‌వ‌ర్ధ‌నే అన్నాడు.

MI vs KKR : ముంబై పై ఓట‌మి.. నాకేం తెలియ‌దు.. ఆ విష‌యం క్రికెట్ ఆస్ట్రేలియానే అడ‌గాలి.. అజింక్యా ర‌హానే కీల‌క వ్యాఖ్య‌లు..

ఈ మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా బ‌రిలోకి దిగిన సూర్య‌కుమార్ యాద‌వ్ 8 బంతులు ఎదుర్కొని 16 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. ఏదీ ఏమైన‌ప్ప‌టికి కూడా సూర్య‌కుమార్ యాద‌వ్ గాయంతో బాధ‌ప‌డుతున్న‌ట్లు జ‌య‌వ‌ర్ధ‌నే ధృవీక‌రించాడు. దీంతో అత‌డు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.