PSL 2026 : బాల్ ట్యాంపరింగ్ పై కెప్టెన్ షాహీన్ అఫ్రిది కామెంట్స్.. వీడియో చూసి..
పాకిస్థాన్ సూపర్ లీగ్ 2026 (PSL 2026)లో భాగంగా ఆదివారం లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియం వేదికగా కరాచీ కింగ్స్, లాహోర్ ఖలందర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.
PSL 2026 Lahore Qalandars vs Karachi Kings Fakhar Zaman Ball Tampering videos viral
PSL 2026 : బాల్ ట్యాంపరింగ్ వివాదం పై మ్యాచ్ ముగిసిన తరువాత ప్రజంటేషన్ కార్యక్రమంలో లాహోర్ ఖలందర్స్ కెప్టెన్ షాహీద్ అఫ్రిదికి ప్రశ్న ఎదురుకాగా అతడు తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఈ విషయం గురించి తనకు తెలియదన్నాడు. వీడియోలో రికార్డు అయి ఉంటే.. దాన్ని చూసిన తరువాత దాని గురించి చర్చిస్తామన్నాడు.
‘నిజం చెబుతున్నాను దాని గురించి నాకేమీ తెలియదు. ఒకవేళ వీడియోలో ఏదైన రికార్డు అయి ఉంటే.. దాన్ని చూసిన తరువాత ఏం చేయాలనే దానిపై టీమ్‌తో చర్చిస్తాను. 5 పరుగులు తీసేసుకున్నారు. మేము ఏమీ చేయలేకపోయాము. ఇంతకు మించి ఏమీ మాట్లాడలేను. మా జట్టు గెలిచేందుకు చివరి వరకు పోరాడింది.’ అని ఖలందర్ కెప్టెన్ షాహీన్ అఫ్రిది అన్నాడు.
అసలేం జరిగిందంటే?
పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) 2026 లో భాగంగా ఆదివారం లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియం వేదికగా కరాచీ కింగ్స్, లాహోర్ ఖలందర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన లాహోర్ ఖలందర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసింది. ఆ తరువాత 129 పరుగుల లక్ష్యంతో కరాచీ కింగ్స్ బరిలోకి దిగగా..19 ఓవర్లు పూర్తి అయ్యే సరికి 5 వికెట్లు కోల్పోయి 115 పరుగులు సాధించింది.
Ramiz Raja to Shaheen Afridi:
“The ball was taken from you at the end because of the ball tempering so what are your thoughts on that?”
Shaheen Afridi:
“I don’t know about this. We will see that in cameras. We will discuss who did that.” pic.twitter.com/j2f8ofri3y
— Harshita Sharma (@GarvitUttam) March 29, 2026
ఈ సమయంలో ఆఖరి ఓవర్లో 6 బంతులు 14 పరుగులు చేయాల్సిన స్థితిలో కరాచీ కింగ్స్ నిలిచింది. ఈ దశలో ఆఖరి ఓవర్‌ను హరీస్ రవూఫ్ సిద్ధం అయ్యాడు. లాహోర్ ఖలందర్స్ కెప్టెన్ షాహీన్ అఫ్రిది అతడికి కొన్ని సూచనలు చేస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో హరీస్ రవూఫ్ నుంచి బంతి తీసుకున్న ఫఖర్ జమాన్ తన గోళ్లతో బంతి రూపు రేఖలను (ట్యాంపరింగ్ )మార్చే ప్రయత్నం చేశాడు.
This is so Shameful
— Ehtisham Siddique (@iMShami_) March 29, 2026
దీన్ని గమనించిన ఆన్ ఫీల్డ్ అంపైర్ పైసల్ అఫ్రిది బంతిని వారి వద్ద నుంచి తీసుకుని మరో ఆన్‌ఫీల్డ్ అంపైర్ షర్ఫుద్దౌలాతో సుదీర్ఘంగా చర్చించాడు. బంతిని ఉద్దేశపూర్వకంగానే మార్చారని ఇద్దరు అంపైర్లు నిర్ధారించారు. వెంటనే బంతిని మార్చడంతో పాటు ప్రత్యర్ధి జట్టు అయిన కరాచీ స్కోరు బోర్డుకు ఐదు పరుగులు యాడ్ చేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న కరాచీ మూడు బంతుల్లోనే 9 పరుగులు చేసి 19.3 ఓవర్లలోనే గెలుపును సొంతం చేసుకుంది.
ప్రస్తుతం ఈ బాల్ ట్యాంపరింగ్ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
