IPL 2026 MI vs LSG : వాంఖడేలో రోహిత్ శర్మ విధ్వంసం.. ఓటమిపై లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ కీలక కామెంట్స్.. టార్గెట్‌ను ఇలా ఊదేశారు..
IPL 2026 MI vs LSG : ఐపీఎల్ 2026లో భాగంగా ముంబై ఇండియన్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
- Harish Thanniru
- Updated on- May 5, 2026 / 07:06 AM IST
IPL 2026 MI vs LSG
- లక్నోపై ముంబై ఇండియన్స్ విజయం
- 83 పరుగులతో రికెల్టన్, 84 పరుగులతో రోహిత్ విధ్వంసం
- ఓటమిపై నిరాశ వ్యక్తం చేసిన లక్నో కెప్టెన్ రిషబ్ పంత్
IPL 2026 MI vs LSG : ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా సోమవారం రాత్రి వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Also Read : BCCI : ఐపీఎల్‌లో గర్ల్‌ఫ్రెండ్ కల్చర్ పై బీసీసీఐ ఆగ్రహం.. త్వరలోనే కొత్త నిబంధనలు..!
తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 228 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారీ స్కోర్‌ను ఛేదించే క్రమంలో ఓపెనర్లుగా క్రీజులోకి వచ్చిన రోహిత్ శర్మ (84), రికెల్టన్ (83)లు బ్యాటుతో విధ్వంసం సృష్టించారు. గాయం కారణంగా గత నాలుగు మ్యాచ్‌లకు దూరంగా ఉన్న రోహిత్.. తాజాగా లక్నోతో మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా క్రీజులోకి వచ్చి బౌండరీల మోత మోగించాడు. దీంతో ముంబై ఇండియన్స్ 18.4 ఓవర్లలోనే నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 229 పరుగులు చేసింది. ఫలితంగా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశాడు.
పంత్ మాట్లాడుతూ ఓటమిపై నిరాశను వ్యక్తం చేశాడు. మా జట్టు పరిస్థితి ఏ మాత్రం బాలేదు.. మావైపు లక్ లేదు అంటూ చెప్పుకొచ్చాడు. లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ వైఫల్యం తమ విజయావకాశాలను దెబ్బతీసింది. మేము ఇంకా పది నుంచి 15 పరుగులు చేసిఉంటే బాగుండేది. మ్యాచ్ మరో విధంగా సాగేది. ఈ ఓటమికి బౌలర్లను నిందించలేమన్న పంత్.. ముంబై బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారంటూ కొనియాడారు.
మా బ్యాటర్లు చాలా స్వేచ్ఛగా ఆడారు. కానీ, ముంబై బౌలర్లు అద్భుతంగా పుంజుకొని మమ్మలను కట్టడి చేశారు. దీంతో మాకు లభించిన ఆరంభాన్ని మేము పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోలేక పోయాం. మా జట్టుకు కొంచెం అదృష్టం కావాలి. నేను చెప్పగిలిగేది అదే. అదృష్టం ఎలా వస్తుంది.. అంటే చాలా మంది దీవెనలు ఉంటే లక్ మావైపు ఉంటుందని భావిస్తున్నా. అలాగే మా వైపు నుంచి ఇంకా ఎక్కువ కష్టపడాల్సి ఉంది. ఇది మాత్రం ఖాయం అంటూ పంత్ చెప్పుకొచ్చాడు.
