Priyansh Arya : ప్రియాన్ష్ ఆర్య నువ్వు మామూలోడివి కాద‌య్యా.. కోహ్లీ, రోహిత్ వంటి దిగ్గ‌జాల‌కు సాధ్యం కానీ రికార్డు..

పంజాబ్ కింగ్స్ యువ ఓపెన‌ర్ ప్రియాన్ష్ ఆర్య (Priyansh Arya) అరుదైన ఘ‌న‌త సాదించాడు.

IPL 2026 PBKS vs DC Priyansh Arya creates history two times first ball of a match for a six (pic credit@ipl)

  • ప్రియాన్ష్ ఆర్య అరుదైన ఘ‌న‌త‌
  • ఐపీఎల్ మ్యాచ్‌లో తొలి బంతికే సిక్స్‌
  • రెండు సార్లు ఈ ఘ‌న‌త సాధించిన ఏకైక ప్లేయ‌ర్‌

Priyansh Arya : పంజాబ్ కింగ్స్ యువ ఓపెన‌ర్ ప్రియాన్ష్ ఆర్య అరుదైన ఘ‌న‌త సాదించాడు. రెండు సార్లు ఐపీఎల్ మ్యాచ్‌లో తొలి బంతికే సిక్స్ కొట్టిన ఏకైక ఆట‌గాడిగా చ‌రిత్ర సృష్టించాడు. సోమ‌వారం ధ‌ర్మ‌శాల వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో అత‌డు మొద‌టి బంతికే సిక్స్ కొట్టి ఈ ఘ‌న‌త‌ను అందుకున్నాడు. గ‌తంలో 2025 ఐపీఎల్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ పై అత‌డు తొలి బంతికే సిక్స్ బాదాడు.

తొలి బంతికే సిక్స్ కొట్టిన జాబితాలో నమన్ ఓజా, విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, యశస్వి జైస్వాల్ కూడా ఉన్నారు. అయితే.. వీరంతా కేవ‌లం ఒకే ఒక సారి ఈ ఘ‌నత సాధించారు.

Shreyas Iyer : చ‌హ‌ల్‌కు బౌలింగ్ ఇవ్వాల‌ని అనుకున్నా.. కానీ.. ఓట‌మి అనంత‌రం శ్రేయ‌స్ అయ్య‌ర్ హాట్ కామెంట్లు..

మ్యాచ్‌లో తొలి బంతికే సిక్స్ కొట్టిన ఆట‌గాళ్లు వీరే..

* న‌మ‌న్ ఓజా (రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌) 2009లో కేకేఆర్ బౌల‌ర్ బ్రాడ్ హాడ్జ్ బౌలింగ్‌లో
* ఫిల్ సాల్ట్ (కేకేఆర్‌) 2024లో ముంబై బౌల‌ర్ నువాన్ తుషార బౌలింగ్‌లో
* ప్రియాన్ష్ ఆర్య (పంజాబ్ కింగ్స్‌) 2025లో సీఎస్‌కే బౌల‌ర్ ఖ‌లీల్ అహ్మ‌ద్ బౌలింగ్‌లో
* య‌శ‌స్వి జైస్వాల్ (రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌) 2026లో ఢిల్లీ బౌల‌ర్ మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో
* ప్రియాన్ష్ ఆర్య (పంజాబ్ కింగ్స్‌) 2026లో ఢిల్లీ బౌల‌ర్ మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. ప్రియాన్ష్ ఆర్య (56; 33 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స‌ర్లు)తో పాటు శ్రేయ‌స్ అయ్య‌ర్ (59; 36 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) అర్థ‌శ‌త‌కాలు బాద‌డంతో మొద‌ట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 210 ప‌రుగులు చేసింది. ఢిల్లీ బౌల‌ర్ల‌లో మిచెల్ స్టార్క్‌, మాధవ్ తివారీలు చెరో రెండు, ముకేశ్ కుమార్ ఓ వికెట్ తీశాడు.

Hardik Pandya : ముంబైలో ఏం జ‌రుగుతోంది ? రోహిత్, సూర్య ఖాతాల‌ను అన్‌ఫాలో చేసిన పాండ్యా? ముంబై పోస్టులు మొత్తం డిలీట్‌..?

అనంత‌రం 211 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఢిల్లీ క్యాపిట‌ల్స్ 19 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఢిల్లీ బ్యాట‌ర్ల‌లో అక్ష‌ర్ ప‌టేల్ (56; 30 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), డేవిడ్ మిల్ల‌ర్ (51; 28 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీలు చేశారు. పంజాబ్ బౌల‌ర్ల‌లో అర్ష్‌దీప్ సింగ్‌, య‌శ్ ఠాకూర్‌లు చెరో రెండు, స్టోయినిస్‌, బెన్ డ్వార్షుయిస్ లు త‌లా ఓ వికెట్ సాధించారు.