Shreyas Iyer : చహల్‌కు బౌలింగ్ ఇవ్వాలని అనుకున్నా.. కానీ.. ఓటమి అనంతరం శ్రేయస్ అయ్యర్ హాట్ కామెంట్లు..
ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓటమిపై పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) స్పందించాడు.
IPL 2026 Shreyas Iyer comments after Punjab Kings lost match to Delhi Capitals (pic credit@ipl)
- ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓటమి
- స్పందించిన పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్
- పేలవ బౌలింగ్, ఫీల్డింగ్ కారణం అని వెల్లడి
Shreyas Iyer : ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ వరుసగా నాలుగో ఓటమిని చవిచూసింది. సోమవారం ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో 3 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. పేలవ బౌలింగ్, ఫీల్డింగ్ తమ కొంపముంచామని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు.
ప్రియాన్ష్ ఆర్య (56; 33 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (59; 36 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్, మాధవ్ తివారీలు చెరో రెండు వికెట్లు తీశారు. ముకేశ్ కుమార్ ఓ వికెట్ సాధించాడు.
అనంతరం 211 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ 19 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఢిల్లీ బ్యాటర్లలో అక్షర్ పటేల్ (56; 30 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు), డేవిడ్ మిల్లర్ (51; 28 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్థశతకాలు చేశారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, యశ్ ఠాకూర్లు చెరో రెండు వికెట్లు తీశారు. స్టోయినిస్, బెన్ డ్వార్షుయిస్ లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
Andy Flower : ముంబై పై విజయం.. ఆర్సీబీ పై బీసీసీఐ చర్యలు షురూ.. హెడ్ కోచ్‌కు 15 శాతం జరిమానా
మ్యాచ్ అనంతరం తమ జట్టు ఓటమిపై పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందించాడు. ఓడిపోవడం బాధించిందన్నాడు. ఈ వికెట్ పై 210 పరుగుల లక్ష్యం సరిపోతుందా అనే ప్రశ్నకు ఖచ్చితంగా అని సమాధానం ఇచ్చాడు. బంతి సీమ్, అస్థిర బౌన్స్‌ను పరిగణలోకి తీసుకుంటే తాము 30 పరుగులు ఎక్కువగానే చేశామని అన్నాడు. మధ్యలో ఒక్క ఓవర్‌ను అయినా చహల్ తో వేయించాలని అనిపించిందా అని అడుగగా.. అనిపించిందన్నాడు.
అయితే.. బంతి సీమ్ అవుతున్న తీరు, అది సీమర్లకు సహకరిస్తున్న తీరును చూసి ఆగిపోయానని అన్నాడు. తమ బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్‌కు తగ్గట్లుగా బౌలింగ్ చేసి ఉంటే వికెట్లు వచ్చేవని అన్నాడు. కానీ తమ బౌలర్లు అలా చేయలేకపోయారని తెలిపాడు.
ఈ పిచ్ పై కొత్త బ్యాటర్లు షాట్లు ఆడడం కాస్త కష్టం అని అన్నాడు. అందుకనే హర్ట్ లెంగ్త్‌లో పదే పదే బంతులు వేశామన్నాడు. అలా ఒకే చోట బంతులు వేస్తే అప్పుడు కనీసం ఒక్క షాట్ అయినా మిస్ హిట్ అవుతుందని తద్వారా వికెట్ దక్కుతుందనేది తమ ప్లాన్‌గా చెప్పుకొచ్చాడు. అయితే.. ఈ సారి మా ప్రణాళిక సరిగ్గా వర్కౌట్ కాలేదని అయ్యర్ తెలిపాడు.
