Madhav Tiwari : ఎవరీ మాధవ్ తివారీ? పంజాబ్ పై విజయంలో కీలక పాత్ర.. 21 ఏళ్ల ఈ ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కోసం ఢిల్లీ ఎంత డబ్బు ఖర్చుచేసిందంటే?
పంజాబ్ పై ఢిల్లీ విజయంలో 21 ఏళ్ల ఆల్‌రౌండర్ మాధవ్ తివారీ (Madhav Tiwari)కీలక పాత్ర పోషించాడు.
- Thota Vamshi Kumar
- Updated on- May 12, 2026 / 09:58 AM IST
IPL 2026 PBKS vs DC Who is Madhav Tiwari Delhi 21 year old fast bowling all rounder (pic crediT@ipl)
- ఎవరీ మాధవ్ తివారీ
- పంజాబ్ పై ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించిన 21 ఏళ్ల పేస్ ఆల్‌రౌండర్
- ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతం
Madhav Tiwari : ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. తద్వారా ఢిల్లీ జట్టు ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉన్నాయి. ఢిల్లీ విజయంలో 21 ఏళ్ల ఆల్‌రౌండర్ మాధవ్ తివారీ కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో అతడు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు.
ఢిల్లీ బౌలర్ల పై ఎదురుదాడి చేసి పరుగుల వరద పారిస్తున్న పంజాబ్ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య (33 బంతుల్లో 56 పరుగులు)తో పాటు కీలక కూపర్ కొన్నోలీ వికెట్లను పడగొట్టాడు మాధవ్ తివారీ. ఆ పై లక్ష్య ఛేదనలో ఆఖరిలో 8 బంతుల్లో 18 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు.
ఎవరీ మాధవ్ తివారీ?
మాధవ్ తివారీ మధ్యప్రదేశ్‌లోని మౌగంజ్ గ్రామానికి చెందిన వాడు. 2003 సెప్టెంబర్ 28న జన్మించాడు. ఇప్పటి వరకు అతడు ఒక్క ఫస్ట్ క్లాస్, లిస్ట్ ఏ క్రికెట్ ఆడలేదు. అయినప్పటికి కూడా ఏజ్ క్రికెట్‌లో, దేశీయ టీ20 టోర్నమెంట్లలో మెరుగైన ప్రదర్శన చేసి ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే అతడిని ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ 2025 వేలంలో 40 లక్షల రూపాయలకు సొంతం చేసుకుంది.
ఈ సీజన్‌లో అతడు వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా ఐపీఎల్‌లో అరంగ్రేటం చేశాడు. ఆ మ్యాచ్‌లో అతడు బౌలింగ్ చేయలేదు. బ్యాటింగ్‌లో 8వ స్థానంలో బరిలోకి దిగి 3 పరుగులు మాత్రమే చేశాడు.
Rahul Dravid : టీ20 లీగ్‌లో జట్టును కొన్న రాహుల్ ద్రవిడ్.. కెప్టెన్‌గా రవిచంద్రన్ అశ్విన్..
ఈ సీజన్‌లో అతడు ఆడిన మ్యాచ్ ఇది మాత్రమే. అయినప్పటికి కూడా అతడిపై నమ్మకం ఉంచి ఢిల్లీ ఈ సీజన్‌కు అతడిని కొనసాగించింది. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ అతడి ఐపీఎల్ కెరీర్‌లో కేవలం రెండో మ్యాచ్ కావడం గమనార్హం. రెండో మ్యాచ్ ద్వారా తానేంటో అతడు నిరూపించుకున్నాడు.
