Rahul Dravid : టీ20 లీగ్‌లో జట్టును కొన్న రాహుల్ ద్రవిడ్.. కెప్టెన్‌గా రవిచంద్రన్ అశ్విన్..
టీమ్ఇండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid ) యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్‌లో ఓ ఫ్రాంఛైజీని కొనుగోలు చేశాడు.
European T20 Premier League has announced Rahul Dravid as the owner of Dublin franchise
- యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్‌లో జట్టును కొనుగోలు చేసిన రాహుల్ ద్రవిడ్
- ఫ్రాంచైజీ పేరు డబ్లిన్ గార్డియన్స్
- కెప్టెన్‌గా అశ్విన్
Rahul Dravid : టీమ్ఇండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్‌లో ఓ ఫ్రాంఛైజీని కొనుగోలు చేశాడు. డబ్లిన్ ఫ్రాంచైజీ యాజమాన్య హక్కులను దక్కించుకున్నాడు. ఈ విషయాన్ని సోమవారం లీగ్ నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. అంతేకాకుండా లీగ్‌లోని ఫ్రాంచైజీల యాజమాన్యులతో కలిపి ఫోటో సెషన్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాహుల్ ద్రవిడ్ హాజరు అయ్యాడు.
ఈ సందర్భంగా డబ్లిన్ గార్డియన్స్ యజమాని రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ.. యూరప్‌లో క్రికెట్ అభివృద్ధి, యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పించడం వంటివి తనను ఆకర్షించాయని తెలిపాడు.
భారత మాజీ ఆల్-రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ గార్డియన్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఈ జట్టు బెల్ఫాస్ట్, ఎడిన్‌బరో, గ్లాస్గో, రోటర్‌డామ్, ఆమ్స్టర్డామ్ జట్లతో పోటీపడనుంది.
🚨 BIGGEST STORY OF THE DAY 🚨
– RAHUL DRAVID ANNOUNCED AS OWNER OF EUROPEAN T20 PREMIER LEAGUE’S DUBLIN GUARDIANS FRANCHISE 🔥
A Big success for ETPL. pic.twitter.com/GStUVTozS1
— Johns. (@CricCrazyJohns) May 11, 2026
ఈ కార్యక్రమానికి గ్లాస్గో ఫ్రాంచైజీకి చెందిన విపుల్ అగర్వాల్, రోటర్‌డామ్ ఫ్రాంచైజీకి చెందిన జోంటీ రోడ్స్, మధుకర్ శ్రీలతో పాటు, ETPL సహ వ్యవస్థాపకులు అభిషేక్ బచ్చన్, సౌరవ్ బానర్జీ, ప్రియాంక కౌల్, ధీరజ్ మల్హోత్రా తదితరులు హాజరయ్యారు.
క్రికెట్ ఐర్లాండ్, క్రికెట్ స్కాట్లాండ్, రాయల్ డచ్ క్రికెట్ అసోసియేషన్ల భాగస్వామ్యంతో యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ నిర్వహించబడుతుంది.
ఈ లీగ్‌లో మిచెల్ మార్ష్, టిమ్ డేవిడ్, మిచెల్ సాంట్నర్, లియామ్ లివింగ్‌స్టోన్, గ్లెన్ మాక్స్వెల్, ఫాఫ్ డు ప్లెసిస్, హెన్రిచ్ క్లాసెన్ వంటి అంతర్జాతీయ స్టార్లు పాల్గొంటారని భావిస్తున్నారు. ప్రారంభ సీజన్ ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 20 మధ్య జరగనుంది.
ETPL ఫ్రాంచైజీల యాజమానులు వీరే..
* డబ్లిన్ ఫ్రాంచైజీ – రాహుల్ ద్రవిడ్,
* బెల్ఫాస్ట్ ఫ్రాంచైజీ – గ్లెన్ మాక్స్వెల్, రోహన్ లండ్,
* ఎడిన్‌బరో ఫ్రాంచైజీ – కైల్ మిల్స్, నాథన్ మెక్కల్లమ్, రాచెల్ వైస్మాన్
*గ్లాస్గో ఫ్రాంచైజీ – విపుల్ అగర్వాల్, క్రిస్ గేల్
* ఆమ్స్టర్డామ్ ఫ్రాంచైజీ – స్టీవ్ వా, జేమీ డ్వైర్, టిమ్ థామస్,
*రోటర్‌డామ్ ఫ్రాంచైజీ – జోంటీ రోడ్స్, ఫాఫ్ డు ప్లెసిస్, గ్లాషిన్, సమీర్ షా, మేనేజింగ్ పార్టనర్‌గా మధుకర్ శ్రీ.
