PBKS vs GT : ఆ బ్యాట్ మార్చాల్సిందే.. రాహుల్ తెవాటియాకు షాకిచ్చిన అంపైర్లు.. వీడియో వైర‌ల్‌

మంగ‌ళ‌వారం గుజ‌రాత్ టైటాన్స్‌, పంజాబ్ కింగ్స్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ (PBKS vs GT ) జ‌రిగింది.

IPL 2026 PBKS vs GT Rahul Tewatia bat fails in Gauge Test

  • గేజ్ టెస్టులో విఫ‌ల‌మైన రాహుల్ తెవాటియా బ్యాట్‌
  • బ్యాట్ మార్చాల్సిందేన‌న్న అంపైర్లు

PBKS vs GT : మంగ‌ళ‌వారం గుజ‌రాత్ టైటాన్స్‌, పంజాబ్ కింగ్స్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్‌లో గుజ‌రాత్ టైటాన్స్ ఆట‌గాడు రాహుల్ తెవాటియాకు అంపైర్లు షాకిచ్చారు. అత‌డు బ్యాట్ నిబంధ‌న‌ల ప్ర‌కారం లేద‌ని చెప్పారు. మ‌రో బ్యాట్ తెచ్చుకోవాల్సిందేన‌ని సూచించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

గుజ‌రాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ 19వ ఓవ‌ర్‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. వైశాఖ్ బౌలింగ్‌లో వాషింగ్ట‌న్ సుంద‌ర్ ఔట్ అయ్యాడు. అత‌డు ఔట్ కాగానే రాహుల్ తెవాటియా క్రీజులోకి వ‌చ్చాడు. నిర్దేశించిన ప‌రిమాణం కంటే పెద్ద సైజ్ బ్యాట్‌ను అతడు తీసుకువ‌చ్చాడు. ఈ క్ర‌మంలో అంపైర్లు నిర్వ‌హించిన గేజ్ టెస్టులో ఈ బ్యాట్ విఫ‌ల‌మైంది. దీంతో ఆ బ్యాట్‌ను అత‌డు ఉప‌యోగించ‌డానికి వీలు లేకుండా పోయింది. వెంట‌నే అత‌డు మ‌రో బ్యాట్‌ను తీసుకుని వ‌చ్చాడు.

Arshdeep Singh : ఒకే ఓవ‌ర్‌లో 11 బంతులు.. ఐపీఎల్‌లో చెత్త రికార్డును మూట‌గ‌ట్టుకున్న పంజాబ్ కింగ్స్ పేస‌ర్‌

గ‌త కొన్ని సీజ‌న్లుగా ఐపీఎల్‌లో ఆట‌గాళ్లు క్రీజులోకి అడుగుపెట్ట‌గానే వారి బ్యాట్ల‌ను గేజ్ సాయంతో అంపైర్లు చేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. మొద‌ట బ్యాటింగ్ చేసిన గుజ‌రాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 162 ప‌రుగులు చేసింది. గుజ‌రాత్ బ్యాట‌ర్ల‌లో శుభ్‌మ‌న్ గిల్ (39), జోస్ బ‌ట్ల‌ర్ (38) లు రాణించారు. పంజాబ్ బౌల‌ర్ల‌లో విజయకుమార్ వైశాఖ్ మూడు, యుజ్వేంద్ర చాహ‌ల్ రెండు, మార్కో జాన్సెన్ ఓ వికెట్ సాధించాడు.

PBKS vs GT : అర్ష్‌దీప్ సింగ్ వ‌చ్చి ఒక్క‌టే చెప్పాడు.. విజ‌యం పై శ్రేయ‌స్ అయ్య‌ర్ హాట్ కామెంట్స్‌..

163 ప‌రుగుల ల‌క్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ 19.1 ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. పంజాబ్ బౌల‌ర్ల‌లో కూపర్ కానల్లీ (72 నాటౌట్; 44 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీ చేయ‌గా, ప్ర‌భ్‌సిమ్ర‌న్ సింగ్ (37; 24 బంతుల్లో 1 ఫోర్‌, 4 సిక్స‌ర్లు) రాణించాడు. గుజ‌రాత్ బౌల‌ర్ల‌లో ప్ర‌సిద్ధ్ కృష్ణ మూడు, క‌గిసో ర‌బాడ‌, అశోక్ శర్మ, ర‌షీద్ ఖాన్‌, వాషింగ్ట‌న్ సుంద‌ర్ లు త‌లా ఓ వికెట్ సాధించారు.