Virat Kohli : టీ20ల్లో కోహ్లీని కొట్టేవాడే లేడు.. గేల్, బ‌ట్ల‌ర్‌, వార్న‌ర్ రికార్డులు ఔట్‌.. ఏకైక భార‌త ఆట‌గాడు..

టీ20 క్రికెట్‌లో విరాట్ కోహ్లీ (Virat Kohli) అరుదైన ఘ‌న‌త సాధించాడు.

IPL 2026 RCB vs KKR Virat Kohli creates history becomes first Indian with 14000 T20 runs (pic credit@ipl)

  • టీ20ల్లో 14వేల ప‌రుగుల మైలురాయిని చేరుకున్న కోహ్లీ
  • ఇన్నింగ్స్‌ల ప‌రంగా అత్యంత వేగంగా
  • ఈ ఘ‌న‌త సాధించిన ఏకైక భార‌త ఆట‌గాడు

Virat Kohli : టీ20 క్రికెట్‌లో విరాట్ కోహ్లీ అరుదైన ఘ‌న‌త సాధించాడు. పొట్టి ఫార్మాట్‌లో ఇన్నింగ్స్‌ల ప‌రంగా (అంత‌ర్జాతీయ‌, ఐపీఎల్‌, లిస్ట్‌-ఏ మ్యాచ్‌లు) 14 వేల ప‌రుగుల మైలురాయిని అత్యంత వేగంగా చేరుకున్నాడు. బుధ‌వారం రాయ్‌పూర్ వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో అత‌డు ఈ ఘ‌న‌త అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో వ్య‌క్తిగ‌త స్కోరు 78 ప‌రుగుల వ‌ద్ద కోహ్లీ టీ20ల్లో 14 వేల ప‌రుగుల‌ను పూర్తి చేసుకున్నాడు. ఈ క్ర‌మంలో క్రిస్‌గేల్‌ను అధిగ‌మించాడు.

క్రిస్‌గేల్ 423 ఇన్నింగ్స్‌ల్లో టీ20ల్లో 14 వేల ప‌రుగుల మైలురాయిని చేరుకోగా కోహ్లీ కేవ‌లం 409 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘ‌న‌త‌ను సాధించాడు.

అతి త‌క్కువ ఇన్నింగ్స్‌ల్లో టీ20ల్లో 14 వేల ప‌రుగులు చేసిన ఆట‌గాళ్లు వీరే..

* విరాట్ కోహ్లీ – 409 ఇన్నింగ్స్‌ల్లో
* క్రిస్ గేల్ – 423 ఇన్నింగ్స్‌ల్లో
* డేవిడ్ వార్న‌ర్ – 431 ఇన్నింగ్స్‌ల్లో
* అలెక్స్ హేల్స్ – 505 ఇన్నింగ్స్‌ల్లో
* కీర‌న్ పొలార్డ్ – 633 ఇన్నింగ్స్‌ల్లో

Pat Cummins fined : గుజ‌రాత్ పై ఘోర ఓట‌మి.. స‌న్‌రైజ‌ర్స్ కెప్టెన్ పాట్ క‌మిన్స్‌కు భారీ జ‌రిమానా..

తొలి భార‌త ఆట‌గాడిగా

టీ20 క్రికెట్‌లో 14వేల ప‌రుగులు పూర్తి చేసుకున్న తొలి భార‌త ఆట‌గాడిగా కూడా కోహ్లీ నిలిచాడు. కోహ్లీ త‌రువాతి స్థానంలో రోహిత్ శ‌ర్మ ఉన్నాడు. హిట్‌మ్యాన్ 456 ఇన్నింగ్స్‌ల్లో 12491 ప‌రుగులు చేశాడు.

టీ20ల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన భార‌త ఆట‌గాళ్లు వీరే..

* విరాట్ కోహ్లీ – 14,027 ప‌రుగులు
* రోహిత్ శ‌ర్మ – 12,491 ప‌రుగులు
* శిఖ‌ర్ ధావ‌న్ – 9797 ప‌రుగులు
* సూర్య‌కుమార్ యాద‌వ్ – 9654 ప‌రుగులు
* సంజూ శాంస‌న్ – 8830 ప‌రుగులు
* సురేశ్ రైనా – 8654 ప‌రుగులు
* కేఎల్ రాహుల్ – 8602 ప‌రుగులు

Suryakumar Yadav-Devisha Shetty : టీమ్ఇండియా క్రికెట‌ర్ సూర్య‌కుమార్ యాద‌వ్ భార్య.. దేవిషా శెట్టి శ్రీమంతం క్యూట్ ఫోటోలు..

ఈ మ్యాచ్ లో కోహ్లీ శ‌త‌కంతో చెల‌రేగాడు 60 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స‌ర్ల సాయంతో 105 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచి త‌మ‌ జ‌ట్టు ఆర్‌సీబీని గెలిపించుకున్నాడు.