Virat Kohli : స‌న్‌రైజ‌ర్స్‌తో మ్యాచ్‌.. అరుదైన రికార్డుపై కోహ్లీ క‌న్ను..

ఆర్‌సీబీ స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లీని (Virat Kohli) ఓ అరుదైన ఘ‌న‌త ఊరిస్తోంది.

IPL 2026 RCB vs SRH Virat Kohli need 9 to complete 300 sixes In IPL history

  • స‌న్‌రైజ‌ర్స్‌తో ఆర్‌సీబీ మ్యాచ్‌
  • కోహ్లీని ఊరిస్తున్న అరుదైన ఘ‌న‌త‌

Virat Kohli : నేటి (శ‌నివారం మార్చి 28) నుంచి ఐపీఎల్ 2026 సీజ‌న్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ త‌ల‌ప‌డ‌నున్నాయి. బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వ‌నుంది. కాగా.. ఈ మ్యాచ్‌కు ముందు ఆర్‌సీబీ స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లీని ఓ అరుదైన ఘ‌న‌త ఊరిస్తోంది.

ఈ మ్యాచ్‌లో గ‌నుక కోహ్లీ 9 సిక్స‌ర్లు కొడితే.. ఐపీఎల్‌లో 300 సిక్స‌ర్ల మైలురాయిని చేరుకుంటాడు. ఐపీఎల్‌లో 300 సిక్స‌ర్ల మైలురాయిని చేరుకున్న మూడో ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్క‌న్నాడు. అత‌డి క‌న్నా ముందు క్రిస్‌గేల్‌, రోహిత్ శ‌ర్మ మాత్ర‌మే ఈ ఘ‌న‌త సాదించారు.

Ishan Kishan : ఆర్‌సీబీతో మ్యాచ్‌.. కెప్టెన్‌గా చ‌రిత్ర సృష్టించ‌నున్న ఇషాన్ కిష‌న్‌..

2008లో ఐపీఎల్ అరంగ్రేటం నుంచి ఆర్‌సీబీ త‌రుపున‌నే కోహ్లీ ఆడుతున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు అత‌డు 267 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. 39.5 స‌గ‌టుతో 8661 ప‌రుగులు చేశాడు. ఇందులో 8 సెంచ‌రీలు, 63 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. ఇప్ప‌టి వర‌కు అత‌డు 291 సిక్స‌ర్లు బాదాడు. ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు బాదిన‌ మూడో ఆట‌గాడిగా కోహ్లీ కొన‌సాగుతున్నాడు.

ఐపీఎల్‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన ఆట‌గాళ్లు వీరే..

* క్రిస్‌గేల్ – 142 మ్యాచ్‌ల్లో 357 సిక్స‌ర్లు
* రోహిత్ శ‌ర్మ – 272 మ్యాచ్‌ల్లో 302 సిక్స‌ర్లు
* విరాట్ కోహ్లీ – 267 మ్యాచ్‌ల్లో 291 సిక్స‌ర్లు
* ఎంఎస్ ధోని – 278 మ్యాచ్‌ల్లో 264 సిక్స‌ర్లు
* ఏబీ డివిలియ‌ర్స్ – 184 మ్యాచ్‌ల్లో 251 సిక్స‌ర్లు