Rohit Sharma : హార్దిక్, సూర్యలకు షాక్.. ఆర్‌సీబీతో మ్యాచ్‌కు ముంబై కెప్టెన్‌గా రోహిత్ శర్మ?
ఆదివారం ఆర్‌సీబీతో జరగనున్న మ్యాచ్‌కు ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ (Rohit Sharma)వ్యవహరించనున్నాడని అంటున్నారు.
- Thota Vamshi Kumar
- Updated on- May 7, 2026 / 10:29 AM IST
IPL 2026 Rohit Sharma as Mumbai Indians Captain for rcb match Report (pic credit@ipl)
- ఆర్‌సీబీతో ఆదివారం ముంబై మ్యాచ్
- దూరం కానున్న హార్దిక్, సూర్య
- రోహిత్‌కు నాయకత్వ బాధ్యతలు!
Rohit Sharma : ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ కు పెద్దగా కలిసి రావడం లేదు. ఇప్పటికే దాదాపుగా ప్లేఆఫ్స్‌కు ఆ జట్టు దూరం అయింది. ఇక రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో లక్నోతో మ్యాచ్‌కు అతడు దూరం అయ్యాడు. అతడు గాయం నుంచి ఇంకా కోలుకోలేదని, మరికొన్ని రోజులు అతడికి విశ్రాంతి అవసరం అని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో అతడు మే 10న ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ ఆడడని వార్తలు వస్తున్నాయి. రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది.
Cooper Connolly : చరిత్ర సృష్టించిన కూపర్ కొన్నోలీ.. ఏకైక విదేశీ ఆటగాడు..
ఇక హార్దిక్ గైర్హాజరీలో తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన సూర్యకుమార్ యాదవ్ సైతం ఆర్‌సీబీతో మ్యాచ్‌కు అందుబాటులో ఉండడని అంటున్నారు. అతడి భార్య దేవిషా శెట్టి ఓ బిడ్డకు జన్మనివ్వనుందని ఆంగ్ల మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అతడు ఆమె పక్కన ఉండాలని భావిస్తున్నట్లు ఆయా ఆయా కథనాల సమాచారం.
కెప్టెన్‌గా రోహిత్?
ఆర్‌సీబీతో మ్యాచ్‌కు రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, తాత్కాలిక సారథి సూర్యకుమార్ యాదవ్ ఇద్దరూ దూరం కానున్న నేపథ్యంలో ఎవరు ముంబైకి నాయకత్వం వహిస్తారు అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. జట్టుకు ఐదు సార్లు ఐపీఎల్ ట్రోఫీని అందించిన రోహిత్ శర్మ వైపు యాజమాన్యం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
Pat Cummins : పంజాబ్ పై విజయం.. ట్రావిస్ హెడ్ నిద్ర.. పాట్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఒకవేళ అతడిని కాదనుకుంటే మరో సీనియర్ ఆటగాడు జస్‌ప్రీత్ బుమ్రా బాధ్యతలు చేపట్టవచ్చు. అయితే.. పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న బుమ్రాకు నాయకత్వ బాధ్యతలను అప్పగిస్తే అది అతడికి మరింత భారంగా మారొచ్చునని అంటున్నారు.
