Cooper Connolly : చరిత్ర సృష్టించిన కూపర్ కొన్నోలీ.. ఏకైక విదేశీ ఆటగాడు..
పంజాబ్ కింగ్స్ ఆటగాడు కూపర్ కొన్నోలీ (Cooper Connolly) అరుదైన ఘనత సాధించాడు.
Cooper Connolly creates history Youngest overseas batter to score a century in IPL (pic credit@ipl)
- సన్‌రైజర్స్ పై శతక్కొట్టిన కూపర్ కొన్నోలీ
- అతి తక్కువ ఏజ్‌లో ఐపీఎల్లో సెంచరీ చేసిన విదేశీ ఆటగాడిగా రికార్డు
- క్వింటన్ డికాక్‌ను అధిగమించి..
Cooper Connolly : పంజాబ్ కింగ్స్ ఆటగాడు కూపర్ కొన్నోలీ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడైన విదేశీ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. బుధవారం ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో శతక్కొట్టడం ద్వారా అతడు ఈ ఘనత సాధించాడు. ఈ క్రమంలో అతడు క్వింటన్ డికాక్‌ను అధిగమించాడు. డికాక్ 2016లో ఢిల్లీ తరుపున ఆడుతూ ఆర్సీబీపై 23 ఏళ్ల 122 రోజుల వయసులో సెంచరీ చేశాడు. తాజాగా కూపర్ కొన్నోలీ 22 ఏళ్ల 257 రోజుల్లోనే శతక్కొట్టాడు.
ఐపీఎల్లో అతి తక్కువ వయసులో సెంచరీ చేసిన విదేశీ ఆటగాళ్లు వీరే..
* కూపర్ కొన్నోలీ – 22 ఏళ్ల 257 రోజులు (2026లో పంజాబ్‌కు ఆడుతూ సన్‌రైజర్స్ పై)
* క్వింటన్ డికాక్ – 23 ఏళ్ల 122 రోజులు (2016లో ఢిల్లీకి ఆడుతూ ఆర్సీబీపై)
* డేవిడ్ వార్నర్ – 23 ఏళ్ల 153 రోజులు (2010లో ఢిల్లీకి ఆడుతూ కేకేఆర్ పై)
* డేవిడ్ మిల్లర్ – 23 ఏళ్ల 330 రోజులు (2013లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు ఆడుతూ ఆర్సీబీపై)
* కామెరూన్ గ్రీన్ – 23 ఏళ్ల 352 రోజులు (2023లో ముంబైకి ఆడుతూ సన్‌రైజర్స్ పై)
Pat Cummins : పంజాబ్ పై విజయం.. ట్రావిస్ హెడ్ నిద్ర.. పాట్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 235 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ బ్యాటర్లలో హెన్రిచ్ క్లాసెన్ (69; 43 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు), ఇషాన్ కిషన్ (55; 32 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీలు చేశారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, ఫెర్గూసన్, చహల్, విజయ్‌కుమార్ వైశాక్ లు తలా ఓ వికెట్ సాధించారు.
అనంతరం 236 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో పంజాబ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 202 పరుగులకే పరిమితమైంది. దీంతో 33 పరుగుల తేడాతో ఓడిపోయింది. పంజాబ్ బ్యాటర్లలో కూపర్ కొన్నోలీ (107 నాటౌట్; 59 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్లు) శతకంతో చెలరేగాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో పాట్ కమిన్స్, శివంగ్ కుమార్ చెరో రెండు, నితీశ్ కుమార్ రెడ్డి, మలింగ, సాకిబ్ హుస్సేన్ లు తలా ఓ వికెట్ సాధించారు.
