RR vs CSK : ధోని రికార్డు బద్దలైంది.. జేమీ ఓవర్టన్ నువ్వు మామూలోడివి కాదయ్యా..
సోమవారం గౌహతి వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో (RR vs CSK) 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది.
- Thota Vamshi Kumar
- Published On : March 31, 2026 / 09:25 AM IST
IPL 2026 RR vs CSK Jamie Overton shatters MS Dhoni record
- రాజస్థాన్ పై 43 పరుగులు
- జేమీ ఓవర్టన్ అరుదైన ఘనత
- ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక పరుగులు చేసిన సీఎస్‌కే ప్లేయర్
RR vs CSK : ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమితో టోర్నీని ఆరంభించింది. సోమవారం గౌహతి వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో చెన్నై ఓడిపోయినప్పటికి కూడా ఆ జట్టు ఆల్‌రౌండర్ జేమీ ఓవర్టన్ ఓ అరుదైన ఘనత సాధించాడు.
సీఎస్‌కే బ్యాటర్లు విఫలమైన ఈ మ్యాచ్‌లో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఓవర్టన్ 43 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో అతడు ధోని రికార్డును అధిగమించాడు. సీఎస్‌కే తరుపున ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి అత్యధిక స్కోరు సాధించిన ప్లేయర్‌గా రికార్డులకు ఎక్కాడు. గతంలో ఈ రికార్డు ఎంఎస్ ధోని పేరిట ఉండేది. ఐపీఎల్ 2024 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ పై ధోని అజేయంగా 37 పరుగులు సాధించాడు.
ఐపీఎల్‌లో 8 స్థానంలో బ్యాటింగ్‌కు దిగి అత్యధిక పరుగులు చేసిన సీఎస్‌కే ఆటగాళ్లు వీరే..
* జేమీ ఓవర్టన్ – 43 పరుగులు (2026లో రాజస్థాన్ రాయల్స్ పై)
* ఎంఎస్ ధోని – 37 నాటౌట్ (2024లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై)
* సామ్ కర్రన్ – 34 పరుగులు (2021లో ఢిల్లీ క్యాపిలట్స్‌పై)
* ఎంఎస్ ధోని – 32 నాటౌట్ (2023లో రాజస్థాన్ రాయల్స్ పై)
* ఎంఎస్ ధోని – 28 నాటౌట్ (2024లో లక్నో సూపర్ జెయింట్స్ పై)
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే 19.4 ఓవర్లలో 127 పరుగులకే ఆలౌటైంది. సీఎస్‌కే బ్యాటర్లలో జామీ ఓవర్టన్ (43; 36 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. ఆర్ఆర్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, నంద్రే బర్గర్, రవీంద్ర జడేజాలు తలా రెండు వికెట్లు తీయగా.. బ్రిజేష్ శర్మ, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్ లు ఒక్కొ వికెట్ సాధించారు.
వైభవ్ సూర్యవంశీ (52; 17 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లు) దంచికొట్టగా యశస్వి జైస్వాల్ (38 నాటౌట్ ; 36 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్లు) రాణించడంతో 128 పరుగుల లక్ష్యాన్ని ఆర్ఆర్ 12.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి అందుకుంది. సీఎస్‌కే బౌలర్లలో అన్షుల్ కంబోజ్ రెండు వికెట్లు తీశాడు.
