Vaibhav Suryavanshi : చెన్నై పై వైభ‌వ్ సూర్య‌వంశీ విధ్వంసం.. ఎలైట్ జాబితాలో చోటు.. త‌న రికార్డును తానే..

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఓపెన‌ర్‌ వైభ‌వ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) విధ్వంసం సృష్టించాడు.

IPL 2026 RR vs CSK Vaibhav Suryavanshi scored second quickest fifty by an RR player in IPL history (pic credit@IPL)

  • చెన్నై పై వైభ‌వ్ విధ్వంసం
  • 15 బంతుల్లో హాఫ్ సెంచ‌రీ
  • ఆర్ఆర్ త‌రుపున రెండో వేగవంత‌మైన అర్థ‌శ‌త‌కం

Vaibhav Suryavanshi : రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఓపెన‌ర్‌ వైభ‌వ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు. ఐపీఎల్ 2026లో భాగంగా సోమ‌వారం గౌహ‌తి వేదిక‌గా చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో కేవ‌లం 15 బంతుల్లోనే హాఫ్ సెంచ‌రీ బాదాడు. ఈ క్ర‌మంలో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ త‌రుపున ఐపీఎల్‌లో రెండో వేగ‌వంత‌మైన హాఫ్ సెంచ‌రీ చేసిన ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు.ఈ క్ర‌మంలో త‌న రికార్డును తానే అధిగ‌మించాడు. ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో వైభ‌వ్ గుజ‌రాత్ టైటాన్స్ పై 17 బంతుల్లో హాఫ్ సెంచ‌రీ బాదాడు.

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ త‌రుపున ఐపీఎల్‌లో వేగ‌వంత‌మైన హాఫ్ సెంచ‌రీ చేసిన ఆట‌గాళ్ల జాబితాలో య‌శ‌స్వి జైస్వాల్ అగ్ర‌స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్ 2023లో య‌శ‌స్వి జైస్వాల్ కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ పై 13 బంతుల్లోనే హాఫ్ సెంచ‌రీ చేశాడు. ఈ జాబితాలో జోస్ బ‌ట్ల‌ర్ కూడా ఉన్నాడు.

RR vs CSK : సీఎస్‌కేతో మ్యాచ్ అనంత‌రం వైభ‌వ్ సూర్య‌వంశీ ఆస‌క్తిక‌ర కామెంట్స్‌.. భ‌య‌ప‌డి త్వ‌ర‌గా ప‌డుకున్నా.. కేక్ కూడా క‌ట్ చేయ‌లేదు..

ఐపీఎల్‌లో ఆర్ఆర్ త‌రుపున వేగ‌వంత‌మైన హాఫ్ సెంచ‌రీలు చేసిన ఆట‌గాళ్లు వీరే..

* య‌శ‌స్వి జైస్వాల్ – 13 బంతుల్లో (2023లో కోల్‌క‌తా పై)
* వైభ‌వ్ సూర్య‌వంశీ – 15 బంతుల్లో (2026లో చెన్నై సూప‌ర్ కింగ్స్‌పై)
* వైభ‌వ్ సూర్య‌వంశీ – 17 బంతుల్లో (2025లో గుజ‌రాత్ టైటాన్స్‌పై)
* జోస్ బ‌ట్ల‌ర్ – 18 బంతుల్లో (2018లో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌)

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. మొద‌ట బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే జ‌ట్టు 19.4 ఓవ‌ర్ల‌లో 127 ప‌రుగుల‌కే ఆలౌటైంది. సీఎస్‌కే బ్యాట‌ర్ల‌లో జామీ ఓవర్టన్ (43; 36 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) రాణించాడు. స‌ర్ఫ‌రాజ్ ఖాన్ (17), కార్తీక్ శర్మ (18) లు ప‌ర్వాలేద‌నిపించారు. ఆర్ఆర్‌ బౌల‌ర్ల‌లో జోఫ్రా ఆర్చ‌ర్, నంద్రే బర్గర్, ర‌వీంద్ర జ‌డేజాలు త‌లా రెండు వికెట్లు తీశారు. బ్రిజేష్ శర్మ, సందీప్ శ‌ర్మ‌, ర‌వి బిష్ణోయ్ లు త‌లా ఓ వికెట్ సాధించారు.

RR vs CSK : మేం ఓడిపోయింది అందుకే.. పెద్ద‌గా బాధ లేదు.. సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కామెంట్స్‌..

ఆ త‌రువాత 128 ప‌రుగుల ల‌క్ష్యాన్ని రాజ‌స్థాన్ 12.1 ఓవ‌ర్ల‌లో రెండు వికెట్లు కోల్పోయి అందుకుంది. ఆర్ఆర్ బ్యాట‌ర్ల‌లో వైభ‌వ్ సూర్య‌వంశీ (52; 17 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స‌ర్లు) విధ్వంస‌క‌ర హాఫ్ సెంచ‌రీ చేశాడు. య‌శ‌స్వి జైస్వాల్ (38 నాటౌట్‌ ; 36 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స‌ర్లు) రాణించాడు. రాజ‌స్థాన్ కోల్పోయిన రెండు వికెట్లు కూడా సీఎస్‌కే బౌల‌ర్‌ అన్షుల్ కంబోజ్ ప‌డ‌గొట్టాడు.