RR vs MI : వైభ‌వ్‌ను ప్ర‌త్యేకంగా అభినందించిన హార్దిక్ పాండ్యా.. నువ్వు గొప్పొడివి సామీ..

ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ (RR vs MI) యువ ఆట‌గాడు వైభ‌వ్ సూర్య‌వంశీ విధ్వంసం సృష్టించాడు.

IPL 2026 RR vs MI Hardik Pandya appreciating young Vaibhav Sooryavanshi

  • ముంబైతో మ్యాచ్‌లో చెల‌రేగి ఆడిన 15 ఏళ్ల వైభ‌వ్ సూర్య‌వంశీ
  • అత‌డి బ్యాటింగ్‌కు హార్దిక్ పాండ్యా ఫిదా
  • మ్యాచ్ అనంత‌రం వైభ‌వ్‌ను ప్ర‌త్యేకంగా అభినందించిన పాండ్యా

RR vs MI : గౌహ‌తి వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ యువ ఆట‌గాడు వైభ‌వ్ సూర్య‌వంశీ విధ్వంసం సృష్టించాడు. కేవ‌లం 14 బంతుల్లోనే 1 ఫోర్‌, 5 సిక్స‌ర్ల సాయంతో 39 ప‌రుగులు చేశాడు. ముఖ్యంగా అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అత్యుత్త‌మ బౌల‌ర్ల‌లో ఒక‌డైన జ‌స్‌ప్రీత్ బుమ్రా వేసిన ఓవ‌ర్‌లో 15 ఏళ్ల ఈ లెఫ్ట్ హ్యాండ్ ఆట‌గాడు రెండు సిక్స‌ర్లు బాదాడు. ఈ క్ర‌మంలో అత‌డి బ్యాటింగ్‌కు అంద‌రూ ఫిదా అయ్యారు.

ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా వైభ‌వ్ సూర్య‌వంశీ ఆట‌తీరుకు ముగ్ధులైయ్యాడు. మ్యాచ్ అనంత‌రం ఇరు జ‌ట్ల ఆట‌గాళ్లు క‌ర‌చాల‌నం చేసుకునే స‌మ‌యంలో వైభ‌వ్ సూర్య‌వంశీని ప్ర‌త్యేకంగా అభినందించాడు.

RR vs MI : ముంబై పై విజ‌యం.. రియాన్ ప‌రాగ్ హాట్‌ కామెంట్స్‌..

ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. హార్దిక్ పాండ్యా మంచి మ‌న‌సుపై నెటిజ‌న్లు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. నువ్వు గొప్పొడివి సామీ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

RR vs MI : బుమ్రా బౌలింగ్‌ను చిత‌క్కొట్టిన బుడ్డోడు.. తొలి బంతికే సిక్స్‌.. పేస్ గుర్రం రియాక్ష‌న్ వైర‌ల్‌

ఇక మ్యాచ్ అనంత‌రం హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. వైభ‌వ్ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. 16 లేదా 17 ఏళ్ల కుర్రాడు ఇంత నిర్భ‌యంగా ఆడ‌డం చూసి ఆశ్చ‌ర్య‌మేసిందని అన్నాడు. ఇక మ్యాచ్ కోసం సిద్ధం అవుతున్న స‌మ‌యంలో వైభ‌వ్ గురించి జ‌ట్టులో చాలా చ‌ర్చ జ‌రిగింద‌న్నాడు. అతను బ్యాటింగ్ చేసే విధానం, అతనిలో ఉన్న నిర్భయత్వం, అతను ఆడే షాట్లు చూడటానికి అద్భుతంగా ఉందన్నాడు. భవిష్యత్తులో అత‌డు మ‌రిన్ని విజ‌యాలు సాధించాల‌ని పాండ్యా కోరుకున్నాడు.