RR vs MI : ముంబై పై విజయం.. రియాన్ పరాగ్ హాట్ కామెంట్స్..
మంగళవారం గౌహతి వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 27 పరుగుల తేడాతో (RR vs MI) రాజస్థాన్ రాయల్స్ గెలుపొందింది.
IPL 2026 RR vs MI Riyan Parag comments after Rajasthan Royals won the match against Mumbai Indians (pic credit@ipl)
- ఈ సీజన్లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గెలిచిన రాజస్థాన్
- ఎంతో గొప్పగా అనిపిస్తుందన్న ఆర్ఆర్ కెప్టెన్
- మాది బలమైన జట్టు అని ఎప్పుడో తెలుసని వ్యాఖ్య
RR vs MI : ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ అదరగొడుతోంది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. మంగళవారం గౌహతి వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 27 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ సీజన్లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించడం పట్ల రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ సంతోషాన్ని వ్యక్తం చేశాడు. కుర్రాళ్లు అద్భుతంగా ఆడుతున్నారని, ఇంతకంటే ఎక్కువగా తాను ఏమీ కోరలేనని అన్నాడు.
మ్యాచ్ ప్రారంభానికి ముందు వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను 11 ఓవర్లకు కుదించారు. యశస్వి జైస్వాల్ (77; 32 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లు), వైభవ్ సూర్యవంశీ (39; 14 బంతుల్లో 1 ఫోర్, 5 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో చెలరేగడంతో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 11 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. కెప్టెన్ రియాన్ పరాగ్ (20; 10 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లు) రాణించాడు. ముంబై బౌలర్లలో ఘజన్ఫర్ రెండు, శార్దూల్ ఠాకూర్ ఓ వికెట్ తీశాడు.
RR vs MI : అదే మా కొంప ముంచింది.. బ్యాటర్ల తప్పేం లేదు.. హార్దిక్ పాండ్యా కీలక వ్యాఖ్యలు..
ఆ తరువాత నమన్ ధీర్ (25), షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ (25), తిలక్ వర్మ (14) లు మాత్రమే రెండు అంకెల స్కోరు సాధించగా.. మిగిలిన వారు విఫలం కావడంతో 151 పరుగుల లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ నిర్ణీత 11 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 123 పరుగులకే పరిమితమైంది. ఆర్ఆర్ బౌలర్లలో నాంద్రే బర్గర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్ లు తలా రెండు వికెట్లు పడగొట్టగా.. జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్‌పాండే లు చెరో వికెట్ తీశారు.
ఎంతో గొప్పగా అనిపిస్తుంది
మ్యాచ్‌లో గెలిచిన తరువాత రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ మాట్లాడాడు. ఈ సీజన్లో తాము ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలవడం ఎంతో గొప్పగా అనిపిస్తోందన్నాడు. ప్రతి మ్యాచ్‌లో కుర్రాళ్ళు ఆడుతున్న తీరు తనను ఆకట్టుకుంటోందన్నాడు. ఇంతకంటే వారి నుంచి ఇంకా ఏమీ కోరలేనని అన్నాడు. వారందరికి కృతజ్ఞతలు తెలిపాడు.
ప్రస్తుత జట్టు ఎంతో బలమైనది అని నాకు ఎప్పటి నుంచో తెలుసు. వేలం జరిగిన తరువాత మేము చాలా బలమైన జట్టును కలిగి ఉన్నామని అనిపించింది. అయితే.. బయటి వారు ఎవరు కూడా మమ్మల్ని నిజంగా నమ్మలేదు. అయితే.. మేము పరిస్థితులకు అనుగుణంగా అద్భుతంగా ఆడుతున్నాము. ఇక ముందు కూడా ఇలాంటి ప్రదర్శనలే కొనసాగిస్తామని ఆశిస్తున్నాను. అని పరాగ్ చెప్పుకొచ్చాడు.
ఇక పేసర్లు జోఫ్రా ఆర్చర్, నంద్రే లు నిలకగా 145 నుంచి 150 మైళ్ల వేగంతో కూడా అద్భుత నియంత్రణతో బౌలింగ్ చేస్తారని అన్నాడు. వీరిద్దరు ఎంతో ప్రమాదకర బౌలర్లు అని చెప్పుకొచ్చాడు. ఇక ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. వారిద్దరి గురించి మాట్లాడడానికి తన వద్ద మాటలు లేవన్నాడు. ఈ ఐపీఎల్ సీజన్లో ఓపెనింగ్‌లో వారిదే అత్యుత్తమ జోడీ అని చెప్పుకొచ్చాడు. వారిద్దరు కూడా పరిస్థితులకు అనుగుణంగా ఆడుతున్నారన్నాడు. వారిద్దరు జట్టులో ఉండడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపాడు.
