Ruturaj Gaikwad : ఆ ఒక్క త‌ప్పు వ‌ల్లే మేం ఓడిపోయాం.. లేదంటేనా.. రుతురాజ్ గైక్వాడ్ కామెంట్స్‌

ల‌క్నో చేతిలో ఓడిపోవ‌డంపై సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) స్పందించాడు.

IPL 2026 Ruturaj Send Big Message To his Teammates After loss to lsg (Pic credit@ipl)

  • లక్నో పై ఓట‌మి
  • సీఎస్‌కే ప్లేఆఫ్స్ అవ‌కాశాలు సంక్లిష్టం
  • చెన్నై ఆట‌గాళ్ల‌కు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ క్లియ‌ర్ మెసేజ్‌

Ruturaj Gaikwad : శుక్ర‌వారం ల‌క్నోలోని ఎకానా స్టేడియంలో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ సీజ‌న్‌లో సీఎస్‌కేకు ఇది ఆరో ఓట‌మి. ఈ క్ర‌మంలో ఈ జ‌ట్టు ప్లేఆఫ్స్ అవ‌కాశాలు సంక్లిష్టం అయ్యాయి. ఇక మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజ‌యం సాధించాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. అలా సాధించినా కూడా ఖ‌చ్చితంగా ప్లేఆఫ్స్‌లో అడుగుపెడుందా? అంటే చెప్ప‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. మిగిలిన జ‌ట్ల స‌మీక‌ర‌ణాలు క‌లిసి రావాల్సి ఉంటుంది. కాగా.. ల‌క్నో చేతిలో ఓడిపోవ‌డంపై సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ స్పందించాడు.

ఈ ఓట‌మి నిరాశ క‌లిగించింద‌న్నాడు. తొలుత మ్యాచ్‌లో సానుకూల అంశాల గురించి మాట్లాడాడు. పేస‌ర్ల‌కు పిచ్ స‌హ‌క‌రించింద‌న్నాడు. తాము బ్యాటింగ్ చేసేట‌ప్పుడు హార్డ్ లెంగ్త్‌లో ప‌డిన బంతుల‌ను ఎదుర్కొన‌డం కాస్త క‌ష్టంగా అనిపించింద‌న్నాడు. ల‌క్నో బౌల‌ర్లు చ‌క్క‌టి బంతుల‌తో త‌మ‌ని క‌ట్ట‌డి చేశార‌న్నాడు. తాము 160 లేదా 170 ప‌రుగులు చేస్తామ‌ని అనుకున్నామ‌ని, అయితే.. 187 ప‌రుగులు చేయ‌డం బాగుంద‌న్నాడు. కాబ‌ట్టి బ్యాటింగ్ ప‌రంగా తాము చేయ‌గ‌లిగ‌దాని కంటే ఎక్కువే చేశామ‌ని అన్నాడు.

Vaibhav Sooryavanshi : వైభవ్ సూర్యవంశీ ఎఫెక్ట్‌.. 10 ఏళ్ల పిల్లాడిని నెట్స్‌లోకి లాక్కెళ్లిన తండ్రి.. వీడియో వైర‌ల్‌..

ఇక ల‌క్నో బ్యాటింగ్ చేసేట‌ప్పుడు పిచ్ మెరుగు ప‌డిందో లేదో త‌న‌కు తెలియ‌ద‌న్నాడు. ఏదీఏమైన‌ప్ప‌టికి కూడా ఆ జ‌ట్టు బ్యాట‌ర్లు అసాధార‌ణ‌మైన షాట్లు ఆడార‌ని తాను భావిస్తున్న‌ట్లు చెప్పాడు. మిచెల్ మార్ష్ షార్ట్ బాల్స్‌ను చాలా చ‌క్క‌గా ఆడ‌తాడ‌నే విష‌యం త‌మ‌కు తెలుసున‌ని, అందుక‌నే టెస్టు మ్యాచ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేసి వారిని క‌ట్ట‌డి చేయాల‌ని భావించామ‌న్నాడు. బంతి స్వింగ్ అవుతోంద‌ని అనిపించింద‌ని, అయిన‌ప్ప‌టికి వారు మంచి షాట్లు ఆడార‌ని అన్నాడు.

త‌మ ప్ర‌ణాళికల‌ను అమ‌లు చేయ‌డంలో కొన్ని సార్లు త‌ప్పులు జ‌రిగాయ‌న్నాడు. కొన్ని బంతుల‌ను త‌ప్పుగా వేశామ‌న్నాడు. లక్నో ఓపెన‌ర్లు మ్యాచ్‌ను త‌మ నుంచి లాగేసుకున్నార‌ని అన్నాడు. 52 ప‌రుగుల‌కే మూడు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డిన సీఎస్‌కే జ‌ట్టుకు యువ ఆట‌గాడు కార్తీక్‌ శ‌ర్మ‌హాఫ్ సెంచ‌రీతో ఆదుకున్నాడు. దీనిపై మాట్లాడుతూ కార్తీక్ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు.

ప్లేఆఫ్స్ స‌మీక‌ర‌ణాల‌పై..

ల‌క్నో మ్యాచ్‌లో ఓడిపోవ‌డంతో సీఎస్‌కే ప్లేఆఫ్స్ స‌మీక‌ర‌ణాలు సంక్లిష్టంగా మారాయి. మిగిలిన రెండు మ్యాచ్‌ల‌ను త‌ప్ప‌క గెల‌వాల్సిన ప‌రిస్థితి ఉంది. దీనిపై రుతురాజ్ మాట్లాడుతూ.. ముందుగా తాము చెన్నైకి చేరుకోవాల‌న్నాడు. అది సుదీర్ఘ ప్ర‌యాణం. ఆ త‌రువాత తాము ఎక్క‌డ మెరుగు అవ్వాలో అనే అంశంపై దృష్టి సారిస్తామ‌ని చెప్పుకొచ్చాడు. ఇక‌పై తాము ఆడే ప్ర‌తి మ్యాచ్‌లో గెల‌వాల్సి ఉంద‌న్నాడు. దీనిపై పెద్ద‌గా ఆలోచించాల్సిన ప‌ని లేద‌న్నాడు. ప‌రిస్థితుల‌కు త్వ‌ర‌గా అలవాటు ప‌డి త‌మ‌కు క‌లిసొచ్చే రోజున అద్భుతంగా రాణించి ఫ‌లితాల‌ను అనుకూలంగా మార్చుకుంటామ‌న్న ధీమాను వ్య‌క్తం చేశాడు. తాము బ‌లంగా పుంజుకుంటామ‌న్నాడు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. మొద‌ట బ్యాటింగ్ చేసిన చెన్నై సూప‌ర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 187 ప‌రుగులు చేసింది. సీఎస్‌కే బ్యాట‌ర్ల‌లో కార్తీక్ శ‌ర్మ (71; 42 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీ చేశాడు. శివ‌మ్ దూబె (32 నాటౌట్; 16 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) రాణించాడు. ల‌క్నో బౌల‌ర్ల‌లో ఆకాష్ మహారాజ్ సింగ్ మూడు వికెట్లు తీశాడు. ష‌మీ, షాబాజ్ అహ్మద్ చెరో వికెట్ సాధించారు.

Preity Zinta : ఏమ‌య్యా కోచ్‌.. మ‌నం వ‌రుస‌గా 5 మ్యాచ్‌లు ఓడిపోయాం.. రికీ పాంటింగ్‌తో ప్రీతి జింటా సుదీర్ఘ చ‌ర్చ‌..

అనంత‌రం మిచెల్ మార్ష్ (90; 38 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్స‌ర్లు ) చెల‌రేగ‌డంతో 188 ప‌రుగుల లక్ష్యాన్ని ల‌క్నో జ‌ట్టు 16.4 ఓవ‌ర్ల‌లో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. నికోల‌స్ పూర‌న్ (32 నాటౌట్; 17 బంతుల్లో 1 ఫోర్‌, 4 సిక్స‌ర్లు) వేగంగా ఆడాడు. సీఎస్‌కే బౌల‌ర్ల‌లో ముకేశ్ చౌద‌రి, స్పెన్సర్ జాన్సన్ లు చెరో వికెట్ తీశారు.