Vaibhav Sooryavanshi : వైభవ్ సూర్యవంశీ ఎఫెక్ట్.. 10 ఏళ్ల పిల్లాడిని నెట్స్‌లోకి లాక్కెళ్లిన తండ్రి.. వీడియో వైరల్..
ఐపీఎల్ 2026 సీజన్లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi ) తన బ్యాటింగ్ విన్యాసాలతో అందరిని ఆకట్టుకుంటున్నాడు.
Vaibhav Sooryavanshi Effect Father drags 10 years old Son into nets
Vaibhav Sooryavanshi : ఐపీఎల్ 2026 సీజన్లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ తన బ్యాటింగ్ విన్యాసాలతో అందరిని ఆకట్టుకుంటున్నాడు. సీనియర్లు, జూనియర్లు అని తేడా లేకుండా అందరి బౌలింగ్‌లోనూ చితక్కొట్టేస్తున్నాడు. తన విధ్వంసకర విన్యాసాలతో ప్రేక్షకుల హృదయాలను దోచుకుంటున్నాడు.
కాగా.. అతడి విధ్వంసకర ఆటతీరు వల్ల కొందరు చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. అతడిలా అవ్వాలని చెబుతూ చిన్న పిల్లలను వారి తల్లిదండ్రులు ఒత్తిడికి గురి చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ తండ్రీ, కొడుకుల వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో తండ్రి తన 10 ఏళ్ల కొడుకు వద్దని చెబుతున్న వినకుండా నెట్స్‌లో సీనియర్ ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొనాలని చెబుతూ బలవంతం చేస్తున్నాడు. ఆ బాలుడు వద్దు.. నేను ఆడను.. నాకు గాయాలు అవుతాయి అని ఎంతగా సర్దిచెప్పేందుకు ప్రయత్నించినప్పటికి సదరు తండ్రి ఆ పిల్లవాడి మాటను వినిపించుకోలేదు.
Dude… pic.twitter.com/6jFmNfrPSN
— Haydos🛡️ (@GovindIstOdraza) May 13, 2026
ఈ వీడియో వైరల్‌గా మారగా నెటిజన్లు విమర్శిస్తున్నారు. పిల్లలకు ఆటను నేర్పించడం మంచి విషయమే కానీ, వారి ఆవేదనను కూడా అర్థం చేసుకోవాలని కామెంట్లు చేస్తున్నారు. అందరిలో ఒకేలా ప్రతిభ ఉండదని అంటున్నారు. పిల్లలకు నచ్చినట్లు ఉండనివ్వాలని చెబుతున్నారు.
