Sanjiv Goenka : ఈయన మారడు.. మ్యాచ్ ఓడిపోగానే లక్నో యజమాని సంజీవ్ గొయెంకా ఏం చేశాడో చూశారా?
ఈ సీజన్‌లో లక్నో ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఓడిపోవడంతో ఆ జట్టు యజమాని సంజీవ్ గొయెంకా (Sanjiv Goenka) చేసిన పని ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
- Thota Vamshi Kumar
- Published On : April 2, 2026 / 08:47 AM IST
IPL 2026 Sanjiv Goenka Pant and Langer intense chat after LSG lost match to DC
- ఢిల్లీ పై ఓటమి
- కెప్టెన్ పంత్, కోచ్ లాంగర్‌తో లక్నో ఓనర్ సీరియస్ డిస్కషన్
Sanjiv Goenka : ఐపీఎల్ 2026 సీజన్‌ను లక్నో సూపర్ జెయింట్స్ ఓటమితో ఆరంభించింది. బుధవారం ఎకానా స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 18.4 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌటైంది. లక్నో బ్యాటర్లలో అబ్దుల్ సమద్ (36), మిచెల్ మార్ష్ (35) లు రాణించారు. ఢిల్లీ బౌలర్లలో లుంగి ఎంగిడి, నటరాజన్‌లు చెరో మూడు వికెట్లు తీయగా, కుల్దీప్ యాదవ్ రెండు, అక్షర్ పటేల్ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 142 పరుగుల లక్ష్యాన్ని నాలుగు వికెట్లు కోల్పోయి 17.1 ఓవర్లలో చేధించింది. ఢిల్లీ బ్యాటర్లలో సమీర్ రిజ్వీ (47 బంతుల్లో 70 నాటౌట్), ట్రిస్టన్ స్టబ్స్ (32 బంతుల్లో 39 నాటౌట్) రాణించారు. లక్నో బౌలర్లలో ప్రిన్సీ యాదవ్ రెండు, మహ్మద్ షమీ, మోసిన్ ఖాన్ లు చెరో వికెట్ తీశారు.
ఇక ఈ సీజన్‌లో లక్నో ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఓడిపోవడంతో ఆ జట్టు యజమాని సంజీవ్ గొయెంకా చేసిన పని ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. మ్యాచ్ ముగిసిన తరువాత కెప్టెన్ రిషబ్ పంత్, హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ తో కలిసి సంజీవ్ గొయెంకా బౌండరీ లైన్ వద్ద నిలబడి సీరియస్‌గా చర్చించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
LSG vs DC : అవే మా కొంపముంచాయి.. లేదంటేనా.. లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ కామెంట్స్..
Sanjiv Goenka and Rishabh pant 😭 pic.twitter.com/0RzMSkp0vE
— Faiyaz (@FaiyazWhat) April 1, 2026
ఈ నేపథ్యంలో గొయెంకా పై నెటిజన్లు మండిపడుతున్నారు. క్రికెట్ అన్నాక గెలుపు, ఓటములు సహజం అని ప్రతి దానికి ఇలా చేయడం కరెక్టు కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఐపీఎల్ 2024 సీజన్‌లో అప్పటి లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ పై సంజీవ్ గొయెంకా మైదానంలోనే ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆ సీజన్ తరువాత రాహుల్ ఆ జట్టు వీడి వెళ్లగా.. ఐపీఎల్ 2025 మెగావేలంలో రిషబ్ పంత్‌ను లక్నో జట్టు 27 కోట్లకు సొంతం చేసుకుని కెప్టెన్సీని అప్పగించింది. కాగా.. ఐపీఎల్ 2025 సీజన్‌లో పంత్ సారథ్యంలో లక్నో పేలవ ప్రదర్శన చేసింది.
Sanjiv Goenka cooked Rishabh Pant. 😭💔 pic.twitter.com/pkbYf0BDie
— Kunal Yadav (@Kunal_KLR) April 1, 2026
Lucknow Super Giants vs Delhi Capitals
Sanjiv Goenka is seen bashing Rishabh Pant post LSG loss#LSGvDC #LSGvsDC #SanjivGoenka #RishabhPant #SameerRizvi pic.twitter.com/k17azUW7I2
— MK Sharma ✍️ (@EmediaManoj) April 1, 2026
