IND vs ENG : సీనియర్లు వచ్చేశారు.. రోహిత్, కోహ్లీల బ్యాటింగ్ ఎక్కడ చూడొచ్చంటే?
ఇంగ్లాండ్‌తో చేతిలో టీ20 సిరీస్‌ను ఓడిపోయిన భారత్ ఇప్పుడు వన్డే సిరీస్‌కు (IND vs ENG) సిద్ధం అవుతోంది
Do you know where to watch IND vs ENG 1st ODI Match
IND vs ENG : ఇంగ్లాండ్ చేతిలో టీ20 సిరీస్‌ను ఓడిపోయిన భారత్ ఇప్పుడు వన్డే సిరీస్‌కు సిద్ధం అవుతోంది. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్‌లు రావడంతో భారత జట్టు మరింత బలోపేతమైంది. గురువారం (జూలై 14) నుంచి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభంకానుంది. ఈ క్రమంలో శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు టీ20 సిరీస్‌లో ఎదురైన ఘోర పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని సగటు భారత క్రీడాభిమాని కోరుకుంటున్నాడు.
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది. వన్డే ప్రపంచకప్ 2027 సన్నాహకాల్లో భాగంగా ఇరు జట్లు కూడా ఈ సిరీస్‌ను సన్నాహకంగా ఉపయోగించుకోవాలని భావిస్తున్నాయి. సీనియర్ ఆటగాళ్ల రాకతో భారత జట్టు బలం పెరిగింది. గాయాలతో జట్టుకు దూరం అయిన హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి స్థానాల్లో ప్రిన్స్ యాదవ్, రవి బిష్ణోయ్‌లను బీసీసీఐ ఎంపిక చేసింది.
ఇషాన్ పై వేటు పడనుందా?
రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్లు ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు. వన్‌డౌన్‌లో విరాట్ కోహ్లీ ఆడనున్నాడు. ఆ తరువాత శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్లో ఆడనున్నారు. అఫ్గానిస్థాన్‌తో సిరీస్‌కు విరాట్ కోహ్లీ అందుబాటులో లేకపోవడంతో వన్‌డౌన్‌లో ఆడిన ఇషాన్ కిషన్ ఇంగ్లాండ్‌తో తొలి వన్డేకి బెంచీకే పరిమితం కానున్నాడు. అక్షర్ పటేల్, శివమ్ దూబె ఆల్రౌండర్లుగా ఆడే అవకాశం ఉంది. జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్ పేస్ బాధ్యతలు మోయనున్నారు. ఒకవేళ టీమ్ మేనేజ్మెంట్ ప్రిన్స్ యాదవ్, ప్రసిధ్ కృష్ణలను ఆడించాలనుకుంటే గుర్నూర్ బ్రార్‌తో పాటు అర్ష్‌దీప్ సింగ్ బెంచీకే పరిమితం కానున్నారు.
ఎక్కడ చూడొచ్చంటే?
భారత్ ఇంగ్లాండ్ పర్యటన ప్రసార హక్కులను సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ దక్కించుకుంది. వన్డే సిరీస్‌లోని మ్యాచ్‌లు టీవీల్లో అయితే సోనీ స్పోర్ట్స్ ఛానల్లో ప్రత్యక్షప్రసారం కానున్నాయి. ఇక ఓటీటీల విషయానికి వస్తే.. సోనీ లివ్, జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానున్నాయి.
