Yastika Bhatia : చరిత్ర సృష్టించిన టీమ్ఇండియా క్రికెటర్ యస్తికా భాటియా.. లార్డ్స్‌లో ఏకైక మహిళా క్రికెటర్
భారత మహిళా క్రికెటర్ యస్తికా భాటియా (Yastika Bhatia) అరుదైన ఘనత సాధించింది.
Yastika Bhatia creates history first female cricketer to score a century in Lords test
- యస్తికా భాటియా అరుదైన ఘనత
- లార్డ్స్‌లో సెంచరీ తొలి మహిళా క్రికెటర్
Yastika Bhatia : భారత మహిళా క్రికెటర్ యస్తికా భాటియా అరుదైన ఘనత సాధించింది. లార్డ్స్ మైదానంలో సెంచరీ చేసిన తొలి మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో ఆమె ఈ ఘనత అందుకుంది. మూడో రోజు ఆటలో భారత రెండో ఇన్నింగ్స్‌లో యస్తికా భాటియా 158 బంతుల్లో 113 పరుగులు చేసింది. మహిళల క్రికెట్లో లార్డ్స్ మైదానంలో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ ఇదే.
A maiden Test hundred for Yastika Bhatia at the Home of Cricket.👏🏻👏🏻
Watch #ENGWvINDW LIVE on #SonyLIV & #SonySportsNetwork 📺🔥 pic.twitter.com/PaKcZzu6rn
— Sony LIV (@SonyLIV) July 12, 2026
Jos Buttler : చరిత్ర సృష్టించిన జోస్ బట్లర్.. ప్రపంచ క్రికెట్లో ఏకైక ఆటగాడు..
ఇక ఓవరాల్‌గా భారత క్రికెట్లో (పురుషులు, మహిళలు కలిసి) లార్డ్స్ మైదానంలో టెస్టుల్లో 11 మంది శతకాలు సాధించారు.
మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు విజయానికి చేరువైంది. మూడో రోజు ఆదివారం 457 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో ఆట ముగిసే సమయానికి 130 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. అమీజోన్స్ (52 బ్యాటింగ్), సోఫీ ఎక్లెస్టోన్ (1)లు ఆడుతున్నారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ గెలవాలంటే ఇంకో 327 పరుగులు చేయాల్సి ఉంది. భారత విజయానికి నాలుగు వికెట్లు అవసరం.
Another #TeamIndia player is on the Test Honours Board at Lord’s 🌟👏
Yastika Bhatia brings up a fantastic 𝗺𝗮𝗶𝗱𝗲𝗻 𝗧𝗲𝘀𝘁 𝗛𝗨𝗡𝗗𝗥𝗘𝗗 💯
Updates ▶️ https://t.co/O1rEau8j8n #ENGvIND | @YastikaBhatia pic.twitter.com/ILHyxGPivT
— BCCI Women (@BCCIWomen) July 12, 2026
మ్యాచ్ స్కోర్లు సంక్షిప్తంగా..
భారత తొలి ఇన్నింగ్స్ .. 258 ఆలౌట్ (స్మృతి మంధాన 83, హర్మన్ ప్రీత్ కౌర్ 58, దీప్తి శర్మ 57)
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్.. 170 ఆలౌట్ (అమీ జోన్స్ (52) హాఫ్ సెంచరీ చేయగా భారత బౌలర్లలో కాంత్రి గౌడ్ ఐదు వికెట్లు తీసింది)
భారత రెండో ఇన్నింగ్స్ .. 341/7 డిక్లేర్ (యస్తికా బాటియా 113, స్మృతి మంధాన 70)
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 130/6
