Shreyas Iyer : టీమ్ మీటింగ్ వద్దని పాంటింగ్‌కు చెప్పా.. దాని ఫలితంగా.. శ్రేయస్ అయ్యర్ కామెంట్స్ వైరల్..
పంజాబ్ కింగ్స్ నిలిచింది. వరుసగా ఆరు మ్యాచ్‌లు ఓడిపోయిన శ్రేయస్ సేన (Shreyas Iyer ) ఎట్టకేలకు విజయాన్ని అందుకుంది.
- Thota Vamshi Kumar
- Updated on- May 24, 2026 / 08:13 AM IST
IPL 2026 Shreyas Iyer Key Comments after LSG beat PBKS
- వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో ఓటమి తరువాత తొలి విజయం
- పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్ వైరల్
Shreyas Iyer : పంజాబ్ కింగ్స్ నిలిచింది. వరుసగా ఆరు మ్యాచ్‌లు ఓడిపోయిన శ్రేయస్ సేన ఎట్టకేలకు విజయాన్ని అందుకుంది. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ను మట్టి కరిపించింది. శుక్రవారం లక్నోలోని ఎకానా వేదికగా జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ విజయం పై పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
జోష్ ఇంగ్లిస్ (72; 44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేయగా.. ఆయుష్ బదోని (43; 18 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో మార్కో జాన్సెన్, చాహల్ లు చెరో రెండు వికెట్లు తీశారు. అజ్మతుల్లా ఒమర్జాయ్, శశాంక్ సింగ్ చెరో వికెట్ సాధించారు.
అనంతరం 197 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ 18 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి అందుకుంది. పంజాబ్ బ్యాటర్లలో శ్రేయాస్ అయ్యర్ (101 నాటౌట్; 51 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీతో రాణించాడు. ఆ తరువాత ప్రభ్ సిమ్రన్ సింగ్ (69; 39 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. లక్నో బౌలర్లలో షమీ రెండు వికెట్లు తీశాడు. అర్జున్ టెండూల్కర్ ఓ వికెట్ పడగొట్టాడు.
ఎంతో సంతోషంగా ఉంది
ఐపీఎల్‌లో తొలి సెంచరీ సాధించిన అనంతరం శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. ఆనందాన్ని వ్యక్తం చేశాడు. నిజం చెప్పాలంటే నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఇదే నా తొలి సెంచరీ, జట్టుకు అవసరమైన సమయంలో ఇది వచ్చింది. ఇదో గొప్ప రోజు అని అన్నాడు. ఈ విజయంతో జట్టులో గొప్ప సానుకూలత ఏర్పడింది. ఆదివారం (మే 24న) మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌కు మద్దతు ఇవ్వాలని అనుకుంటున్నాం. వారు గెలిస్తే మాకు ప్లేఆఫ్స్ అవకాశాలు ఉంటాయి అని చెప్పుకొచ్చాడు.
ఇక తమ బౌలర్ల ప్రదర్శన ఎంతో ఆకట్టుకుంటుందన్నాడు. మొదటి ఓవర్‌లోనే 16 పరుగులు ఇచ్చినప్పటికి కూడా ఆ తరువాత అజ్మత్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఇక చాహల్ గత మ్యాచ్‌లో విఫలమైనప్పటికి కూడా నేటి మ్యాచ్‌లో అదరగొట్టాడు. మధ్య ఓవర్లలో అతడు పరుగులను కట్టడి చేశాడని అన్నాడు.
SRH : టీ20ల్లో చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ప్రపంచంలోనే ఏకైక జట్టుగా..
ఇక తన ఇన్నింగ్స్ గురించి మాట్లాడుతూ.. తాను క్రీజులో వీలైనంత ఎక్కువ సేపు ఉండాలని కోరుకున్నట్లు చెప్పుకొచ్చాడు. తాను క్రీజులో ఉంటే పరుగులు వాటి అంతటా అవే వస్తాయని తెలిపాడు. ఇక విన్నింగ్ షాట్‌తో సెంచరీ చేయడం ప్రత్యేక అనుభూతి ఇస్తుందన్నాడు. ప్రతి బ్యాటర్ ఇలా కలలు గంటాడని, తనకు ఇది నిజంగా మరుపురాని రోజు అని తెలిపాడు. ఇక ప్రభ్ సిమ్రాన్ సింగ్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఒక్కరి వల్లే మ్యాచ్ గెలవడం సాధ్యం కాదన్నాడు. తను ఎంతటి ప్రతిభావంతుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదన్నాడు. మరోసారి అతడు నిరూపించుకున్నాడని చెప్పాడు.
పరాజయాల పాలు అయినప్పుడు మీటింగ్‌లు పెట్టి ఆటగాళ్లపై అనవసర ఒత్తిడి పెంచాలని అనుకోలేదన్నాడు. సమావేశాలు పెట్టి ఎక్కువగా చర్చించినప్పుడు గత ఓటములలో మునిగిపోతాము. ఆటగాళ్లపై మరింత ఒత్తిడి పెరుగుతుంది. అలా కాకుండా వారి మానాన వదిలేయడం ముఖ్యం. కీలకమైన మ్యాచ్‌లలో స్వేచ్ఛగా ఆలోచించడం అవసరం. ఒత్తిడి పరిస్థితుల్లో వాళ్ళను అతిగా ఆలోచించేలా చేయకూడదు. ఈరోజు నేను రికీతో.. ‘మనం ఎలాంటి టీమ్ మీటింగ్‌లు పెట్టుకోవద్దు. నేరుగా గ్రౌండ్‌కి వెళ్లి, మనం ఎప్పటినుంచో క్రమం తప్పకుండా చేస్తున్న మన పద్ధతులను పాటిద్దాం అని చెప్పాను. ఇప్పుడు దాని ఫలితాన్ని మనం చూస్తున్నాం అని శ్రేయస్ అన్నాడు.
