Vaibhav Sooryavanshi : సెంచ‌రీలు వ‌స్తూనే ఉంటాయ్ కానీ.. వైభ‌వ్ సూర్య‌వంశీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. ఎంత గొప్ప మ‌న‌సు అయ్యా నీది..

సెంచ‌రీల కంటే త‌న దృష్టి మొత్తం ఐపీఎల్ ట్రోఫీ గెల‌వ‌డం పైనే ఉంద‌ని రాజ‌స్థాన్ రాయ‌ల్స్ యువ ఓపెన‌ర్, 15 ఏళ్ల వైభ‌వ్ సూర్య‌వంశీ (Vaibhav Sooryavanshi) తెలిపాడు.

IPL 2026 SRH vs RR Vaibhav Sooryavanshi Comments after player of the match in Eliminator Match (pic credit@ipl)

  • ఎలిమినేట‌ర్‌లో స‌న్‌రైజ‌ర్స్‌కు చుక్క‌లు చూపించిన వైభ‌వ్ సూర్య‌వంశీ
  • క్వాలిఫ‌య‌ర్‌-2కు అర్హ‌త సాధించిన రాజ‌స్థాన్
  • ఆర్ఆర్ విజ‌యంలో కీల‌క పాత్ర పోషించ‌డంతో వైభ‌వ్‌కు ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్

Vaibhav Sooryavanshi : సెంచ‌రీల కంటే త‌న దృష్టి మొత్తం ఐపీఎల్ ట్రోఫీ గెల‌వ‌డం పైనే ఉంద‌ని రాజ‌స్థాన్ రాయ‌ల్స్ యువ ఓపెన‌ర్, 15 ఏళ్ల వైభ‌వ్ సూర్య‌వంశీ తెలిపాడు. ఇక ప్ర‌త్య‌ర్థి ఆట‌గాళ్లు త‌న‌ను ఔట్ చేసేందుకు ఏం ప్లాన్ చేస్తారు అనే విష‌యాల గురించి తాను ఆలోచించ‌ను అని, త‌న ప్ర‌ణాళిక‌ల‌పైనే దృష్టి పెట్టి సాధార‌ణ క్రికెట్ ఆడతాన‌ని చెప్పుకొచ్చాడు.

బుధ‌వారం ఎలిమినేట‌ర్ మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ పై వైభ‌వ్ సూర్య‌వంశీ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. ఎస్ఆర్‌హెచ్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. 29 బంతుల్లోనే 5 ఫోర్లు, 12 సిక్స‌ర్ల సాయంతో 97 ప‌రుగులు చేసి తృటిలో శ‌త‌కాన్ని చేజార్చుకున్నాడు. రాజ‌స్థాన్ విజ‌యంలో కీల‌క పాత్ర పోషించ‌డంతో ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ అవార్డును అందుకున్న అనంత‌రం వైభ‌వ్ మాట్లాడాడు.

Vaibhav Sooryavanshi : చ‌రిత్ర సృష్టించిన వైభ‌వ్ సూర్య‌వంశీ.. క్రిస్ గేల్ రికార్డు బ్రేక్‌..

ఈ గెలుపుతో ల‌భించే సానుకూల దృక్ప‌థాన్ని అలాగే ముందుకు తీసుకెళ్తామ‌న్నాడు. ప్ర‌స్తుతం త‌మ దృష్టి త‌దుప‌రి మ్యాచ్‌పైనే ఉంద‌న్నాడు. ఆ మ్యాచ్‌లో కూడా ఇదే త‌ర‌హా ప్ర‌ద‌ర్శ‌న చేసి విజ‌యం సాధించి ఫైన‌ల్ చేరుతామ‌న్న ధీమాను వ్య‌క్తం చేశాడు. ప్ర‌తి మ్యాచ్‌కు ముందు తాను కొంత ఆలోచిస్తాన‌ని అన్నాడు. అయితే మ‌రీ ఎక్కువ‌గా ఆలోచించ‌ను అని అన్నాడు. తాను ఏ విష‌యంలో మెరుగుప‌డాల‌నే విష‌యంపైనే ఆలోచిస్తాన‌ని తెలిపాడు.

మ్యాచ్‌కు ముందు త‌న స‌న్నాహాల గురించి మాట్లాడుతూ.. తాను ప్రత్యర్థి జట్టులో బౌలర్లు ఎవరు, ఏ వికెట్‌పై ఆడ‌నున్నాము. ఆ పిచ్ పై వారిని ఎలా ఎదుర్కోవాలి, బౌండరీలు ఎంత పెద్దవిగా ఉన్నాయి వంటి విషయాల గురించి ఆలోచిస్తానని అన్నాడు. తాను ఎక్కువ‌గా సానుకూల దృక్ప‌థంతో ఆడ‌టానికి ప్ర‌య‌త్నిస్తాన‌ని చెప్పుకొచ్చాడు. తాను అలా ఆడుతుంటే ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్లు ఒత్తిడిలోకి వెళ్తార‌న్నాడు. కాబ‌ట్టి తాను దూకుడుగా ఆడేందుకే ప్రాధాన్యం ఇస్తాన‌ని అన్నాడు.

Pat Cummins : వైభ‌వ్ సూర్య‌వంశీ కానే కాదు.. అదే మా కొంప‌ముంచింది.. లేదంటేనా.. పాట్ క‌మిన్స్ కామెంట్స్

ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ సెంచ‌రీ రికార్డును వైభ‌వ్ సూర్య‌వంశీ తృటిలో మిస్ అయ్యాడు. దీని గురించి మాట్లాడుతూ.. మ్యాచ్ ఆడుతున్న స‌మ‌యంలో ఈ రికార్డు గురించి త‌న‌కు తెలియ‌ద‌న్నాడు. ఔటైన త‌రువాత‌నే తెలిసింద‌న్నాడు. ఆ స‌మ‌యంలో నా దృష్టి అంతా జ‌ట్టుకు వీలైన స‌హ‌క‌రించ‌డ‌మేన‌ని అన్నాడు. ఎందుకంటే సెంచ‌రీలు వ‌స్తూనే ఉంటాయి. కానీ ప్ర‌స్తుతం నా దృష్టి మొత్తం ఐపీఎల్ ట్రోఫీ గెల‌వ‌డంపైనే ఉంది. నా బ్యాటింగ్‌లో ఎక్క‌డైన ఇబ్బంది ప‌డుతున్న‌ట్లుగా నాకు అనిపిస్తే దానిపై దృష్టి పెడ‌తాను. ప్ర‌త్య‌ర్థి న‌న్ను ఔట్ చేసేందుకు ఏం ప్లాన్ చేస్తుంది అన్న దాని గురించి ఆలోచించ‌ను. నా ప్ర‌ణాళిక‌ల‌పైనే దృష్టి పెట్టి.. సాధారణ క్రికెట్ ఆడ‌తాను అని వైభ‌వ్ సూర్య‌వంశీ అన్నాడు.