IPL 2026 : ఒకే మ్యాచ్‌లో గాయ‌ప‌డ్డ రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ.. ఒక‌వేళ వారు జ‌ట్టుకు దూర‌మైతే వారి స్థానాల‌ను భ‌ర్తీ చేసేది ఎవ‌రంటే?

ఐపీఎల్ 2026లో (IPL 2026 ) భాగంగా ఆదివారం ముంబైలోని వాంఖ‌డే మైదానంలో ముంబై ఇండియ‌న్స్, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి.

IPL 2026 Virat Kohli and Rohit Sharma injured in MI vs RCB

  • వాంఖ‌డే వేదిక‌గా ఆదివారం త‌ల‌ప‌డిన‌ ఎంఐ, ఆర్‌సీబీ
  • ఒకే మ్యాచ్‌లో గాయ‌ప‌డిన కోహ్లీ, రోహిత్‌
  • ఆందోళ‌న‌లో ఫ్యాన్స్‌

IPL 2026 : టీమ్ఇండియా స్టార్ ఆట‌గాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మల‌కు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఈ ఇద్ద‌రు స్టార్ ఆట‌గాళ్లు ప్ర‌స్తుతం ఐపీఎల్‌లో ఆడుతున్నారు. కోహ్లీ ఆర్‌సీబీ త‌రుపున‌, రోహిత్ శ‌ర్మ ముంబైకి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాడు. ఇక ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం ముంబైలోని వాంఖ‌డే మైదానంలో ముంబై ఇండియ‌న్స్, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్ ఫ‌లితాన్ని కాస్త ప‌క్క‌న బెడితే.. ఇప్పుడు అభిమానుల‌ను ఓ విష‌యం తీవ్రంగా వేధిస్తోంది.

ఈ మ్యాచ్‌లో అటు కోహ్లీ, ఇటు రోహిత్ శ‌ర్మ ఇద్ద‌రూ కూడా గాయ‌ప‌డ్డారు. ఆర్‌సీబీ ఇన్నింగ్స్ సంద‌ర్భంగా కోహ్లీ చీల‌మండ‌ల గాయానికి గురైయ్యాడు. ఇబ్బంది ప‌డుతూనే బ్యాటింగ్ చేసిన కోహ్లీ హాఫ్ సెంచ‌రీ త‌రువాత ఔటై పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. ఆ త‌రువాత అత‌డు మ‌ళ్లీ మైదానంలో అడుగుపెట్ట‌లేదు. ఫీల్డింగ్ చేయ‌కుండా డ‌గౌట్‌కే ప‌రిమితం అయ్యాడు. డ‌గౌట్‌లో కూర్చోనే మ్యాచ్‌ను వీక్షించాడు.

IPL 2026 : సోద‌రుడు హార్దిక్ ఔట్ కాగానే కాస్త అతిగా సంబ‌రాలు చేసుకున్న కృనాల్ పాండ్యా.. వీడియో వైర‌ల్‌..

మ‌రోవైపు ముంబై ఇండియ‌న్స్ సంద‌ర్భంగా బ్యాటింగ్ చేస్తూ రోహిత్ శ‌ర్మ తొడ కండ‌రాల గాయానికి గురైయ్యాడు. 13 బంతులు మాత్ర‌మే ఆడిన రోహిత్ శ‌ర్మ రిటైర్డ్ హ‌ర్ట్‌గా మైదానాన్నీ వీడాడు. జ‌ట్టు క‌ష్టాల్లో ఉన్న‌ప్ప‌టికి కూడా అత‌డు మ‌ళ్లీ బ్యాటింగ్ చేసేందుకు రాలేదు. దీంతో వీరిద్ద‌రి గాయాల‌పై అభిమానులు ఆందోళ‌న చెందుతున్నారు.

వీరి స్థానాల‌ను భ‌ర్తీ చేసేది ఎవ‌రంటే?

ఒక‌వేళ వీరి గాయాల తీవ్ర‌త అధికంగా ఉండి త‌దుప‌రి మ్యాచ్‌లు ఆడ‌లేని ప‌రిస్థితి ఉంటే.. వీరిద్ద‌రి స్థానాల‌ను భ‌ర్తీ చేసే ఆట‌గాళ్లు ఎవ‌రో ఓ సారి చూద్దాం.

కోహ్లీ స్థానాన్ని భ‌ర్తీ చేసేందుకు ఆర్‌సీబీ జ‌ట్టులో ప‌లువురు భార‌త ఆట‌గాళ్లు ఉన్నారు. అందులో ఆల్‌రౌండ‌ర్ వెంక‌టేశ్ అయ్య‌ర్ స్టార్ ప్లేయ‌ర్. ఇత‌డు ఫిల్ సాల్ట్ క‌లిసి ఓపెనింగ్ చేయ‌గ‌ల‌డు. అండ‌ర్‌-19 ఆట‌గాడు విహాన్ మ‌ల్హోత్రా కూడా ఉన్నాడు. జోక‌బ్ బెథెల్‌, జోర్డాన్ కాక్స్ లు మంచి ఎంపిక‌లు కావ‌చ్చు. అయితే.. ఈ ఇద్ద‌రిలో ఒక‌రిని తీసుకుంటే అప్పుడు టిమ్ డేవిడ్‌, ఆల్‌రౌండ‌ర్ రొమారియో షెప‌ర్డ్ ల‌లో ఒక‌రు బెంచీకే ప‌రిమితం కావాల్సి వ‌స్తుంది. ఇది జ‌ట్టు కూర్పును దెబ్బ‌తీస్తుంది.

Virat Kohli : విరాట్ కోహ్లీ గాయంపై ఆర్‌సీబీ కెప్టెన్ ర‌జ‌త్ పాటిదార్ కామెంట్స్‌.. నిజం చెప్పాలంటే..

ముంబైలో రోహిత్ శ‌ర్మ స్థానాన్ని భ‌ర్తీ చేసే ఆటగాళ్లు ఉన్నారు. విల్ జాక్స్‌, క్వింట‌న్ డికాక్ వంటి అంత‌ర్జాతీయ ఆట‌గాళ్లు అందుబాటులో ఉన్నారు. అయితే.. జ‌ట్టు స‌మ‌తుల్య‌త దెబ్బ‌తిన‌కుండా ఉండేందుకు రాబిన్ మింగ్స్ వంటి ప్లేయ‌ర్ల‌ను తీసుకోవ‌చ్చు. ప్ర‌స్తుతం వ‌రుస ఓట‌ముల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న ముంబై జ‌ట్టు త‌మ తుది జ‌ట్టులో భారీ మార్పులు చేప‌ట్ట‌వ‌చ్చు.