RCB : ఆర్‌సీబీ మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోతే.. ఏం జరుగుతుంది? ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తుందా?
ఐపీఎల్ 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అదరగొడుతోంది.
- Thota Vamshi Kumar
- Updated on- May 14, 2026 / 11:48 AM IST
IPL 2026 What happen if RCB lost remaining two matches (pic credit@ipl)
- పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఆర్‌సీబీ
- లీగ్‌లో దశలో ఇంకో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది
- ఈ రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోతే ఆర్‌సీబీ పరిస్థితి ఏంటి ?
- ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తుందా?
RCB : ఐపీఎల్ 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదరగొడుతోంది. ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడగా 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మరో నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 16 పాయింట్లు ఆ జట్టు ఖాతాలో ఉండగా నెట్‌రన్ +1.053గా ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. దాదాపుగా ప్లేఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకుంది.
లీగ్ దశలో ఆర్‌సీబీ ఇంకో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించడంతో పాటు టాప్-2లో నిలిచే అవకాశం ఉంటుంది. రెండు మ్యాచ్‌ల్లో ఓ మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికి కూడా మెరుగైన నెట్‌రన్‌రేటు కలిగి ఉండడంతో టాప్-4లో నిలిచి ప్లేఆఫ్స్‌కు వెళ్లొచ్చు.
రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే..
ఆర్‌సీబీ జట్టు మే 17న పంజాబ్ కింగ్స్‌తో మే 22న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో ఆర్‌సీబీ గెలిస్తే అప్పుడు ఆర్‌సీబీ ఖాతాలో 20 పాయింట్లు ఉంటాయి. ప్లేఆఫ్స్‌కు అర్హత సాదించడమే కాదు.. టాప్-2లో నిలవొచ్చు. అప్పుడు పైనల్ చేరుకునేందుకు రెండు అవకాశాలు లభిస్తాయి.
ఒక్క మ్యాచ్‌లో గెలిస్తే..
మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఆర్‌సీబీ ఒక్క మ్యాచ్‌లో గెలిస్తే అప్పుడు ఆ జట్టు ఖాతాలో 18 పాయింట్లు ఉంటాయి. అప్పుడు కూడా ప్లేఆఫ్స్ చేరుకోవచ్చు. అయితే.. ఫైనల్ చేరుకునేందుకు ఎలిమినేటర్, క్వాలిఫయర్-2 మ్యాచ్‌లు ఆడాల్సి రావొచ్చు.
రెండు మ్యాచ్‌లు ఓడిపోతే..
మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఆర్‌సీబీ ఓడిపోతే అప్పుడు 16 పాయింట్లతో ఆర్‌సీబీ నిలుస్తుంది. అప్పుడు కూడా ప్లేఆఫ్స్‌కు చేరుకునే అవకాశం ఉంది. అయితే.. అది మిగిలిన జట్ల ఫలితాలు, నెట్‌రన్‌రేటులపై ఆధారపడి ఉండొచ్చు.
