ఒకే రోజు 4 సార్లు చేతులు మారిన ఆరెంజ్ క్యాప్.. ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి.. ఆ నలుగురు వీళ్లే..
టోర్నమెంట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు నాలుగు సార్లు ఆరెంజ్ క్యాప్ (Orange Cap) చేతులు మారింది.
- Thota Vamshi Kumar
- Updated on- April 26, 2026 / 02:27 PM IST
IPL 22026 Kohli to Abhishek Sharma the Orange Cap changed hands four times in a day
- శనివారం రోజు నలుగురి చేతులు మారిన ఆరెంజ్ క్యాప్
- ఐపీఎల్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి
Orange Cap : ఐపీఎల్ 2026లో భాగంగా శనివారం (ఏప్రిల్ 25న) జరిగిన డబుల్ హెడర్ మ్యాచ్‌లు అభిమానులను ఎంతో అలరించాయి. తొలి మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ విధ్వంసకర శకంతో (152 నాటౌట్; 67 బంతుల్లో 16 ఫోర్లు, 9 సిక్సర్ల)తో ఢిల్లీ 264 పరుగులు చేయగా.. పంజాబ్ కింగ్స్ మరో ఏడు బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
ఇక రెండో మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ (103; 37 బంతుల్లో 5 ఫోర్లు, 12 సిక్సర్లు) సెంచరీతో చెలరేగడంతో రాజస్థాన్ 228 పరుగులు చేసినప్పటికి కూడా దానిని కాపాడుకోలేకపోయింది. ఇషాన్ కిషన్ (74; 31 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లు), అభిషేక్ శర్మ (57; 29 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీలతో రాణించడంతో 229 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్ 18.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి అందుకుంది.
గతంలో ఎన్నడూ కూడా ఇలా..
ఇక శనివారం రోజు ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. టోర్నమెంట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు నాలుగు సార్లు ఆరెంజ్ క్యాప్ చేతులు మారింది.
శనివారం డబుల్ హెడర్ మ్యాచ్‌లు ప్రారంభం అయ్యే సమయానికి ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా విరాట్ కోహ్లీ ఉన్నాడు. తొలి మ్యాచ్‌లో కేఎల్ వీరవిహారం చేయడంతో ఢిల్లీ ఇన్నింగ్స్ ముగియగానే ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా కేఎల్ రాహుల్ నిలిచాడు. ఆ తరువాత రెండో మ్యాచ్ లో విధ్వంసకర శతకంతో వైభవ్ సూర్యవంశీ.. కేఎల్ రాహుల్ వద్ద నుంచి ఆరెంజ్ క్యాప్ లాక్కుకున్నాడు. అయితే.. వైభవ్ ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. రాజస్థాన్ పై మెరుపు వేగంతో 57 పరుగులు చేసి అభిషేక్ శర్మ అందరిని అధిగమించి ఆరెంజ్ క్యాప్ ను సొంతం చేసుకున్నాడు.
ఈ సీజన్‌లో ఇప్పటి వరకు అత్యధిక పరుగులు చేసిన టాప్ -5 ఆటగాళ్లు వీరే..
* అభిషేక్ శర్మ – 8 మ్యాచ్‌ల్లో 380 పరుగులు
* వైభవ్ సూర్యవంశీ – 8 మ్యాచ్‌ల్లో 357 పరుగులు
* కేఎల్ రాహుల్ – 7 మ్యాచ్‌ల్లో 357 పరుగులు
* హెన్రిచ్ క్లాసెన్ – 8 మ్యాచ్‌ల్లో 349 పరుగులు
* విరాట్ కోహ్లీ – 7 మ్యాచ్‌ల్లో 328 పరుగులు
