IPL ఫైనల్‌: టాస్ గెలిస్తే.. మ్యాచ్ గెలిచినట్టేనా

ఐపీఎల్ 2019 ఫైనల్ మ్యాచ్ హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా ఆదివారం మే12న జరగనుంది. క్వాలిఫయర్ 1లో చెన్నైను ఓడించి ఫైనల్‌కు అర్హత సాధించిన ముంబై.. క్వాలిఫయర్ 2లో ఢిల్లీని చిత్తు చేసి అర్హత సాధించిన సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. తొలి సారి 2010లో ఆ తర్వాత 2013, 2015లలో తలపడిన ఇరు జట్లు 2019లో మరోసారి ఢీకొనేందుకు సిద్ధమవుతున్నాయి. 

ఐపీఎల్ ఫార్మాట్‌లో టాస్ ఎంతో కీలకమని వేరే చెప్పనవసర్లేదు. సీజన్ ఆసాంతం ఫైనల్ మ్యాచ్‌లో టాస్ ఎంతమేర ప్రభావం చూపిందో ఒక్కసారి పరిశీలిస్తే..

 

సీజన్

మ్యాచ్

టాస్ విజేత
2008 రాజస్థాన్ రాయల్స్ Vs చెన్నై సూపర్ కింగ్స్  RR RR
2009 డెక్కన్ చార్జర్స్ Vs రాయల్ చాలెంజర్స్ బెంగళూరు RCB DC
2010 చెన్నై సూపర్ కింగ్స్ Vs ముంబై ఇండియన్స్ CSK CSK
2011 చెన్నై సూపర్ కింగ్స్ Vs రాయల్ చాలెంజర్స్ బెంగళూరు CSK CSK
2012 కోల్‌కతా నైట్ రైడర్స్ Vs చెన్నై సూపర్ కింగ్స్ CSK KKR
2013 చెన్నై సూపర్ కింగ్స్ Vs ముంబై ఇండియన్స్ MI MI
2014 కోల్‌కతా నైట్ రైడర్స్ Vs కింగ్స్ XI పంజాబ్ KKR SRH
2015 చెన్నై సూపర్ కింగ్స్ Vs ముంబై ఇండియన్స్ CSK MI
2016 సన్‌రైజర్స్ హైదరాబాద్ Vs రాయల్ చాలెంజర్స్ బెంగళూరు SRH SRH
2017 ముంబై ఇండియన్స్ Vs రైజింగ్ పూణె సూపర్‌జెయింట్స్  MI MI
2018 చెన్నై సూపర్ కింగ్స్ Vs సన్‌రైజర్స్ హైదరాబాద్ CSK CSK
2019 చెన్నై సూపర్ కింగ్స్ Vs  ముంబై ఇండియన్స్ ? ?

 

మరో ఆసక్తికర విషయమేమిటంటే.. చెన్నై.. ముంబైల మధ్య జరిగిన ఫైనల్ పోరులో ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టే 3సార్లు గెలుపొందింది.