IPL 2026 : వార్నీ ఎంత పనాయె.. కేకేఆర్ విజయం.. ముంబైకి తీరని నష్టం..
ఐపీఎల్ 2026 (IPL 2026 ) సీజన్‌లో ఎట్టకేలకు కోల్‌కతా నైట్‌రైడర్స్ గెలుపు బోణీ కొట్టింది
- Thota Vamshi Kumar
- Updated on- April 20, 2026 / 01:02 PM IST
IPL points table 2026 MI at bottom after KKR win the match against RR (pic credit@ipl)
- ఐపీఎల్‌లో గెలుపు బోణీ కొట్టిన కేకేఆర్
- పాయింట్ల పట్టికలో మెరుగైన కోల్‌కతా స్థానం
- అట్టడుగు స్థానానికి పడిపోయిన ముంబై ఇండియన్స్
IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్‌లో ఎట్టకేలకు కోల్‌కతా నైట్‌రైడర్స్ గెలుపు బోణీ కొట్టింది. వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన ఆ జట్టు ఎట్టకేలకు ఓ విజయాన్ని నమోదు చేసింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఆ జట్టు ప్లేయర్ల ఆనందానికి అవధులు లేవు.
కేకేఆర్ విజయం సాధించడంతో ముంబై ఇండియన్స్‌కు గట్టి షాక్ తగిలింది. ఇన్నాళ్లు పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉన్న కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు ఓ స్థానాన్ని మెరుగుపరచుకుంది. తొమ్మిదో స్థానానికి చేరుకుంది. మరో వైపు కేకేఆర్ విజయంతో ముంబై ఇండియన్స్ అట్టడుగు స్థానానికి పడిపోయింది.
ఇరు జట్లు ఒక్కొ మ్యాచ్‌లో మాత్రమే విజయాన్ని సాధించాయి. అయితే.. పంజాబ్ కింగ్స్‌తో జరగాల్సి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో కేకేఆర్ ఖాతాలో ప్రస్తుతం మూడు పాయింట్లు ఉన్నాయి. మరోవైపు ముంబై ఖాతాలో రెండు పాయింట్లు మాత్రమే ఉన్నాయి. ముంబై ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడగా నాలుగింటిలో ఓడిపోయింది.
Vaibhav Sooryavanshi : కేకేఆర్ పై ఓటమి.. వెక్కి వెక్కి ఏడ్చిన వైభవ్ సూర్యవంశీ.. వీడియో వైరల్
ఇక ముంబై ఇండియన్స్ నేడు (ఏప్రిల్ 20న) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని సవరించుకోవాలని ముంబై ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
