Vaibhav Sooryavanshi : కేకేఆర్ పై ఓటమి.. వెక్కి వెక్కి ఏడ్చిన వైభవ్ సూర్యవంశీ.. వీడియో వైరల్
తమ జట్టు ఓటమిని ఆర్ఆర్ స్టార్ ఓపెనర్, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) జీర్ణించుకోలేకపోయాడు.
Vaibhav Sooryavanshi crying
- కేకేఆర్ పై రాజస్థాన్ ఓటమి
- తమ జట్టు ఓటమిని జీర్ణించుకోలేకపోయిన వైభవ్ సూర్యవంశీ
- బౌండరీ లైన్ వద్ద కూర్చుని వెక్కి వెక్కి ఏడుపు
Vaibhav Sooryavanshi : ఐపీఎల్ 2026లో ఆడిన తొలి నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన రాజస్థాన్ రాయల్స్ ఆ తరువాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఆదివారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఈ సీజన్లో కేకేఆర్‌కు ఇదే తొలి విజయం కావడం గమనార్హం. కాగా.. మ్యాచ్ అనంతరం వైభవ్ సూర్యవంశీ వెక్కి వెక్కి ఏడ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వైభవ్ సూర్యవంశీ (46; 28 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు), యశస్వి జైస్వాల్ (39; 29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. కేకేఆర్ బౌలర్లో కార్తిక్ త్యాగి, వరుణ్ చక్రవర్తి చెరో మూడు వికెట్లు పడగొట్టారు. సునీల్ నరైన్ రెండు వికెట్లు సాధించాడు.
అనంతరం 156 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా నైట్‌రైడర్స్ 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కేకేఆర్ బ్యాటర్లలో రింకూ సింగ్ (53నాటౌట్; 34 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. అనుకుల్ రాయ్ (29 నాటౌట్), కామెరూన్ గ్రీన్ (27) లు రాణించారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో రవీంద్ర జడేజా రెండు వికెట్లు తీశాడు. జోఫ్రా ఆర్చర్, నాండ్రే , యశ్ రాజ్, రవి బిష్ణోయ్‌లు తలా ఓ వికెట్ సాధించారు.
ఆఖరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో చివరికి రాజస్థాన్ రాయల్స్ ఓడిపోయింది. కాగా.. తమ జట్టు ఓటమిని ఆర్ఆర్ స్టార్ ఓపెనర్, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ జీర్ణించుకోలేకపోయాడు. మ్యాచ్ ముగిసిన తరువాత బౌండరీ లైన్ ఆవల కూర్చోని వెక్కి వెక్కి ఏడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతడు ఇంకా చిన్నపిల్లవాడు అని, ఆటను ఎంతగా ప్రేమిస్తున్నాడో అర్థమవుతోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Shreyas Iyer : వినడానికి వింతగా ఉండొచ్చు.. కూపర్, ప్రియాన్ష్లకు ఓ ఛాలెంజ్ పెట్టాను..
Vaibhav Sooryavanshi crying badly after RR’s loss against KKR. 🥹
KKR players were seen consoling him. He gave his best.
He was the highest scorer for his team, but he is still crying after the loss.This shows that he is really a 15-year-old kid with true passion for the game. pic.twitter.com/GIYirK2gMG
— Sonu (@Cricket_live247) April 20, 2026
ఇదిలా ఉంటే.. ఆర్ఆర్ తరుపున అతడే టాప్ స్కోరర్ కావడం గమనార్హం.
