Shreyas Iyer : వినడానికి వింతగా ఉండొచ్చు.. కూపర్, ప్రియాన్ష్లకు ఓ ఛాలెంజ్ పెట్టాను..
మ్యాచ్ అనంతరం పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) మాట్లాడుతూ ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
Shreyas Iyer key comments after Lucknow Super Giants lost match to Punjab Kings
- లక్నో పై విజయం
- ఆనందాన్ని వ్యక్తం చేసిన పంజాబ్ కెప్టెన్
- కూపర్, ప్రియాన్ష్లకు ఓ ఛాలెంజ్ పెట్టానన్న శ్రేయస్ అయ్యర్
Shreyas Iyer : ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్ పై 54 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ సీజన్లో పంజాబ్‌కు ఇది ఐదో విజయం కాగా.. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఈ క్రమంలో ఐపీఎల్ సీజన్లో ఇప్పటి వరకు ఓటమే ఎగురని జట్టుగా పంజాబ్ నిలిచింది.
ఇక మ్యాచ్ అనంతరం పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ప్రియాన్ష్ ఆర్య, కూపర్ కొన్నోలీ ల ప్రశంసల వర్షం కురిపించాడు. మిడిల్ ఓవర్లలో వీరిద్దరు ఆడిన తీరు, వారి భాగస్వామ్యమే మ్యాచ్‌లో తమను విజేతగా నిలబెట్టాయని చెప్పుకొచ్చాడు.
Sanjiv Goenka : నువ్వే కదా మమ్మల్ని ఓడించింది.. ప్రియాన్ష్ ఆర్యతో సంజీవ్ గొయెంకా
నిజం చెప్పాలంటే వారు కొట్టిన కొన్ని షాట్లు అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా పేసర్ల బౌలింగ్‌లో బ్యాట్ ఫుట్ మీద నిలబడి స్ట్రైయిట్ షాట్స్, స్పిన్నర్లపై ఆధిపత్యం చెలాయించడం బాగుందన్నాడు. ఇలా ఆడాలంటే ఎంతో ధైర్యం, సంయమనం కావాలన్నాడు. ఎందుకంటే మ్యాచ్‌లో క్షణంలోనే పరిస్థితులు మారిపోతుంటాయన్నాడు.
సిక్సర్ల ఛాలెంజ్..
తాను కూపర్, ప్రియాన్ష్తో ఇప్పుడే మాట్లాడానని శ్రేయస్ తెలిపాడు. వీరిద్దరికి సిక్సర్ల పోటీ పెట్టినట్లుగా వివరించాడు. ఈ ఐపీఎల్ సీజన్లో ఇద్దరిలో ఎవరు ఎక్కువ సిక్సర్లు కొడితే వారికి తన బ్యాట్‌ను బహుమతిగా ఇస్తానని చెప్పినట్లుగా తెలిపాడు. ఇది కాస్త వింతగా అనిపించినా కూడా వారు ఇలాంటి ప్రదర్శనలు ఇస్తున్నంత కాలం ఎంతో సంతోషంగా ఉంటుందన్నాడు. ఆటగాళ్లకు స్వేచ్ఛను ఇస్తే ఇలాంటి ఫలితాలే వస్తాయన్నాడు.
ఎలా ఆడాలి అనే విషయంపై తాను ఎవరికి ఎలాంటి సలహాలు ఇవ్వనని శ్రేయస్ తెలిపాడు. ప్రతి ఆటగాడికి ఓ సొంత పద్దతి, దిన చర్య ఉంటుందన్నాడు. వారు వాటినే అనుసరించి ఫలితాలను సాధిస్తారని చెప్పుకొచ్చాడు. రికీ పాంటింగ్ మ్యాచ్‌కు ముందు అందరిని ఉత్సాపరుస్తాడని చెప్పుకొచ్చాడు. ఇక తమ జట్టులో చాలా మంది అంతర్జాతీయ స్థాయి బౌలర్లు ఉన్నారన్నాడు.
వారి అందరికి ఎంతో అనుభవం ఉందన్నాడు. కాబట్టి వారికి తాను కొత్తగా ఏమీ చెప్పాల్సిన పని లేదన్నాడు. ఈ రోజు అద్భుతంగా బౌలింగ్ చేశారని, ఇక ఈసీజన్ అంతటా వారి ప్రదర్శన చాలా బాగుందని చెప్పాడు. ఇక పై కూడా వారు ఇలాంటి ప్రదర్శననే కొనసాగించాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. ఇప్పటి వరకు అంతా బాగుందన్నాడు.
