Ricky Ponting : మూడు క్యాచ్‌లు మిస్ చేసిన శశాంక్ సింగ్.. కరచాలనం చేసే సమయంలో రికీ పాంటింగ్ రియాక్షన్ వైరల్
శశాంక్ సింగ్ మూడు క్యాచ్‌లను మిస్ చేసిన తరువాత కరచాలనం ఇచ్చే సమయంలో రికీ పాంటింగ్ (Ricky Ponting) ఇచ్చిన రియాక్షన్ వైరల్‌గా మారింది.
Ricky Ponting Disbelief as Shashank Singh Drops 3 Catches (pic credit@ipl)
- మూడు క్యాచ్‌లను మిస్ చేసిన శశాంక్ సింగ్
- శ్రేయస్ అయ్యర్ అసంతృప్తి, రికీ పాంటింగ్ నిరాశ
- మ్యాచ్ ముగిసిన తరువాత కౌగలించుకుని..
Ricky Ponting : ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ ఓటమే ఎరుగని జట్టుగా నిలిచింది. ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్ పై 54 పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే.. ఈ మ్యాచ్‌లో విజయం సాధించినప్పటికి కూడా వారి ఫీల్డింగ్ నిరాశపరిచింది. ముఖ్యంగా శశాంక్ సింగ్ ఔట్ ఫీల్డ్‌లో ఏకంగా మూడు క్యాచ్‌లు మిస్ చేశాడు.
శశాంక్ సింగ్ క్యాచ్ లను మిస్ చేయడం.. పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ను అసంతృప్తికి గురి చేయగా.. హెడ్ కోచ్ రికీ పాంటింగ్ నిరాశ చెందాడు. అయినప్పటికి కూడా మ్యాచ్ అనంతరం శ్రేయస్ అయ్యర్, రికీ పాంటింగ్ ఇద్దరూ కూడా శశాంక్‌తో సరదాగా మాట్లాడుతూ కనిపించారు.
లక్నో ఇన్నింగ్స్ 14 ఓవర్లో శశాంక్ సింగ్ మొదటి క్యాచ్‌ను మిస్ చేశాడు. చాహల్ బౌలింగ్‌లో హార్డ్ హిట్టర్ నికోలస్ పూరన్ భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే.. మిస్ టైమింగ్ కావడంతో బంతి గాల్లోకి లేచింది. అయితే.. శశాంక్ సింగ్ ఆ క్యాచ్‌ను పట్టుకోలేకపోయాడు. అతడి చేతి వేళ్లను తాకుతూ బంతి వెళ్లిపోయింది.
Shreyas Iyer : వినడానికి వింతగా ఉండొచ్చు.. కూపర్, ప్రియాన్ష్లకు ఓ ఛాలెంజ్ పెట్టాను..
Shashank Singh dropped yet another catch.. oh hog what happened with him.. pressure of earlier drop 😞
Shreyas Iyer chuckled this time n Ponting stare.. tat says all 😄#PBKSvsLSG #LSGvsPBKS #PBKSvLSG #LSGvPBKS #iplonstar pic.twitter.com/Mhij8oyOFz— Cric_Lover 🏏 (@ankit_bhattar) April 19, 2026
ఇక రెండో క్యాచ్‌ను 18వ ఓవర్లో మిస్ చేశాడు. ఐడెన్ మార్క్రమ్ భారీ షాట్ ఆడాడు. అయితే.. బంతి గాల్లోకి చాలా ఎత్తులో లేచింది. స్వీపర్ కవర్లో ఫీల్డింగ్ చేస్తున్న శశాంక్ సింగ్ బౌండరీ లైన్ వరకు పరిగెత్తుకుంటూ వెళ్లాడు. ఆ తరువాత అతడు బంతిని వదిలివేసి నిలబడి బాల్‌ను చూస్తుండిపోయాడు. బాల్ సిక్స్‌గా వెళ్లింది. అతడు గనుక బంతిని కరెక్ట్‌గా జడ్జ్ చేసి ఉంటే అది క్యాచ్ అయి ఉండేది. డగౌట్ నుంచి ఈ దృశ్యాన్ని చూసిన రికీ పాంటింగ్ ఆశ్చర్యపోయాడు. దీనిపై శశాంక్ క్షమాపణలు చెప్పాడు.
ఇక చివరి ఓవర్లో శశాంక్ సింగ్ మరో క్యాచ్‌ను నేలపాలు చేశాడు. ముకుల్ చౌదరి ఇచ్చిన క్యాచ్‌ను డీప్ స్క్వేర్ లెగ్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి అందుకున్నాడు. అయితే.. బంతి అతడి చేతిలోంచి కింద పడింది. దీన్ని చూసిన శ్రేయస్ అయ్యర్ చిన్నగా చిరు నవ్వు నవ్వగా, డగౌట్లో ఉన్న పాంటింగ్ మాత్రం చాలా గంభీరంగా కనిపించాడు.
Sanjiv Goenka : నువ్వే కదా మమ్మల్ని ఓడించింది.. ప్రియాన్ష్ ఆర్యతో సంజీవ్ గొయెంకా
Shreyas Iyer and Ricky Ponting hugging Shashank Singh after the match 🫂 🔥😂 #PBKSvsLSG #IPL2026 #LSGvsPBKS pic.twitter.com/LjH0PNhgpX
— ViratKoisa Cricket (@ViratKoisaAxom) April 19, 2026
మ్యాచ్ ముగిసిన తరువాత శశాంక్ క్యాచ్‌లను జారవిడిన విషయాలను పాంటింగ్, అయ్యర్ ఇద్దరూ మరిచిపోయినట్లుగా కనిపించారు. కరచాలనం చేసుకుంటున్న సమయంలో ఇద్దరూ చిరునవ్వులతో శశాంక్ కౌగలించుకున్నారు. ఇలాగే ఉండాలని, మ్యాచ్‌లో తప్పిదాలు సహజం అని, అయ్యర్, పాంటింగ్లది మంచి మనసు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
