Viral Video : తిక్క కుదిరిందా.. రీల్స్ పిచ్చితో యువతి ఓవరాక్షన్.. 70 వేల ఉంగరం గోవిందా.. వీడియో వైరల్
ఖాళీ స్టేడియంలో ఓ రీల్ చేసి పోస్ట్ చేయాలని, తద్వారా భారీ వ్యూస్ పొందాలని అనుకున్న (Viral Video) యువతికి భారీ షాక్ తగిలింది.
A young women purposely drops 70000 ring at stadium to film reel then fails to find
- ఐపీఎల్ మ్యాచ్ అనంతరం మైదానంలో సరదాగా రీల్ తీయాలని అనుకున్న యువతి
- కట్ చేస్తే 70 వేల రింగ్ గోవిందా
- తిక్క కుదిరిందా అని నెటిజన్ల కామెంట్లు
Viral Video : సోషల్ మీడియాలో పాపులర్ కావాలని యువత చేసే హంగామా అంతా ఇంతా కాదు. కొందరు వ్యూస్ కోసం ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు కూడా. అయినప్పటికి వారిలో మార్పు రావడం లేదు. ఇటీవల ఓ యువతి క్రికెట్ మ్యాచ్ చూసేందుకు వెళ్లింది. మ్యాచ్ చూసిన తరువాత ఖాళీ స్టేడియంలో ఓ రీల్ చేసి పోస్ట్ చేయాలని, తద్వారా భారీ వ్యూస్ పొందాలని అనుకుంది. కట్ చేస్తే అమ్మడికే దిమ్మ తిరిగే బొమ్మకనపడింది.
అసలేం జరిగింది?
ఏప్రిల్ 11 న (శనివారం) న్యూ ఛండీగర్‌లోని మహారాజా యాదవేంద్ర సింగ్ పీసీఏ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ అనంతరం మధు ప్రియ అనే మహిళ సరదాగా ఓ వీడియోను చేయాలనుకుంది. తన చేతికి ఉన్న ఖరీదైన ఉంగరాన్ని విసిరివేస్తున్నట్లుగా ఓ వీడియోను చేయాలనుకుంది. కట్ చేస్తే ఆ ఉంగరాన్ని పొగొట్టుకుంది. దీంతో ఆమె స్టేడియంలోనే కన్నీళ్లు పెట్టుకోవాల్సి వచ్చింది.
Vaibhav Sooryavanshi : కేకేఆర్ పై ఓటమి.. వెక్కి వెక్కి ఏడ్చిన వైభవ్ సూర్యవంశీ.. వీడియో వైరల్
ఆమె షేర్ చేసిన వీడియోలో ఏముందంటే.. యువతి తన చేతికి ఉన్న రింగ్ ను సరదాగా విసిరివేస్తున్నట్లుగా నటించింది. తన ముందు ఉన్న గచ్చు బండపై వేసింది. అయితే.. అనుకోకుండా ఆ రింగ్ బౌన్స్ అయి పక్కనే ఉన్న సీట్ల కిందకు దొర్లుకుంటూ వెళ్లిపోయింది. దీంతో షాకైన సదరు యువతి.. తన స్నేహితులతో కలిసి అక్కడ అంతా వెతికింది. ఎంత సేపటికి కూడా సదరు రింగ్ దొరకలేదు.
View this post on Instagram
Ricky Ponting : మూడు క్యాచ్‌లు మిస్ చేసిన శశాంక్ సింగ్.. కరచాలనం చేసే సమయంలో రికీ పాంటింగ్ రియాక్షన్ వైరల్
ఇక ఇదే విషయాన్ని తెలియజేస్తూ వీడియో పోస్ట్ చేసింది. ఆ ఉంగరం ఖరీదు 70 వేలు అని చెప్పుకొచ్చింది. ఎవరికైనా తన ఉంగరం దొరికితే తిరిగి ఇచ్చేయాలని కోరింది. టికెట్ వివరాలు పంపుతామని, స్టేడియం సిబ్బంది సాయం చేయాలని విన్నవించుకుంది. ఈ వీడియో వైరల్‌గా మారగా తిక్క కుదిరిందా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
