ఐపీఎల్ 2020 చాంపియన్స్‌కు ఇచ్చే ప్రైజ్ మనీలో బీసీసీఐ కాస్ట్ కటింగ్ అంటూ కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. 2019 టోర్నీతో పోల్చి చూస్తే సగానికి తగ్గించేశారు. ఈ మేరకు ఎనిమిది ఫ్రాంచైజీలకు సర్కూలర్ పంపారు. గతేడాది గెలిచిన జట్టుకు రూ.20కోట్ల ప్రైజ్ మనీని అందించారు. దానిని ఈ ఏడాది సగానికి కుదిస్తూ.. రూ.10కోట్లకు ఖాయం చేసింది.
‘కాస్ట్ కటింగ్‌లో భాగంగా ఫైనాన్షియల్ రివార్డులను తగ్గించాం. ఛాంపియన్స్‌కు రూ.20కోట్లకు బదులుగా రూ.10కోట్లు మాత్రమే వస్తాయి. రన్నరప్‌గా నిలిచిన వారికి అందే రూ.12.5కోట్ల నగదును కుదిస్తూ రూ.6.25గా నిర్ణయించారు’ అని బీసీసీఐ నోటిఫికేషన్ లో పేర్కొంది. క్వాలిఫయర్స్ దాటిన రెండు జట్లకు ఒక్కొక్క దానికి రూ.4.375కోట్లు చొప్పున ఇస్తారు. (MSK Prasad స్థానంలో సునీల్ జోషీ)
ఫ్రాంచైజీలకు ఆర్థిక ఇబ్బందులేమీ లేవు. ఆధాయాన్ని రాబట్టుకునేందుకు స్పాన్సర్లను తీసుకొచ్చుకోగలవు. అందుకే ప్రైజ్ మనీపై ఈ నిర్ణయం తీసుకున్నాం. టోర్నీలో పాల్గొన్న ఒక్కో ఫ్రాంచైజీకు రూ.కోటి అందజేసేవాళ్లం దానికి బదులు ఇప్పుడు రూ.50లక్షలే ఇవ్వాలనుకుంటున్నాం.
బీసీసీఐ ఉద్యోగులు కూడా బిజినెస్ క్లాస్ ఫ్లైట్లు ఎక్కడానికి వీల్లేదు. ఎనిమిది గంటల ప్రయాణ సమయం కంటే తక్కువ ఉన్న దూరాలకు అంటే (శ్రీలంక, బంగ్లాదేశ్, యూఏఈ)లకు వెళ్లేటప్పుడు సాధారణ జర్నీ మాత్రమే చేయాలని ఆర్డర్లు ఇచ్చింది.