IPL Robot Dog : అరే.. ఇదేదో భలేగుందే.. ఐపీఎల్‌లో రోబో డాగ్ సందడి.. దీనికి ఏం పేరు పెట్టాలో మీరే చెప్పండి..

క్రికెటర్లు రోబో డాగ్ తో సరదాగా సంభాషించారు. దాని కదలికలను పరిశీలించి ఆశ్చర్యపోయారు. చాలా ఫన్నీగా ఉందని..

Courtesy BCCI

IPL Robot Dog : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) బ్రాడ్ కాస్ట్ టీమ్ లోకి కొత్త సభ్యుడు వచ్చి చేరాడు. అయితే అది మనిషి మాత్రం కాదు. అది నడవలగదు, పరిగెత్తగలదు, దూకగలదు, చిరునవ్వులు పూయించగలదు. మనిషి కాదంటున్నారు.. మరి ఏమై ఉంటుందా అని ఆలోచిస్తున్నారా.. ఇంతకీ ఆ కొత్త మెంబర్ ఎవరో తెలుసా.. రోబో డాగ్. అవును.. అదే క్వాడ్ రూప్డ్ (చతుర్భుజ) రోబో డాగ్.

ఈ రోబో డాగ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. అరే.. ఇదేదో భలేగుందే అని దాన్ని చూసినోళ్లంతా ఆశ్చర్యపోతున్నారు. అంతా దాని గురించే డిస్కస్ చేసుకుంటున్నారు. రోబో డాగ్ ఫీచర్స్ చూసి ఫిదా అవుతున్నారు. రోబో డాగ్ కు సంబంధించి లీగ్ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో పోస్ట్ చేసిన ప్రత్యేక వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోలో న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ డానీ మోరిసన్ రోబోటిక్ కుక్కను ఆవిష్కరించారు. ఐపీఎల్ 2025 సీజన్‌కు ప్రసార కవరేజీలో భాగంగా ఈ రోబో ఉంటుందని ఆయన వెల్లడించారు.

ఈ రోబో డాగ్ చాలా స్పెషల్ గా ఉంది. ఇందులో చాలా స్పెషల్ ఫీచర్లు ఉన్నాయి. నిఘా, ప్రసార కెమెరా లక్షణాలతో కూడిన రోబోట్ డాగ్, మోరిసన్ వాయిస్ ఆదేశాలకు ప్రతిస్పందిస్తూ కనిపించింది.

Also Read : ఐపీఎల్‌ 2025లో భారీగా జరిమానాలు పడింది ఈ ఏడుగురికే.. ఎందుకంటే? ఫుల్‌ లిస్ట్‌..

ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ రోబోకు పేరుని సూచించమని ఐపీఎల్ కోరింది. “మా తాజా జట్టు సభ్యుడి పేరును మీరు చెప్పాలని మేము కోరుకుంటున్నాము” అని మోరిసన్ కోరారు.

ఈ వీడియోలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, అతని సహచరుడు రీస్ టోప్లీ, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ సహా అనేక మంది ఐపీఎల్ స్టార్లు కూడా ఉన్నారు. ముగ్గురు క్రికెటర్లు రోబో కుక్కతో సరదాగా సంభాషించారు. దాని కదలికలను పరిశీలించి ఆశ్చర్యపోయారు. చాలా ఫన్నీగా ఉందని కామెంట్ చేశారు.