Virat Kohli First Fifty : ఎట్టకేలకు.. విరాట్ కోహ్లి హాఫ్ సెంచరీ
కొన్ని నెలలుగా ఫామ్ కోల్పోయి పరుగులు చేసేందుకు తీవ్రంగా తంటాలు పడుతున్న విరాట్ కోహ్లి... ఎట్టకేలకు రాణించాడు. అభిమానుల నిరీక్షణకు తెరదించాడు.
- Naveen
- Published On : April 30, 2022 / 05:25 PM IST
Virat Kohli First Fifty
Virat Kohli First Fifty : కొన్ని నెలలుగా ఫామ్ కోల్పోయి పరుగులు చేసేందుకు తీవ్రంగా తంటాలు పడుతున్న విరాట్ కోహ్లి… ఎట్టకేలకు రాణించాడు. అభిమానుల నిరీక్షణకు తెరదించాడు. ఐపీఎల్ 2022 సీజన్ 15లో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. బ్రబౌర్న్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ లో విరాట్ కోహ్లి ఫిఫ్టీ కొట్టాడు.
Virat Kohli : సమంత సాంగ్‌కు కోహ్లీ స్టెప్స్.. వీడియో వైరల్
విరాట్ కోహ్లి 45 బంతుల్లో 50 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 6 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. ఈ ఐపీఎల్ లో 41, 12, 5, 48, 1, 12, 0, 0, 9 పరుగులతో పేలవ ప్రదర్శన చేశాడు విరాట్ కోహ్లి. కాగా, శనివారం గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ లో ఓపెనర్ గా దిగిన విరాట్ కోహ్లి.. క్రీజ్ లోకి వచ్చినప్పటి నుంచి షాట్లతో అలరించాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. విరాట్ ఫిఫ్టీ కొట్టగానే గ్యాలరీలో ఉన్న విరాట్ భార్య అనుష్క శర్మ చప్పట్లు కొడుతూ ప్రోత్సహించింది. కాగా, హాఫ్ సెంచరీ కొట్టిన వెంటనే విరాట్ ఔటయ్యాడు. 53 బంతుల్లో 58 పరుగులు చేశాడు.
