IPL2022 Hyderabad Vs PBKS : ఓటమితో టోర్నీని ముగించిన హైదరాబాద్.. లాస్ట్ మ్యాచ్ పంజాబ్‌దే

హైదరాబాద్‌ చేజేతులా ఓటమిపాలైంది. పరాజయంతో టోర్నీని ముగించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ మోస్తరు స్కోరుకే పరిమితమైంది.

Ipl2022 Hyderabad Vs Pbks

IPL2022 Hyderabad Vs PBKS : టీ20 మెగా టోర్నీ ఆఖరి లీగ్ మ్యాచ్ ముగిసింది. చివరి లీగ్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడ్డాయి. ఫీల్డింగ్‌ వైఫల్యం, క్యాచ్‌ల డ్రాప్‌లతో హైదరాబాద్‌ చేజేతులా ఓటమిపాలైంది. హైదరాబాద్‌పై 5 వికెట్ల తేడాతో పంజాబ్ విజయం సాధించింది. ఈ గెలుపుతో పాయింట్ల టేబుల్ లో ఆరో స్థానంతో పంజాబ్ టోర్నీని ముగించింది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులే చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో పంజాబ్‌ కేవలం 15.1 ఓవర్లలో 160 పరుగులు చేసి గెలుపొందింది. లియామ్‌ లివింగ్‌స్టోన్ (49*), శిఖర్ ధావన్‌ (39), జానీ బెయిర్‌స్టో (23), షారుఖ్‌ ఖాన్‌ (19), జితేశ్‌ శర్మ (19) రాణించారు. లియామ్‌ లివింగ్ స్టోన్ ఇచ్చిన నాలుగు క్యాచ్‌లను హైదరాబాద్‌ ఫీల్డర్లు నేలపాలు చేశారు. హైదరాబాద్‌ బౌలర్లలో ఫరూఖి రెండు వికెట్లు పడగొట్టాడు. సుందర్, సుచిత్, ఉమ్రాన్‌ మాలిక్ తలో వికెట్ తీశారు.

Umran Malik Call Up : సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌.. సంచలన పేసర్‌కు టీమిండియాలో చోటు

పంజాబ్ తో పోరులో టాస్‌ నెగ్గిన హైదరాబాద్ బ్యాటింగ్‌ ఎంచుకుంది. కేన్‌ విలియమ్సన్‌ గైర్హాజరీతో హైదరాబాద్‌ జట్టుకు భువనేశ్వర్ కుమార్‌ కెప్టెన్ గా వ్యవహరించాడు. ఈ మ్యాచ్ లో పంజాబ్ బౌలర్లు రాణించారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో హైదరాబాద్ జట్టు మోస్తరు స్కోరుకే పరిమితమైంది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 157 పరుగులే చేసింది. పంజాబ్‌కు 158 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. హైదరాబాద్ బ్యాటర్లలో ఓపెనర్ అభిషేక్ శర్మ 43, రొమారియా షెపర్డ్ 26 (నాటౌట్), వాషింగ్టన్ సుందర్ 25, మార్ క్రమ్ 21, రాహుల్ త్రిపాఠి 20 పరుగులు సాధించారు.

Virender Sehwag: అతను తిరిగొస్తే టెస్ట్ క్రికెట్‌కు ఎగ్జైట్మెంట్ వస్తుంది – వీరేంద్ర సెహ్వాగ్

ఓపెనర్ ప్రియమ్ గార్గ్ (4), నికోలాస్ పూరన్ (5) విఫలమయ్యారు. సుందర్‌-షెఫెర్ట్‌ ఏడో వికెట్‌కు 57 పరుగులు జోడించారు. పంజాబ్ బౌలర్ల దెబ్బకు మిడిల్ లో‌, చివర్లో స్వల్ప వ్యవధిలో వికెట్లను చేజార్చుకోవడంతో హైదరాబాద్‌ అనుకున్నంత స్కోరును సాధించలేకపోయింది. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో హర్ ప్రీత్ బ్రార్, నాథన్ ఎల్లిస్ చెరో మూడు వికెట్లు తీసి సన్ రైజర్స్ ను కట్టడి చేశారు. కగిసో రబాడాకు ఒక వికెట్ దక్కింది.