IPL2022 KKR Vs GT : ఉత్కంఠపోరులో కోల్‌కతాపై గుజరాత్‌దే విజయం.. టాప్‌లోకి హార్ధిక్ గ్యాంగ్
ఉత్కంతభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో గుజరాత్ గెలిచింది. గుజరాత్ నిర్దేశించిన 157 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన కోల్ కతా..
- Naveen
- Published On : April 23, 2022 / 07:50 PM IST
Ipl2022 Kkr Vs Gt
IPL2022 KKR Vs GT : ఐపీఎల్ 2022 సీజన్ 15లో భాగంగా శనివారం గుజరాత్ టైటాన్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్లు తలపడ్డాయి. ఉత్కంతభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో గుజరాతే గెలిచింది. కోల్ కతా నైట్ రైడర్స్ పోరాడి ఓడింది. గుజరాత్ నిర్దేశించిన 157 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన కోల్ కతా.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 148 పరుగులకే పరిమితమైంది. దీంతో 8 పరుగుల తేడాతో గుజరాత్ విక్టరీ కొట్టింది.
కోల్ కతా బ్యాటర్లలో ఆల్ రౌండర్ ఆండ్రూ రస్సెల్ బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లోనూ రాణించాడు. మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 25 బంతుల్లోనే 48 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 6 సిక్సులు, ఒక ఫోర్ ఉన్నాయి. రస్సెల్ ఔట్ కావడంతో కోల్ కతాకు ఓటమి తప్పలేదు. కోల్ కతా ఇతర బ్యాటర్లలో రింకూ సింగ్ (28 బంతుల్లో 35 పరుగులు) రాణించాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(12), వెంకటేశ్ అయ్యర్(17) విఫలం అయ్యారు. చివర్లో ఉమేష్ యాదవ్ 15 పరుగులు చేశాడు. గుజరాత్ బౌలర్లలో మహమ్మద్ షమీ, యశ్ దయాల్, రషీద్ ఖాన్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. జోసెఫ్, ఫెర్గూసన్ తలో వికెట్ తీశారు.
IPL2022 RR Vs DC : ఉత్కంఠపోరులో రాజస్తాన్‌దే విజయం.. పోరాడి ఓడిన ఢిల్లీ
ఆఖరి ఓవర్ వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో కోల్‌కతాపై గుజరాత్ 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి ఓవర్‌లో 18 పరుగులు సాధించాల్సి ఉండగా.. అల్జారీ జోసెఫ్ బౌలింగ్‌లో తొలి బంతికే ఆండ్రూ రస్సెల్ (48) సిక్స్ కొట్టి ఆశలు రేపాడు. అయితే రెండో బంతికే ఫెర్గూసన్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో పెవిలియన్‌కు చేరాడు. మిగతా నాలుగు బంతుల్లో కేవలం మూడు పరుగులే రావడంతో గుజరాత్ గెలుపొందింది.
ఈ విజయంతో మరోసారి గుజరాత్ (12) పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 156/9 స్కోరు సాధించగా.. కోల్‌కతా 148/8 స్కోరుకే పరిమితమై ఓటమిపాలైంది. ప్రస్తుత సీజన్‌లో గుజరాత్ చివరి ఓవర్ వరకు వెళ్లి నాలుగో విజయం సాధించడం విశేషం. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన గుజరాత్ బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా, ఈ సీజన్ లో దాదాపు 35 మ్యాచ్‌ల తర్వాత టాస్ నెగ్గిన జట్టు బ్యాటింగ్ ఎంచుకోవడం విశేషం.
IPL2022 CSK VS MI : ధోనీ.. వాటే ఫినిష్.. ఉత్కంఠపోరులో చెన్నై విజయం.. ముంబైకి వరుసగా 7వ పరాజయం
జట్ల వివరాలు..
గుజరాత్ టైటాన్స్ జట్టు : వృద్ధిమాన్ సాహా, శుభ్‌మన్‌గిల్, హార్దిక్ పాండ్య (కెప్టెన్), అభినవ్ మనోహర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్, అల్‌జారీ జోసెఫ్, లాకీ ఫెర్గూసన్, యశ్ దయాల్, మహ్మద్ షమీ.
కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు : వెంకటేశ్ అయ్యర్, సునీల్ నరైన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), నితీశ్ రాణా, సామ్ బిల్లింగ్స్, రింకూ సింగ్, ఆండ్రీ రసెల్, టిమ్ సౌథీ, శివమ్ మావి, ఉమేశ్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.
WHAT A WIN! ?@gujarat_titans win by 8 runs and are back to the ? of the table ?#TATAIPL #KKRvGT pic.twitter.com/PylbPa6HD1
— IndianPremierLeague (@IPL) April 23, 2022
