IPL2022 RR Vs DC : ఉత్కంఠపోరులో రాజస్తాన్‌దే విజయం.. పోరాడి ఓడిన ఢిల్లీ

ఢిల్లీ పై రాజస్తాన్ 15 పరుగుల తేడాతో గెలుపొందింది. 223 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ఢిల్లీ.. 20 ఓవర్లలో..

IPL2022 RR Vs DC : ఉత్కంఠపోరులో రాజస్తాన్‌దే విజయం.. పోరాడి ఓడిన ఢిల్లీ

Ipl2022 Rr Vs Dc

IPL2022 RR Vs DC : ఐపీఎల్ 2022 సీజన్ 15లో భాగంగా రాజస్తాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడ్డాయి. భారీ స్కోర్ నమోదైన ఈ పోరులో ఢిల్లీ పై రాజస్తాన్ 15 పరుగుల తేడాతో గెలుపొందింది. 223 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ఢిల్లీ పోరాడి ఓడింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 207 పరుగులే చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో కెప్టెన్ రిషబ్ పంత్ రాణించాడు. 24 బంతుల్లో 44 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. చివర్లో పావెల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. సిక్సుల వర్షం కురిపించాడు. 15 బంతుల్లోనే 36 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 5 సిక్సులు ఉన్నాయి. కాగా, ఢిల్లీని గెలిపించినంత పని చేశాడు పావెల్.

లలిత్ యాదవ్ 24 బంతుల్లో 37 పరుగులతో మెరిశాడు. రాజస్తాన్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ మూడు వికెట్లు పడగొట్టాడు. రవిచంద్రన్ అశ్విన్ రెండు వికెట్లు తీశాడు. యజువేంద్ర చాహల్, మెక్ కాయ్ తలో వికెట్ తీశారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ జట్టు భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. ఓపెనర్ జోస్ బట్లర్ విధ్వంసకర సెంచరీతో (65 బంతుల్లో 116 పరుగులు) రాజస్తాన్ భారీ స్కోర్ చేసింది.(IPL2022 RR Vs DC)

IPL2022 CSK VS MI : ధోనీ.. వాటే ఫినిష్.. ఉత్కంఠపోరులో చెన్నై విజయం.. ముంబైకి వరుసగా 7వ పరాజయం

ఆఖరి రెండు ఓవర్లలో 36 పరుగులు కావాల్సిన తరుణంలో 19వ ఓవర్‌ను ప్రసిధ్ కృష్ణ మెయిడిన్‌ వేసి ఒక వికెట్ తీశాడు. మెక్ కాయ్ వేసిన చివరి ఓవర్‌లో మూడు బంతులకు సిక్స్‌లు కొట్టిన రోవ్‌మన్‌ పావెల్ (36) ఢిల్లీని గెలిపించినంత పని చేశాడు. అయితే మెక్‌కాయ్‌ మిగతా మూడు బంతుల్లో కేవలం రెండు పరుగులే ఇచ్చి పావెల్‌ను ఔట్ చేయడంతో విజయం రాజస్తాన్‌ సొంతమైంది. ఢిల్లీ బ్యాటర్లలో రిషబ్ పంత్ 44, లలిత్ యాదవ్ 37, పృథ్వీ షా 37, డేవిడ్ వార్నర్ 28, శార్దూల్ 10 పరుగులు చేశారు.

రాజస్తాన్ బ్యాటర్లలో ఫుల్ ఫామ్ మీదున్న ఓపెనర్ జోస్ బట్లర్ మరోసారి సెంచరీతో చెలరేగిపోయాడు. పరుగుల వరద పారించాడు. బౌండరీల వర్షం కురిపించాడు. 65 బంతుల్లోనే 116 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో ఏకంగా 9 సిక్సులు, 9 ఫోర్లు ఉన్నాయి. ఫలితంగా రాజస్తాన్ జట్టు భారీ స్కోర్ నమోదు చేసింది. ఈ సీజన్ లో బట్లర్ కి ఇది మూడో సెంచరీ కావడం విశేషం.

మరో ఓపెనర్ దేవదూత్ పడిక్కల్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. 35 బంతుల్లో 54 పరుగులు చేశాడు. సంజూ శాంసన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 19 బంతుల్లోనే 46 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. అతడి స్కోర్ లో మూడు సిక్సులు, 5 ఫోర్లు ఉన్నాయి. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, ముస్తాఫిజర్‌ రెహ్మాన్ తలో వికెట్ తీశారు.

IPL 2022 David Warner : ఒకే ప్రత్యర్థి జట్టుపై వెయ్యి పరుగులు.. డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డ్

ఈ సీజన్ లో బట్లర్ భీకరమైన ఫామ్ లో ఉన్నాడు. ఇప్పటికే రెండు సెంచరీలు బాదాడు. ఢిల్లీతో మ్యాచ్ లోనూ చెలరేగాడు. మైదానంలో అడుగుపెట్టింది మొదలు బౌండరీల మోత మోగిస్తూ.. ఈ సీజన్‌లో వరుసగా మూడో సెంచరీ నమోదు చేశాడు. బట్లర్‌తో పాటు మరో ఓపెనర్‌ దేవ్‌దత్‌ పడిక్కల్‌ (54) హాఫ్‌ సెంచరీతో చెలరేగాడు. ఆఖర్లో కెప్టెన్‌ సంజూ (46*) కూడా దంచికొట్టడంతో.. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌ 2 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది.

బట్లర్ బ్యాటింగ్ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఢిల్లీ బౌలర్లను ఊచకోత కోశాడు. పాపం ఢిల్లీ బౌలర్లు బంతులు ఎక్కడవేయాలో తెలియక తల పట్టుకున్నారు. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్‌ అహ్మద్‌ (1/47), లలిత్ యాదవ్ (0/41), ముస్తాఫిజర్ (1/43), కుల్‌దీప్ యాదవ్ (0/40), అక్షర్‌ పటేల్ (2-0-21) భారీగా పరుగులు సమర్పించుకున్నారు. శార్దూల్ ఠాకూర్‌ (3-0-29) ఒక్కడే కాస్త ఫర్వాలేదనిపించాడు. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో రాజస్తాన్‌ నెంబర్ 1 స్థానానికి వెళ్లింది. కాగా, ఈ సీజన్ లో ఇదే అత్యధిక స్కోరు.