Rishabh Pant : ఘోరంగా విఫ‌ల‌మైన రిష‌బ్ పంత్..

టీమ్ఇండియా స్టార్ ఆట‌గాడు రిష‌బ్ పంత్ (Rishabh Pant) నిరాశ ప‌రిచాడు

Irani Cup 2026 Rishabh Pant fails in Jammu and Kashmir vs Rest of India match

Rishabh Pant : టీమ్ఇండియా స్టార్ ఆట‌గాడు రిష‌బ్ పంత్ నిరాశ ప‌రిచాడు. ఇరానీ క‌ప్ 2026లో భాగంగా రెస్టాఫ్ ఇండియా జ‌ట్టు కెప్టెన్‌గా బ‌రిలోకి దిగిన ఈ ఎడ‌మ చేతి వాటం బ్యాట‌ర్ ఘోరంగా విఫ‌లం అయ్యాడు. జ‌మ్ము క‌శ్మీర్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో ప‌ది ప‌రుగులే చేసి పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు.

ఇరానీ క‌ప్ 2026లో భాగంగా గురువారం జ‌మ్ము క‌శ్మీర్‌, రెస్టాఫ్ ఇండియా జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ మొద‌లైంది. టాస్ ఓడిన రెస్టాఫ్ ఇండియా బ్యాటింగ్‌కు దిగింది. జ‌మ్ము బౌల‌ర్ల ధాటికి ఓపెన‌ర్‌ స‌న‌త్ సాంగ్వాన్ (1), వ‌న్‌డౌన్ బ్యాట‌ర్ సుదీప్ కుమార్ ఘ‌రామీ (8) త‌క్కువ స్కోరుకే పెవిలియ‌న్‌కు చేరుకున్నారు. మ‌రో ఓపెన‌ర్ శిఖ‌ర్ మోహ‌న్ (60), సర్ఫ‌రాజ్ ఖాన్ (45) జ‌ట్టును ఆదుకున్నారు. వీరిద్ద‌రు మూడో వికెట్‌కు 76 ప‌రుగులు జోడించారు.

IND vs WI : గెలుపు జోష్‌లో ఉన్న భార‌త్‌కు భారీ షాక్..

శిఖ‌ర్ మోహ‌న్ తో పాటు స‌ర్ఫ‌రాజ్ ఖాన్ స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో పెవిలియ‌న్ చేరుకున్నారు. దీంతో రెస్టాఫ్ జ‌ట్టు 133 ప‌రుగుల‌కే 4 వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. ఈ ద‌శ‌లో జ‌ట్టును ఆదుకోవాల్సిన కెప్టెన్ రిష‌బ్ పంత్ (36 బంతుల్లో 10 ప‌రుగులు) ఓ పేల‌వ షాట్‌తో పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. అయితే.. స్మ‌ర‌న్ ర‌విచంద్ర‌న్ (68), ఆకాశ్ దీప్ (22) లు రాణించ‌డంతో రెస్టాఫ్ ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 237 ప‌రుగుల‌కు ఆలౌటైంది.

అనంత‌రం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన జ‌మ్ము క‌శ్మీర్ జ‌ట్టు తొలి రోజు ఆట ముగిసే స‌మ‌యానికి రెండు వికెట్ల న‌ష్టానికి 21 ప‌రుగులు చేసింది.