IND vs WI : గెలుపు జోష్‌లో ఉన్న భారత్‌కు భారీ షాక్..
వెస్టిండీస్ పై రెండో వన్డేలో విజయం సాధించి గెలుపు జోష్‌లో (IND vs WI) ఉన్న భారత్‌కు భారీ షాక్ తగిలింది.
IND vs WI Prasidh Krishna to miss third ODI Naman Dhir replaces Washington Sundar for T20Is
IND vs WI : వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో భారత జట్టు రికార్డు లక్ష్యాన్ని ఛేదించింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను సొంతం చేసుకుంది. అయితే.. గెలుపు జోష్‌లో ఉన్న భారత్‌కు భారీ షాక్ తగిలింది. టీమ్ఇండియా స్టార్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ మూడో వన్డేకు దూరం అయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ వెల్లడించింది. అతడి స్థానంలో మూడో వన్డేకు అన్షుల్ కాంబోజ్‌ను ఎంపిక చేసింది. రెండో వన్డేలో ప్రసిద్ధ్ ఎడమ కాలి తొడ కండరానికి గాయమైంది.
వెస్టిండీస్‌తో మూడో వన్డేకు భారత జట్టు ఇదే..
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, గుర్నూర్ బ్రార్, మహ్మద్ సిరాజ్, నబీ, నమన్ దీర్, అన్షుల్ కాంబోజ్
టీ20 సిరీస్ నుంచి వాషింగ్టన్ సుందర్ ఔట్..
ఇదిలా ఉండగా ఉంటే.. వెస్టిండీస్‌తో జరిగే టీ20 సిరీస్ నుంచి ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను తప్పించింది. న్యూజిలాండ్‌తో జరగబోయే టెస్ట్ సిరీస్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 11న రంజీ ట్రోఫీ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో సుందర్.. తన రాష్ట్ర జట్టు తరఫున రెడ్-బాల్ క్రికెట్ ఆడి కివీస్‌తో టెస్ట్ సిరీస్‌కు సిన్నద్ధం కానున్నాడు.
Gautam Gambhir : వెస్టిండీస్ పై భారత్ రికార్డు ఛేదన.. గౌతమ్ గంభీర్ తీవ్ర అసంతృప్తి..
🚨 News 🚨
Prasidh Krishna to miss third ODI, Naman Dhir replaces Washington Sundar for T20Is
More details 🔽 | #TeamIndia | #INDvWI | @mflone_ https://t.co/e4kbfahjto
— BCCI (@BCCI) October 1, 2026
వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు అప్డేట్ చేసిన భారత జట్టు ఇదే..
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, అక్షర్ యాదవ్ పటేల్, రవి బిష్ణోయ్, నితీష్ కుమార్ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్, నమన్ దీర్.
