Sanju Samson : సంజూ శాంస‌న్‌కు తెలిసినంతంగా ఆర్ఆర్ గురించి మ‌రెవ‌రికి తెలియ‌దు.. ఇర్ఫాన్ పఠాన్ హాట్ కామెంట్స్‌..

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ గురించి సంజూ శాంస‌న్‌కు (Sanju Samson) తెలిసినంతంగా మ‌రెవ‌రికి తెలియ‌ద‌న్నాడు భార‌త జ‌ట్టు మాజీ ఆట‌గాడు ఇర్ఫాన్ ప‌ఠాన్.

Irfan Pathan believes Sanju Samson presence could benefit CSK in their opening game in IPL 2026

  • మార్చి 28న ఐపీఎల్ ప్రారంభం
  • సీఎస్‌కే, ఆర్ఆర్‌ల మ‌ధ్య మార్చి 30న‌ మ్యాచ్‌
  • సంజూ శాంస‌న్ పై ప‌ఠాన్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

Sanju Samson : మార్చి 28 నుంచి ఐపీఎల్ 2026 ప్రారంభం కానుంది. ఈ మెగాటోర్నీకి సంబంధించి తొలి ద‌శ షెడ్యూల్‌ను బీసీసీఐ బుధవారం విడుద‌ల చేసింది. రుతురాజ్ గైక్వాడ్ సార‌థ్యంలోని చెన్నై సూప‌ర్ కింగ్స్ మార్చి 30న త‌మ తొలి మ్యాచ్‌ను రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో ఆడ‌నుంది. గౌహ‌తి ఈ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వ‌నుంది.

ఐపీఎల్ 2026 మెగావేలానికి ముందు ట్రేడింగ్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ నుంచి సంజూ శాంస‌న్‌ను (Sanju Samson)  చెన్నై సూప‌ర్ కింగ్స్ తీసుకుంది. బ‌దులుగా ఆల్‌రౌండ‌ర్లు ర‌వీంద్ర జ‌డేజా, సామ్ క‌ర్రాన్‌ల‌ను ఆర్ఆర్‌కు సీఎస్‌కే ఇచ్చేసింది. ఈ క్ర‌మంలో ఐపీఎల్ 2026లో ఈ రెండు జ‌ట్లు త‌మ ఆరంభ పోరులో త‌ల‌ప‌డ‌నుండ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. దీనిపై భార‌త జ‌ట్టు మాజీ ఆట‌గాడు ఇర్ఫాన్ ప‌ఠాన్ స్పందించాడు.

RCB : ఐపీఎల్ 2026కు ముందు ఆర్‌సీబీకి బిగ్ షాక్ ? స్టార్ పేస‌ర్ ఆడ‌డం అనుమాన‌మే?

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ గురించి సంజూ శాంస‌న్‌కు తెలిసినంతంగా మ‌రెవ‌రికి తెలియ‌ద‌న్నాడు. మినీ వేలంలో ప‌లువురు యువ ఆట‌గాళ్ల పై సీఎస్‌కే కోట్ల వ‌ర్షం కురిపించింది. దీంతో ఈ సీజ‌న్‌లో వారు ఎలా రాణిస్తారో చూసేందుకు ఆస‌క్తిగా ఉన్న‌ట్లు ప‌ఠాన్ చెప్పుకొచ్చాడు.

తొలి పోరు గురించి మాట్లాడుతూ.. చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టులో సంజూ శాంస‌న్ ఉండ‌డం ఆ జ‌ట్టుకు బాగా క‌లిసి వ‌స్తుంద‌న్నాడు. ఎందుకంటే రాజ‌స్థాన్ రాయ‌ల్స్ గురించి సంజూ శాంస‌న్‌కు తెలిసినంతంగా మ‌రే సీఎస్‌కే ఆట‌గాడికి తెలియ‌ద‌న్నాడు. జ‌ట్టు నిర్మాణం, ప‌వ‌ర్ ప్లేలో ఎలా ఆడ‌తారు ? మిడిల్ ఓవ‌ర్ల‌ను ఎలా ప్లాన్ చేస్తారు వంటి విష‌యాల‌పై సంజూకు పూర్తి అవ‌గాహ‌న ఉంద‌న్నాడు.

BAN vs PAK : బంగ్లాదేశ్ చేతిలో ఓట‌మి.. పాక్ హెడ్ కోచ్ మైక్ హెస్సన్ కీల‌క వ్యాఖ్య‌లు..

‘రాజస్థాన్ రాయల్స్‌లోని చాలా మంది యువ ఆట‌గాళ్లు సంజూ సారథ్యంలో ఆడారు. కాబ‌ట్టి ఆయా ఆయా ఆట‌గాళ్ల బ‌లాలు, బ‌ల‌హీన‌త‌ల‌పై అత‌డికి పూర్తి అవ‌గాహ‌న ఉంటుంది. సంజూ ప్ర‌స్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. అత‌డి ఫామ్ మాత్ర‌మే కాదు గౌహ‌తిలో ఆడిన అనుభ‌వం కూడా అత‌డికి తొలి మ్యాచ్‌లో ఉప‌యోగ‌ప‌డుతోంది. అది చెన్నైకి అడ్వాంటేజ్ కానుంది. ఇక వేలంలో యువ ఆట‌గాళ్లను కొనుగోలు చేసిన చెన్నై ఈ సీజ‌న్‌లో ఎలా ఆడుతుంద‌ని అని చూసేందుకు నేను ఎంతో ఉత్సాహంగా ఉన్నాను. ‘అని ఇర్ఫాన్ ప‌ఠాన్ అన్నాడు.