Irfan Pathan On Gambhir vs Sreesanth Spat
Irfan Pathan On Gambhir vs Sreesanth Spat : లెజెండ్స్ లీగ్ క్రికెట్ (ఎల్ఎల్సి)లో భారత మాజీ క్రికెటర్లు గౌతమ్ గంభీర్, శ్రీశాంత్‌లు ఆడుతున్నారు. ఇండియా క్యాపిటల్స్‌కు గౌతమ్ గంభీర్, గుజరాత్ జెయింట్స్ కు శ్రీశాంత్ లు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఎల్ఎల్సి టోర్నీలో భాగంగా బుధవారం ఇండియా క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో గంభీర్, శ్రీశాంత్‌ల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై మరో భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ ఫఠాన్ స్పందించాడు.
అసలేం జరిగిందంటే..?
ఈ మ్యాచ్‌లో శ్రీశాంత్ వేసిన ఓ ఓవర్లో గంభీర్ వరుసగా సిక్స్, ఫోర్ కొట్టాడు. ఈ క్రమంలో గంభీర్ వైపు శ్రీశాంత్ సీరియస్‌గా చూశాడు. గంభీర్ సైతం కోపంగా అతడి వైపు చూశారు. ఆ తరువాత కాసేపటికే వీరిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితి చేయి దాటేలా కనిపించడంతో అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న పలువురు ఆటగాళ్లతో పాటు అంపైర్లు వచ్చి వారిద్దరికి సర్దిజెప్పారు. అనంతరం మ్యాచ్ సజావుగా సాగేలా చూశారు.
Sreesanth : చిక్కుల్లో టీమ్ఇండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్.. లీగల్ నోటీసులు పంపిన ఎల్ఎల్సీ
ఘటనపై మ్యాచ్ అనంతరం శ్రీశాంత్ స్పందిస్తూ గంభీర్ తనను ఫిక్సర్ అని పిలిచాడని ఆరోపించాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. మిస్టర్ ఫైటర్ గంభీర్‌తో జరిగిన విషయంలో తన తప్పేమీ లేదని ఆ వీడియోలో శ్రీశాంత్ చెప్పుకొచ్చాడు. తాను ఏమీ అనకపోయినా తనను గంభీర్ పిక్సర్ అన్నాడని ఆరోపించారు. అలా అతడు మాట్లాడడం చాలా తప్పుని చెప్పాడు. ఇప్పటికే తాను ఎన్నో కష్టాలు పడ్డానని, అభిమానుల మద్దతుతో పోరాడుతున్నట్లు శ్రీశాంత్ తెలిపాడు.
తన సహచర ఆటగాళ్లతో పాటు సీనియర్ క్రికెటర్లకు గౌతమ్ గంభీర్ మర్యాద ఇవ్వడంటూ శ్రీశాంత్ అన్నాడు. ఎప్పుడైన అతడు కామెంట్రీ చేస్తున్న సమయంలో ఎవరైనా సరే విరాట్ కోహ్లీ గురించి అడిగితే దాని గురించి గంభీర్ మాట్లాడడని, ఇతర విషయాలు మాట్లాడుకొస్తాడంటూ శ్రీశాంత్ తెలిపాడు.
ఫోటో పోస్ట్ చేసిన గంభీర్..
కాగా.. గౌతమ్ గంభీర్ వివాదాం పై స్పందించలేదు. తన సోషల్ మీడియాలో మాత్రం టీమ్ఇండియా జెర్సీ ధరించి నవ్వుతున్న అతడి పాత ఫోటోను మాత్రం పోస్ట్ చేశాడు. ప్రపంచం మొత్తం నీ వైపు చూస్తున్నప్పుడు నువ్వు నవ్వుతూ ఉండాలని ఆ ఫోటో కింద రాసుకొచ్చాడు. ఈ ఫోటోపై ఇర్ఫాన్ పఠాన్ స్పందించాడు. అన్నింటికి నవ్వుతూ ఉండడమే మంచి సమాధానం అంటూ కామెంట్ చేశాడు. అంటే ఇర్ఫాన్ పరోక్షంగా గంభీర్ కు మద్దతు పలికాడు.
Smile is the best Answer brother.
— Irfan Pathan (@IrfanPathan) December 7, 2023