ICC : ప్ర‌పంచ‌క‌ప్‌లో వినియోగించిన‌ పిచ్‌లకు రేటింగ్‌.. వివాదాస్ప‌ద‌మైన భార‌త్‌-కివీస్ సెమీఫైన‌ల్ పిచ్‌కు ఏ రేటింగ్ ఇచ్చారో తెలుసా..?

ICC Pitch Ratings : తాజాగా అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఫైన‌ల్‌, సెమీ ఫైన‌ల్ మ్యాచుల‌కు ఉప‌యోగించిన పిచ్‌ల‌కు సంబంధించి రేటింగ్‌ల‌ను ప్ర‌క‌టించింది.

ICC : ప్ర‌పంచ‌క‌ప్‌లో వినియోగించిన‌ పిచ్‌లకు రేటింగ్‌.. వివాదాస్ప‌ద‌మైన భార‌త్‌-కివీస్ సెమీఫైన‌ల్ పిచ్‌కు ఏ రేటింగ్ ఇచ్చారో తెలుసా..?

ICC Pitch Ratings

క్రికెట్ ప్రేమికుల‌ను ఎంతో ఉర్రూత‌లు ఊగించిన వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023 ముగిసింది. వ‌రుస‌గా ప‌ది మ్యాచుల్లో గెలిచిన భార‌త జ‌ట్టు ఫైన‌ల్ మ్యాచులో ఓడిపోయింది. ఆరు వికెట్ల తేడాతో గెలిచిన ఆస్ట్రేలియా ఆరోసారి వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ను ముద్దాడిన సంగతి తెలిసిందే. తాజాగా అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఫైన‌ల్‌, సెమీ ఫైన‌ల్ మ్యాచుల‌కు ఉప‌యోగించిన పిచ్‌ల‌కు సంబంధించి రేటింగ్‌ల‌ను ప్ర‌క‌టించింది.

భార‌త్‌, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య న‌వంబ‌ర్ 19న గుజ‌రాత్ రాష్ట్రం అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్ జ‌రిగింది. ఈ స్టేడియంలోని పిచ్‌కు ఐసీసీ యావ‌రేజ్ రేటింగ్‌ను ఇచ్చింది. పిచ్ మంద‌కొడిగా ఉంద‌ని చెప్పింది. అయితే.. ఔట్‌ఫీల్డ్ మాత్రం చాలా బాగుంది అని ఐసీసీ మ్యాచ్ రిఫ‌రీ ఆండీ పైక్రాఫ్ట్ చెప్పారు. ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన భార‌త్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 240 ప‌రుగుల‌కు ఆలౌటైంది.

Gujarat Titans : ఐపీఎల్ వేలానికి ముందు గుజ‌రాత్ టైటాన్స్‌కు మ‌రో షాక్‌..? అదే జ‌రిగితే..?

అనంత‌రం ల‌క్ష్యాన్ని ఆస్ట్రేలియా నాలుగు వికెట్లు కోల్పోయి 43 ఓవ‌ర్ల‌లో ఛేదించింది. ఆసీస్ ఓపెన‌ర్ ట్రావిస్ హెడ్ 120 బంతుల్లో 137 ప‌రుగుల‌తో ఆసీస్ గెలుపులో కీల‌క పాత్ర పోషించారు.

వివాదాస్ప‌ద‌మైన పిచ్‌కు ఏ రేటింగ్ అంటే.?

భార‌త్‌, న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ధ్య సెమీఫైన‌ల్ మ్యాచ్‌ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జ‌రిగింది. అయితే.. ఈ మ్యాచ్‌కు కొన్ని గంట‌ల ముందు పిచ్ ను మార్చారు అంటూ ప‌లు అంత‌ర్జాతీయ ప‌త్రిక‌ల్లో వార్త‌లు వ‌చ్చాయి. కొత్త పిచ్‌కు బ‌దులు వాడిన పిచ్‌ను ఉప‌యోగించారంటూ బీసీసీఐ ఆరోప‌ణ‌లు రాగా.. దీనిపై ఐసీసీ వివ‌ర‌ణ ఇచ్చింది. ఇక ఈ పిచ్‌కు ఐసీసీ గుడ్‌(బాగుంది)అని రేటింగ్ ఇచ్చింది.

అలాగే ద‌క్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జ‌ట్లు కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో రెండో సెమీఫైన‌ల్ మ్యాచులో త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచులో స్వ‌ల్ప స్కోర్లు న‌మోదు అయ్యాయి. మొద‌ట బ్యాటింగ్ చేసిన ద‌క్షిణాఫ్రికా 212 ప‌రుగుల‌కు ఆలౌటైంది. స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని ఆస్ట్రేలియా 47.2 ఓవ‌ర్ల‌లో ఛేదించింది. ఈ పిచ్‌కు ఐసీసీ యావ‌రేజ్ రేటింగ్ ఇచ్చింది. అయితే ఔట్‌ఫీల్డ్‌కు మాత్రం వెరీ గుడ్ రేటింగ్ ఇచ్చారు.

Hamza Saleem Dar : టీ10లో ప్ర‌పంచ రికార్డు.. 43 బంతుల్లో 193 నాటౌట్‌.. ఒకే ఓవ‌ర్‌లో ఆరు సిక్స‌ర్లు, 24 బంతుల్లో సెంచ‌రీ ఇంకా..

టీమ్ఇండియా ఆడిన లీగ్ మ్యాచుల‌కు..
ఈ మెగాటోర్నీలో టీమ్ఇండియా లీగు ద‌శ‌లో తొమ్మిది మ్యాచులు ఆడింది. కోల్‌కతా, లక్నో, అహ్మదాబాద్, చెన్నైలలో వరుసగా దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, పాకిస్తాన్, ఆస్ట్రేలియాతో ఆడిన మ్యాచుల‌కు సంబంధించిన పిచ్‌ల‌కు ఐసీసీ యావ‌రేజ్ రేటింగ్ ఇచ్చింది.