IND vs PAK : పాకిస్థాన్‌తో భార‌త్ గోల్డ్ మెడ‌ల్ మ్యాచ్‌.. క్రికెట‌ర్ల హ్యాండ్ షేక్ ఉంటుందా? ఉండ‌దా? ఆసియా క్రీడ‌ల రూల్స్ ఇవే..

ఆసియా క్రీడ‌లు 2026లో భాగంగా శ‌నివారం జ‌ర‌గ‌నున్న గోల్డ్ మెడ‌ల్ మ్యాచ్‌లో భార‌త్, పాకిస్థాన్ జ‌ట్లు (IND vs PAK) త‌ల‌ప‌డ‌నున్నాయి

Is Team India players to be handshake with pakistan in Asian Games 2026 gold medal match

IND vs PAK : ఆసియా క్రీడ‌లు 2026 పురుషుల క్రికెట్‌లో శ‌నివారం (అక్టోబ‌ర్ 3న) గోల్డ్ మెడ‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. చిర‌కాల ప్ర‌త్య‌ర్థులు భార‌త్, పాకిస్థాన్‌లు ఫైన‌ల్ మ్యాచ్‌లో త‌ల‌ప‌డ‌నున్నాయి. స్వ‌ర్ణ ప‌త‌కం సాధించాల‌ని ఇరు జ‌ట్ల అభిమానులు కోరుకుంటుండ‌గా.. అంద‌రి దృష్టి ఓ అంశం పై ప‌డింది. అదే హ్యాండ్ షేక్‌.

ప‌హ‌ల్గాం ఉగ్ర‌దాడి త‌రువాత పాకిస్థాన్‌తో ప‌లు సంద‌ర్భాల్లో భార‌త జ‌ట్టు క్రికెట్ మ్యాచ్‌లు ఆడింది. అయితే.. ఏ మ్యాచ్‌లో భార‌త ఆట‌గాళ్లు క‌ర‌చాల‌నం చేయ‌లేదు. ఇటీవ‌ల జ‌రిగిన ఆసియా క్రీడ‌ల్లోనూ ఇదే పున‌రావృతమైంది. ఇటు మ‌హిళ‌లు, అటు పురుషుల క్రికెట్‌లోనూ ప్లేయ‌ర్లు క‌ర‌చాల‌నం చేసుకోలేదు.

ఆసియా క్రీడ‌ల్లో నిబంధ‌న‌లు ఏం చెబుతున్నాయి?

ఆసియా క్రీడ‌ల్లో పురుషుల క్రికెట్ ఫైన‌ల్ మ్యాచ్‌లో భార‌త, పాకిస్థాన్ జ‌ట్లు త‌ల‌ప‌డనున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆసియా క్రీడ‌ల్లో నిబంధ‌న‌లు ఏ విధంగా ఉన్నాయో ఓ సారి చూద్దాం.

ఆసియా క్రీడ‌ల్లో ప్ర‌త్య‌ర్థి ఆట‌గాళ్ల‌తో త‌ప్ప‌నిస‌రిగా క‌ర‌చాల‌నం చేయాల‌నే నిబంధ‌న అయితే ఏమీ లేన‌ట్లుగా తెలుస్తోంది. అయితే.. ఇక్క‌డ క్రీడా స్ఫూర్తి అనేది కీల‌కం కానుంది. కాగా.. ఉక్రెయిన్‌-ర‌ష్యా, బెలార‌స్ అథ్లెట్లు ఒక‌రికొక‌రు క‌ర‌చాల‌నం చేసుకోలేదు. ఆయా ఆయా దేశాల మ‌ధ్య యుద్ధం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే.

Sanju Samson : పాకిస్థాన్‌తో గోల్డ్ మెడ‌ల్ మ్యాచ్‌.. సంజూ శాంస‌న్‌ను ఊరిస్తున్న భారీ రికార్డు..

ఈ నేప‌థ్యంలో ఫైన‌ల్ మ్యాచ్‌లో పాక్ ప్లేయ‌ర్ల‌లో భార‌త ఆట‌గాళ్లు క‌ర‌చాల‌నం చేసే అవ‌కాశం లేదు. అయితే.. ఫైన‌ల్ మ్యాచ్ ముగిసిన త‌రువాత మాత్రం ఇరు దేశాల ఆట‌గాళ్లు పోడియాన్ని పంచుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ మ్యాచ్‌కు ఐసీసీ ఛైర్మ‌న్ జైషా, బీసీసీఐ కార్య‌ద‌ర్శి దేవ‌జిత్ సైకియా హాజ‌రు కానున్న‌ట్లు స‌మాచారం.

ఇదిలా ఉంటే.. క్రికెట్ మిన‌హా మిగిలిన క్రీడ‌ల్లో భార‌త్, పాకిస్థాన్ అథ్లెట్లు క‌ర‌చాల‌నం చేసుకోవ‌డం గ‌మ‌నార్హం.