Ishan Kishan : ఇషాన్ కిషన్‌కు షాక్.. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ నుంచి తప్పించిన బీసీసీఐ.. ఎందుకంటే..?
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు ముందు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది.
- Thota Vamshi Kumar
- Updated on- December 17, 2023 / 04:34 PM IST
Ishan Kishan withdrawn from Team India Test squad
Ishan Kishan-KS Bharat : భారత జట్టు ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉంది. మూడు మ్యాచుల టీ20 సిరీస్ పూర్తి కాగా.. సిరీస్ 1-1తో సమమైంది. ఇక మూడు మ్యాచుల వన్డే సిరీస్‌లో భాగంగా నేడు (ఆదివారం) తొలి వన్డేలో భారత్, దక్షిణాఫ్రికాలు తలపడుతున్నాయి. కాగా.. డిసెంబర్ 26 నుంచి ఇరు జట్ల మధ్య రెండు మ్యాచుల టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. అయితే.. టెస్టు సిరీస్‌కు ముందు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది.
టెస్టు సిరీస్ కోసం ఇప్పటికే బీసీసీఐ జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ జట్టు నుంచి యువ ఆటగాడు ఇషాన్ కిషన్‌ను తప్పించింది. అతడి స్థానంలో తెలుగు కుర్రాడు కేఎస్ భరత్‌కు అవకాశం ఇచ్చింది.
KS Bharat
ఈ విషయాన్ని బీసీసీఐ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. వ్యక్తిగత కారణాల వల్ల దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు తనకు విశ్రాంతి ఇవ్వాలని ఇషాన్ కిషన్ కోరడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. ఇప్పటికే టెస్టు సిరీస్‌కు ఎంపికైన మహ్మద్ షమీ గాయంతో బాధపడుతుండడంతో అతడి కూడా తప్పించిన సంగతి తెలిసిందే.
దక్షిణాఫ్రికాతో టెస్టులకు భారత జట్టు ఇదే : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), ప్రసిద్ధ్ కృష్ణ.
Nathan Lyon : నాథన్ లియోన్ అరుదైన ఘనత.. 500 వికెట్ల క్లబ్లో చోటు.. అశ్విన్‌కు కష్టమేనా..!
