Pink Jerseys : పింక్ క‌ల‌ర్ జెర్సీతో బ‌రిలోకి దిగిన ద‌క్షిణాఫ్రికా ఆట‌గాళ్లు.. స్టేడియం మొత్తం గులాబీమ‌యం.. ఎందుకో తెలుసా..?

ఈ మ్యాచ్‌లో ద‌క్షిణాప్రికా ఆట‌గాళ్లు ఆకుప‌చ్చ రంగు జెర్సీలో కాకుండా పింక్ క‌ల‌ర్ జెర్సీతో బ‌రిలోకి దిగారు.

Pink Jerseys : పింక్ క‌ల‌ర్ జెర్సీతో బ‌రిలోకి దిగిన ద‌క్షిణాఫ్రికా ఆట‌గాళ్లు.. స్టేడియం మొత్తం గులాబీమ‌యం.. ఎందుకో తెలుసా..?

South Africa players Is Wearing Pink Jersey Against India In The 1st ODI

South Africa players Wearing Pink Jersey : మూడు వ‌న్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం (డిసెంబ‌ర్ 17)న భార‌త్‌, ద‌క్షిణాఫ్రికా జ‌ట్ల మ‌ధ్య తొలి వ‌న్డే మ్యాచ్ జ‌రుగుతోంది. జోహన్నెస్‌బర్గ్ వేదిక‌గా వాండ‌రర్స్ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదికైంది. టాస్ గెలిచిన ద‌క్షిణాఫ్రికా మొద‌ట బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే.. ఈ మ్యాచ్‌లో ద‌క్షిణాప్రికా ఆట‌గాళ్లు ఆకుప‌చ్చ రంగు జెర్సీలో కాకుండా పింక్ క‌ల‌ర్ జెర్సీతో బ‌రిలోకి దిగారు. ద‌క్షిణాఫ్రికా ఆట‌గాళ్లు మాత్ర‌మే కాదు, ఆ జ‌ట్టు స‌హ‌య‌క సిబ్బందితో పాటు మ్యాచ్ చూసేందుకు వ‌చ్చిన అభిమానులు కూడా గులాబీ రంగు జెర్సీల‌ను వేసుకునే వ‌చ్చారు.

దీంతో మైదానం మొత్తం గులాభీమ‌యంగా మారిపోయింది. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఎందుక‌ని సౌతాఫ్రికా ఆట‌గాళ్లు ఎందుకు పింక్ క‌ల‌ర్ జెర్సీల‌తో ఆడుతున్నార‌నే విష‌యం పై ప్ర‌స్తుతం చ‌ర్చ జ‌రుగుతోంది.

Nathan Lyon : నాథ‌న్ లియోన్ అరుదైన ఘ‌న‌త‌.. 500 వికెట్ల క్ల‌బ్‌లో చోటు.. అశ్విన్‌కు క‌ష్ట‌మేనా..!

గులాబీ రంగు ఎందుకంటే..?

ద‌క్షిణాఫ్రికా ఆట‌గాళ్ల‌తో పాటు అభిమానులు పింక్ క‌ల‌ర్ జెర్సీ వేసుకోవ‌డానికి ఓ కార‌ణం ఉంది. పింక్ డే సంద‌ర్భంగా వారు ఈ ఈ రంగు దుస్తుల‌ను ధ‌రించారు. రొమ్ము క్యాన్స‌ర్ పై అవ‌గాహ‌న పెంచ‌డం కోస‌మే వీళ్లంతా పింక్ జెర్సీల‌ను ధ‌రించాడు. ఈ మ్యాచ్ ద్వారా ల‌భించే మొత్తంలో కొంత భాగం రొమ్ము క్యాన్స‌ర్‌కు బాధితుల‌ను ఆదుకునేందుకు ఖ‌ర్చు చేయ‌నున్నారు.

దీనిపై క్రికెట్ సౌతాఫ్రికా సీఈఓ ఫోలేట్సీ మోసెకి మాట్లాడుతూ.. “క్రికెట్ అభిమానులతో రొమ్ము క్యాన్సర్ గురించి మరోసారి అవగాహన కల్పించడం ఎంతో ఆనందంగా ఉంద‌ని చెప్పుకొచ్చారు. రొమ్ము క్యాన్సర్‌పై పోరాటంలో సాయం చేయడానికి, అవగాహన మాత్రమే సరిపోదన్నారు. ప్ర‌జ‌లు ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని సూచించారు. దీనిని ముందస్తుగా గుర్తించి చికిత్స తీసుకుంటే స‌రిపోతుంద‌న్నారు.

IND vs ENG : అలా కాదు భ‌య్యా ఫోటోలు తీసేది.. ఇలా క‌దా తీయాలి.. భార‌త మ‌హిళా క్రికెట‌ర్ పాఠాలు..!

ఇదిలా ఉంటే.. దక్షిణాఫ్రికా పురుషుల క్రికెట్ జట్టు ఇప్పటివరకు పింక్ క‌ల‌ర్ జెర్సీలో 11 వ‌న్డే మ్యాచులు ఆడింది. ఇందులో 9 మ్యాచుల్లో గెలుపొందింది. 2015లో వెస్టిండీస్‌తో జ‌రిగిన పింక్ వన్డే మ్యాచ్‌లో 31 బంతుల్లోనే అప్ప‌టి ద‌క్షిణాఫ్రికా కెప్టెన్ ఏబీ డివిలియ‌ర్స్ సెంచ‌రీ చేసి చ‌రిత్ర సృష్టించాడు.