IND vs ENG : అలా కాదు భ‌య్యా ఫోటోలు తీసేది.. ఇలా క‌దా తీయాలి.. భార‌త మ‌హిళా క్రికెట‌ర్ పాఠాలు..!

IND-W vs ENG-W Test : టెస్టు సిరీస్ గెలుచుకున్న ఆనందంలో టీమ్ఇండియా ప్లేయ‌ర్ల సంబ‌రాలు అంబ‌రాన్ని అంటాయి. ఇక‌ ట్రోఫీతో వినూత్నంగా సెల్ఫీలు దిగారు.

IND vs ENG : అలా కాదు భ‌య్యా ఫోటోలు తీసేది.. ఇలా క‌దా తీయాలి.. భార‌త మ‌హిళా క్రికెట‌ర్ పాఠాలు..!

Jemimah Rodrigues clicks a winners selfies it viral on social media

ఇంగ్లాండ్ మ‌హిళ‌ల జ‌ట్టుతో ముంబైలో జ‌రిగిన ఏకైక టెస్టు మ్యాచులో టీమ్ఇండియా ఘ‌న విజ‌యాన్ని సాధించింది. 347 ప‌రుగుల తేడాతో గెలుపొందింది. మహిళల టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యధిక పరుగుల తేడాతో గెలిచిన జట్టుగా టీమ్ఇండియా రికార్డుల‌కు ఎక్కింది. టెస్టు సిరీస్ గెలుచుకున్న ఆనందంలో టీమ్ఇండియా ప్లేయ‌ర్ల సంబ‌రాలు అంబ‌రాన్ని అంటాయి. ఇక‌ ట్రోఫీతో వినూత్నంగా సెల్ఫీలు దిగారు.

భార‌త జ‌ట్టు యువ క్రీడాకారిణి జెమీమా రోడ్రిగ్స్ నేలపై పడుకొని సెల్ఫీ తీసిన‌ ఫోటోలు, వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ట్రోఫీతో ప్లేయ‌ర్లతో పాటు స‌పోర్టింగ్ సిబ్బంది ఫోటోల‌కు ఫోజులు ఇస్తుండ‌గా రోడ్రిగ్స్ మాత్రం ముందుకు వ‌చ్చి నేల‌పై ప‌డుకుని సెల్ఫీలు తీసింది. ఇది నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఫోటోలు తీయ‌డం అలా కాదు ఇలా తీయాల‌ని అని మ‌హిళా క్రికెట‌ర్ పాఠాలు నేర్పిస్తుంద‌ని నెటీజ‌న్లు స‌ర‌దాగా కామెంట్లు చేస్తున్నారు.

Rohit Sharma : చెన్నై జ‌ట్టులోకి రోహిత్ శ‌ర్మ వ‌స్తే.. సీఎస్‌కే మాజీ ఆట‌గాడి పోస్ట్ వైర‌ల్‌

479 పరుగుల భారీ ల‌క్ష్యంతో మూడో రోజు ఇంగ్లాండ్ జ‌ట్టు రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. అయితే.. భార‌త బౌల‌ర్ల ధాటికి ఇంగ్లీష్ బ్యాట‌ర్లు పెవిలియ‌న్‌కు క్యూ క‌ట్టారు. ఒక్క‌రు కూడా క్రీజులో నిల‌వ‌లేక‌పోవ‌డంతో మొద‌టి సెష‌న్‌లోనే ఇంగ్లాండ్ 131 ప‌రుగుల‌కు ఆలౌటైంది. భార‌త బౌల‌ర్ల‌లో దీప్తి శ‌ర్మ నాలుగు వికెట్లు తీసింది. పూజా వ‌స్త్రాక‌ర్ మూడు, రాజేశ్వ‌రీ గైక్వాడ్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టింది. ఇంగ్లాండ్ బ్యాట‌ర్ల‌లో చార్లీ డీన్(33 బంతుల్లో 3 ఫోర్లతో 20 నాటౌట్) టాప్ స్కోరర్‌గా కావ‌డం గ‌మ‌నార్హం.

Suryakumar Yadav : పాండ్యకు కెప్టెన్సీ.. తన గుండె బ‌ద్ద‌లైంద‌న్న సూర్య‌కుమార్‌

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా మొద‌టి ఇన్నింగ్స్‌లో 428 పరుగులు చేసింది. సతీష్ శుభా(69), జెమీమా రోడ్రిగ్స్(68), దీప్తి శర్మ(67), యస్తికా భాటియా(66) రాణించారు. అనంత‌రం బౌలింగ్‌లో దీప్తి శ‌ర్మ ఐదు వికెట్లతో విజృంభించ‌డంతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 136 ప‌రుగుల‌కు కుప్ప‌కూలింది. నాట్ సీవర్ బ్రంట్(59) అర్ధ‌శ‌త‌కంతో రాణించింది. దీంతో టీమ్ఇండియాకు 392 ప‌రుగుల మొద‌టి ఇన్నింగ్స్ ఆధిక్యం ద‌క్కింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో భార‌త్‌ 186/6 వ‌ద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. దీంతో ఇంగ్లాండ్ ముందు 479 ప‌రుగుల ల‌క్ష్యం నిలిచింది.