Nathan Lyon : నాథన్ లియోన్ అరుదైన ఘనత.. 500 వికెట్ల క్లబ్‌లో చోటు.. అశ్విన్‌కు కష్టమేనా..!
Nathan Lyon 500 Test wicket : ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియోన్ అరుదైన ఘనతను సాధించాడు. టెస్టు క్రికెట్‌లో 500కు పైగా వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు.

Nathan Lyon Joins Legendary List With 500th Test Wicket
ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియోన్ అరుదైన ఘనతను సాధించాడు. టెస్టు క్రికెట్‌లో 500కు పైగా వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. పెర్త్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మొదటి టెస్టు మ్యాచులో అతడు ఈ ఘనతను అందుకున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో 500 పైగా వికెట్లు తీసిన మూడో ఆస్ట్రేలియా బౌలర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. ఓవరాల్‌గా ఎనిమిదో బౌలర్‌గా నిలిచాడు. నాలుగో రోజు ఆటలో ఫహీమ్ అష్రఫ్‌ను ఔట్ చేయడంతో 36 ఏళ్ల లియోన్ ఈ మైలురాయిని చేరుకున్నాడు. 123 మ్యాచుల్లోనే అతడు ఈ ఘనతను అందుకున్నాడు.
హైడ్రామా..
నాథన్ లియోన్ వేసిన బంతిని ఫహీమ్ అష్రఫ్ డిఫెన్స్ ఆడాడు. బాల్ అతడి బ్యాట్‌ను తాకకుండా ప్యాడ్లను తాకింది. దీంతో లియోన్‌తో పాటు ఆసీస్ ఫీల్డర్లు ఔట్ అంటూ అప్పీల్ చేశారు. అయితే.. ఆన్‌ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. కానీ లియోన్ అది ఖచ్చితంగా ఔట్ అని నమ్మకంగా చెప్పడంతో కెప్టెన్ పాట్ కమిన్స్ రివ్యూ తీసుకున్నాడు. బాల్ ట్రాకింగ్ ద్వారా బంతి వికెట్లను తాకున్నట్లు కనిపించడంతో థర్డ్ అంపైర్ ఔట్ ఇచ్చాడు. దీంతో లియోన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
Rohit Sharma : రోహిత్ శర్మ భార్య రితికా ఆసక్తికర ట్వీట్.. నెటిజన్లు ఫుల్ సపోర్ట్.. ఎందుకంటే?
FIVE HUNDRED! #AUSvPAK #PlayOfTheDay @nrmainsurance pic.twitter.com/DyDC5hUdTJ
— cricket.com.au (@cricketcomau) December 17, 2023
పెర్త్ టెస్టును 496 వికెట్లతో లియోన్ ప్రారంభించాడు. పాకిస్తాన్ మొదటి ఇన్నింగ్స్ పూర్తి అయ్యే సమయానికి 499 వికెట్ల వద్ద నిలిచాడు. పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్‌లో అష్రఫ్ ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేయడం ద్వారా 500 వికెట్ల క్లబ్‌లో చేరాడు. ఆ తరువాత అమీర్ జమాల్‌ను బౌల్డ్ చేసి 501 వ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. 2011లో టెస్టు క్రికెట్‌లో లియోన్ అరంగ్రేటం చేశాడు. ఇప్పటి వరకు 4 సార్లు పది వికెట్ల ఘనతను, 23 సార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. అత్యుత్తమ గణాంకాలు 8/50.
ఆసీస్ తరుపున మూడో ఆటగాడు..
ఆస్ట్రేలియా తరుపున టెస్టు క్రికెట్‌లో 500 వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో లియోన్ మూడో స్థానంలో నిలిచాడు. అతడి కంటే ముందు షేన్ వార్న్ (708), గ్లెన్ మెక్‌గ్రాత్ (563) లు ఉన్నారు. ఇక ఓవరాల్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ ఘనత అందుకున్న ఎనిమిదో ఆటగాడిగా లియోన్ రికార్డులకు ఎక్కాడు. ఈ జాబితాలో 800 వికెట్లతో శ్రీలంక ఆటగాడు ముత్తయ్య మురళీధరన్ అగ్రస్థానంలో ఉన్నాడు.
2010 – part of groundstaff.
2023 – picking 500 Test wickets.
– Inspirational stuff from Nathan Lyon…!!! pic.twitter.com/ZjQjVPO3jU
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 17, 2023
టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు..
ముత్తయ్య మురళీధరన్ (శ్రీలంక) – 800 వికెట్లు
షేన్ వార్న్ (ఆస్ట్రేలియా) – 708
జేమ్స్ ఆండర్సన్(ఇంగ్లాండ్) – 690
అనిల్ కుంబ్లే (భారత్) – 619
స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లాండ్) – 604
గ్లెన్ మెక్‌గ్రాత్ (ఆస్ట్రేలియా) – 563
కోర్ట్నీ వాల్ష్ (వెస్టిండీస్) – 519
నాథన్ లియోన్ (ఆస్ట్రేలియా) – 501*
IND vs ENG : అలా కాదు భయ్యా ఫోటోలు తీసేది.. ఇలా కదా తీయాలి.. భారత మహిళా క్రికెటర్ పాఠాలు..!
వెన్నంటే అశ్విన్..
ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న వారిలో నాథన్ లియోన్‌కు దగ్గరగా కేవలం భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మాత్రమే ఉన్నాడు. 94 టెస్టు మ్యాచుల్లో అశ్విన్ 489 వికెట్లు పడగొట్టాడు. దక్షిణాఫ్రికాతో భారత జట్టు డిసెంబర్ 26 నుంచి రెండు టెస్టు మ్యాచుల సిరీస్ ఆడనుంది. ఈ రెండు మ్యాచుల్లో అశ్విన్ మంచి ప్రదర్శన చేస్తే.. 500 వికెట్ల క్లబ్‌లో చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయి.