Rohit Sharma : రోహిత్ శర్మ భార్య రితికా ఆసక్తికర ట్వీట్.. నెటిజన్లు ఫుల్ సపోర్ట్.. ఎందుకంటే?
కెప్టెన్సీ మార్పు పై రోహిత్ శర్మ ఇంకా స్పందించలేదు. సఫారీలతో రెండు టెస్టు మ్యాచుల సిరీస్ కోసం అతడు శుక్రవారం దక్షిణాఫ్రికా విమానం ఎక్కాడు. కాగా.. రోహిత్ శర్మను సంప్రదించకుండా ...

Rohit Sharma
Rohit sharma wife Ritika Sajdeh : ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి రోహిత్ శర్మను తప్పించిన సంగతి తెలిసిందే. అతడి స్థానంలో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య ను కెప్టెన్ గా నియమించింది. ముంబై తీసుకున్న ఈ నిర్ణయంపై రోహిత్ ఫ్యాన్స్ తో పాటు, పలువురు క్రీడాభిమానులు మండిపడుతున్నారు. ఇంత అర్థాంతరంగా రోహిత్ ను తప్పించాల్సిన పని ఏముందని కామెంట్లు చేస్తున్నారు. పలువురు మాజీ క్రికెటర్లుసైతం ముంబై ఇండియన్స్ యాజమాన్యం నిర్ణయాన్ని తప్పుబడుతూ రోహిత్ కు మద్దతుగా సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
రోహిత్ శర్మను కెప్టెన్సీ బాధ్యతల నుంచి ముంబై ఇండియన్స్ యాజమాన్యం తొలగించడంపై టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్, ముంబై ఇండియన్స్‌లో కీలక ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ సోషల్ మీడియాలో స్పందించాడు. హార్ట్ బ్రేక్ ఎమోజీని షేర్ చేశాడు. ఎలాంటి కామెంట్ కానీ, హ్యాష్ ట్యాగ్ లేకుండానే తన బాధను తెలియజేశాడు. ఇది నెట్టింట వైరల్ గా మారింది. సూర్యకుమార్ యాదవ్ ట్వీట్ ను రీ ట్వీట్ చేసిన రోహిత్ శర్మ సతీమణి రితిక సజ్దేహ్ హార్ట్ బ్రేక్ ఎమోజీని పెట్టారు. దీంతో రోహిత్ అభిమానులు, పలువురు నెటిజన్లు రితిక ట్వీట్ కు మద్దతుగా రీ ట్వీట్లు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే కెప్టెన్సీ మార్పు పై రోహిత్ శర్మ ఇంకా స్పందించలేదు. సఫారీలతో రెండు టెస్టు మ్యాచుల సిరీస్ కోసం అతడు శుక్రవారం దక్షిణాఫ్రికా విమానం ఎక్కాడు. కాగా.. రోహిత్ శర్మను సంప్రదించకుండా ముంబై ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉండదని పలువురు ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. మరోవైపు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తేనే ముంబై ఇండియన్స్ జట్టులోకి వస్తానని హార్దిక్ పాండ్యా యాజమాన్యం వద్ద షరతు పెట్టినట్లు తెలుస్తుంది. ఫలితంగా తప్పని పరిస్థితుల్లో రోహిత్ ను కెప్టెన్సీ నుంచి తప్పించి హార్దిక్ పాండ్యాకు జట్టు సారధ్య బాధ్యతలు అప్పగించినట్లు పలు జాతీయ మీడియాల్లో కథనాలు వచ్చాయి.
— Ritika Sajdeh Team (@ImRitika45) December 16, 2023