Sreesanth : కెప్టెన్‌గా సంజు శాంసన్ వద్దు.. రాయల్స్ వేరొక ప్లేయర్‌ని చూసుకుంటే బెటర్ : శ్రీశాంత్
Sreesanth - Sanju Samson : సంజు శాంసన్‌ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించాలని భారత మాజీ ఆటగాడు శ్రీశాంత్ అన్నాడు.

Sreesanth wants Sanju Samson replaced as Rajasthan Royals captain
సంజు శాంసన్‌ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించాలని భారత మాజీ ఆటగాడు శ్రీశాంత్ అన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ అనుకున్న ఫలితాలను రాబట్టాలంటే ఇలా చేయక తప్పదన్నాడు. సంజు శాంసన్‌లో నిలకడ లేదని, ప్రస్తుతం ఆర్ఆర్ జట్టుకు రోహిత్ శర్మ వంటి అనుభవం గల ఆటగాడు కావాలని చెప్పాడు. ఇందుకు జోస్ బట్లర్ సరైన వ్యక్తి అని అభిప్రాయ పడ్డాడు. ప్రస్తుతం శీశ్రాంత్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.
కాగా.. సంజు శాంసన్ నాయకత్వంలో ఐపీఎల్ 2022 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ఫైనల్‌కు చేరుకుంది. అయితే.. ఐపీఎల్ 2023 సీజన్‌లో మాత్రం ఘోరంగా విఫలమైంది. 14 మ్యాచుల్లో ఏడింటిలో మాత్రమే విజయం సాధించగా మరో ఏడు మ్యాచుల్లో ఓడిపోయింది. ఈ క్రమంలో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచి సెమీ ఫైనల్‌కు చేరకుండానే నిష్ర్కమించింది. ఐపీఎల్ 2024 సీజన్ ముందు పలు జట్లు కెప్టెన్లు మారుస్తున్న నేపథ్యంలో శ్రీశాంత్ ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది.
IND vs ENG : అలా కాదు భయ్యా ఫోటోలు తీసేది.. ఇలా కదా తీయాలి.. భారత మహిళా క్రికెటర్ పాఠాలు..!
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ ఎంపిక కాగా, శ్రేయస్ అయ్యర్ తిరిగి కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. ఇక ముంబై ఇండియన్స్ అయితే ఏకంగా రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ పాండ్యకు బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే.
అప్పుడు బాగుండేది..
తన అభిప్రాయం ప్రకారం రాజస్థాన్ రాయల్స్ తన సిస్టం మొత్తాన్ని మార్చుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డాడు. తాను ఆర్ఆర్‌కు ఆడిన సమయంలో మేనేజ్‌మెంట్ అన్ని విషయాల్లో జాగ్రత్త వహించేదని చెప్పాడు. ఆ సమయంలో రాహుల్ ద్రవిడ్ కెప్టెన్‌గా ఉండేవాడు. అతనికి చాలా స్పష్టమైన విజన్, వ్యూహాలు ఉండేవన్నాడు. తాను ఆడిన అత్యుత్తమ కెప్టెన్ల జాబితాలో రాహుల్ ద్రవిడ్ ఒకరన్నాడు.
సంజు తన కెప్టెన్సీ బాధ్యతలను సీరియస్‌గా తీసుకోవాలని సూచించాడు. బట్లర్‌కు పగ్గాలు అప్పగిస్తే బాగుందన్నాడు. బట్లర్‌కు టీ20 ప్రపంచకప్ గెలిచిన ట్రాక్ రికార్డు ఉందన్నాడు. వన్డే ప్రపంచకప్ 2023లో గొప్ప రికార్డు లేకపోయిన మాట వాస్తవమేనని చెప్పాడు. అయినప్పటికీ కెప్టెన్‌గా అతడికి ఉన్న అనుభం జట్టుకు చాలా ఉపయోగపడుతుందన్నాడు.
WI vs ENG 2nd T20 : సిక్స్ ఇలా కొట్టాలని ఇన్ని రోజులు తెలియదు భయ్యా..! వీడియో వైరల్
కాగా.. 29 ఏళ్ల శాంసన్ రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా మిశ్రమ రికార్డును కలిగి ఉన్నాడు. అతడి సారథ్యంలో ఆర్ఆర్ 45 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 22 గేమ్‌లను గెలవగా, మరో 23 మ్యాచుల్లో ఓడింది. మొత్తంగా ఐపీఎల్‌లో ఇప్పటి వరకు సంజు శాంసన్ 152 మ్యాచులు ఆడాడు. 29.23 సగటుతో 3,888 పరుగులు చేశాడు. ఇందులో మూడు శతకాలు, 20 అర్థశతకాలు ఉన్నాయి.